ప్రేమగల యేసయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ప్రేమగల యేసయ్యా
జీవ వృక్షమా యేసయ్యా (2)
సిలువలో బలి అయిన యేసయ్యా
తులువలో వెలి అయిన యేసయ్యా (2)
పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా
పరిశుద్ధుడా నా ప్రాణేశ్వరా
పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా
పరిశుద్ధుడా నా ప్రాణ ప్రియుడా       ||ప్రేమగల||

యేసయ్య నీ శిరముపై మూళ్ళ కిరీటం మొత్తగా
రక్తమంత నీ కణతలపై ధారలుగా కారుచుండగా
కొరడాల దెబ్బలు చెళ్లుమనెను
శరీరపు కండలే వేలాడేను (2)
నలిగిపోతివా నా యేసయ్యా (2)        ||పరిశుద్ధుడా||

యేసయ్యను కొట్టిరి జాలిలేని ఆ మనుష్యులు
ముఖానపై ఉమ్మి వేసిరి కరుణ లేని కక్షకులు
గడ్డము పట్టాయనను లాగుచుండగా
నాగటి వలె సిలువలో దున్నబడగా (2)
ఒరిగిపోతివా నా యేసయ్యా (2)        ||పరిశుద్ధుడా||

యేసయ్య ఆ కల్వరిలో దాహముకై తపియించగా
మధురమైన ఆ నోటికి చేదు చిరకను ఇచ్చిరే
తనువంత రుధిరముతో తడిసిపోయెనే
తండ్రీ అని కేక వేసి మరణించెనే (2)
మూడవ దినాన తిరిగి లేచెను (2)        ||పరిశుద్ధుడా||

English Lyrics

Audio

ప్రేమగల మా ప్రభువా

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Seeyonu Geethaalu

Telugu Lyrics

ప్రేమగల మా ప్రభువా
ప్రేమయై యున్నావయా (2)          ||ప్రేమగల||

నీదు ప్రేమ నిత్యమైనది – కరుణతో నాకర్షించె (2)
నిక్కముగ రుజువాయెను – ప్రాణమిచ్చుట ద్వారనే (2)          ||ప్రేమగల||

అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను (2)
అద్భుత ప్రేమ యిదే పాపములను కప్పెను (2)          ||ప్రేమగల||

బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను (2)
వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను (2)          ||ప్రేమగల||

తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు (2)
తండ్రి ప్రేమ మారదు – మార్పుచెందని ప్రేమయే (2)          ||ప్రేమగల||

మరణమంత బలముగలది నీదు ప్రేమ ప్రభువా (2)
వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను (2)          ||ప్రేమగల||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

యేసు మంచి దేవుడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు మంచి దేవుడు – ప్రేమగల దేవుడు
యేసు గొప్ప దేవుడు – పరలోకమిచ్చు నాథుడు (2)
ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనును
చింతలన్ని బాపి శాంతినిచ్చును (2)       ||యేసు మంచి||

శాశ్వతమైన ప్రేమతో
నిన్ను నన్ను ప్రేమించాడు (2)
సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు
తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు (2)       ||యేసు మంచి||

శాంతి సమాధానం మనకిచ్చాడు
సమతా మమత నేర్పించాడు (2)
మార్గము సత్యము జీవమైనాడు
మానవాళికే ప్రాణమైనాడు (2)       ||యేసు మంచి||

English Lyrics

Audio

 

 

HOME