జై జై యేసు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

జై జై యేసు రాజా జై జై
రాజాధిరాజా నీకే జై జై – (2)       ||జై జై||

పాపకూపములో బడియున్న (2)
నన్ను జూచి చేయి జాచి (2)
చక్కగ దరికి జేర్చితివి (2)       ||జై జై||

సిలువ రక్తములో నన్ను కడిగి (2)
పాపమంతా పరిహరించిన (2)
పావనుడగు నా ప్రభుయేసు (2)       ||జై జై||

నీతి హీనుడనైన నాకు (2)
నీతి రక్షణ వస్త్రములను (2)
ప్రీతితో నొసగిన నీతి రాజా (2)       ||జై జై||

మంటి పురుగునైన నన్ను (2)
మంటి నుండి మింట జేర్చిన (2)
మహాప్రభుండా నీకే జై జై (2)       ||జై జై||

పాపశాపగ్రస్తుడనై యుండ (2)
నన్ను గూడ నీ స్వకీయ (2)
సంపాద్యముగా జేసితివి (2)       ||జై జై||

రాజులైన యాజక గుంపులో (2)
నన్ను గూడ నీ సొత్తైన (2)
పరిశుద్ధ జనములో జేర్చితివి (2)       ||జై జై||

తల్లియైన మరచిన మరచును (2)
నేను నిన్ను మరువననిన (2)
నమ్మకమైన నా ప్రభువా (2)       ||జై జై||

అధిక స్తోత్రార్హుడవైన (2)
ఆది యంతము లేని దేవా (2)
యుగా యుగములకు నీకే జై జై (2)       ||జై జై||

Download Lyrics as: PPT

సర్వోన్నత

పాట రచయిత: డేనియల్ పమ్మి
Lyricist: Daniel Pammi

Telugu Lyrics


సర్వోన్నత స్థలములలో సమాధానము
ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను (2)
హల్లెలూయా అర్పణలు – ఉల్లముతో చెల్లింతుమ్
రాజాధి రాజునకు – హోసన్నా ప్రభువునకు (2)      ||సర్వోన్నత||

పశువుల పాకలో మనకు శిశువు జన్మించె
పొత్తిగుడ్డలలో చుట్టగ పవళించిన తండ్రి (2)
ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త (2)
నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు (2)         ||హల్లెలూయా||

మన వ్యసనములను బాప మొత్తబడుట కొరకై
మన సమాధానార్థ శిక్ష మోపబడుట కొరకై (2)
మన దోషము బాప – మానవరూపమున (2)
జనియించె బాలుండు ఇమ్మానుయేలుండు (2)         ||హల్లెలూయా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

రాజాధి రాజా రారా

పాట రచయిత: ఈ డి నిత్యానందము
Lyricist: E D Nithyaanandamu

Telugu Lyrics


రాజాధి రాజా రారా – రాజులకు రాజువై రారా
రాజయేసు రాజ్యమేల రారా – రవికోటి తేజ యేసు రారా (2)
ఓ… మేఘ వాహనంబు మీద వేగమే
ఓ… మించు వైభవంబు తోడ వేగమే     ||రాజాధి||

ఓ… భూజనంబులెల్ల తేరిచూడగా
ఓ… నీ జనంబు స్వాగతంబునీయగా
నీ రాజ్యస్థాపనంబు సేయ – భూరాజులెల్ల గూలిపోవ
భూమి ఆకసంబు మారిపోవ – నీ మహా ప్రభావమున వేగ     ||రాజాధి||

ఆ… ఆకసమున దూత లార్భటింపగా
ఆ… ఆదిభక్త సంఘ సమేతంబుగా
ఆకసంబు మధ్య వీధిలోన – ఏకమై మహాసభ జేయ
యేసు నాధ! నీదు మహిమలోన – మాకదే మహానందమౌగ     ||రాజాధి||

ఓ… పరమ యెరుషలేము పుణ్య సంఘమా
ఓ… గొఱియపిల్ల క్రీస్తు పుణ్య సంఘమా
పరమ దూతలార! భక్తులారా! – పౌలపోస్తులారా! పెద్దలారా!
గొఱియపిల్ల యేసురాజు పేర – క్రొత్త గీతమెత్తి పాడరారా     ||రాజాధి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసు నాథా దేవా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు నాథా దేవా
వందనాలు రాజా.. వందనాలు
రాజాధి రాజా నీకే వందనాలు
రవి కోటి తేజా నీకే వందనాలు (2)      ||యేసు నాథా||

పాపిని కరుణించి ప్రాణ దానమిచ్చావు
పరమ జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి (2)
పన్నెండు గుమ్మముల…
పట్టణమే నాకు కట్టిపెట్టినావా      ||రాజాధి రాజా||

నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు
నీ నీతి నాకిచ్చి నిత్య రాజ్యమిచ్చావు (2)
నీ నీతి నీ రాజ్యం…
నిండైన నా భాగ్యమే      ||రాజాధి రాజా||

హీనుని దీవించి ఘనునిగా చేసావు
నీ రుధిరమే కార్చి నా ఋణము దీర్చావు (2)
నా సల్లనయ్యా…
నా యన్న నీవే నా యేసయ్యా      ||రాజాధి రాజా||

కన్ను మిన్ను గానకుండా నిన్ను మీరిపోయాను
చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు (2)
నీ మనసే వెన్నయ్యా…
నా కన్న తండ్రి నా యేసయ్యా      ||రాజాధి రాజా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

హల్లెలూయా ఆరాధన

పాట రచయిత: లిల్లియన్ క్రిస్టోఫర్
Lyricist: Lillyan Christopher

Telugu Lyrics

హల్లెలూయా ఆరాధన
రాజాధి రాజు యేసునకే
మహిమయు ఘనతయు
సర్వాధికారి క్రీస్తునకే (2)
చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ
ఆ ప్రభుని కీర్తించెదం
నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో
స్తోత్రార్పణ చేసెదం        ||హల్లెలూయా||

రూపింప బడక ముందే
నన్ను ఎరిగితివి
నా పాదములు జారకుండా
రక్షించి నడిపితివి (2)        ||చప్పట్లు||

అభిషేక వస్త్రము నిచ్చి
వీరులుగా చేసితివి
అపవాది క్రియలను జయించే
ప్రార్థన శక్తినిచ్చితివి (2)        ||చప్పట్లు||

English Lyrics

Audio

రాజాధి రాజ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రాజాధి రాజ రవి కోటి తేజ
రమణీయ సామ్రాజ్య పరిపాలక (2)
విడువని కృప నాలో స్థాపించెనే
సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును (2)        ||రాజాధి||

వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును – నా కొరకే త్యాగము చేసి (2)
కృపా సత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను – నేను ప్రకటించెద (2)        ||రాజాధి||

ఊహలకందని ఉన్నతమైన నీ
ఉద్దేశములను – నా యెడల సఫలపరచి (2)
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీ కన్నా తోడెవ్వరు – లేరు ఈ ధరణిలో (2)        ||రాజాధి||

మకుటము ధరించిన మహారాజువై నీ
సౌభాగ్యమును – నా కొరకే సిద్ధపరచితివి (2)
నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద – స్తోత్ర సంకీర్తనలే (2)        ||రాజాధి||

English Lyrics

Audio

HOME