ప్రభుని రాకడ

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ప్రభుని రాకడ – ఈ దినమే
పరుగులిడి రండి – సుదినమే (2)
పరమునందుండి – మన ప్రభువు
ధరకు నరుగును – పాలనకై (2)
బూరశబ్దముతో – జనులారా       ||ప్రభుని||

సిద్ధులగు వారిన్ – మన యేసు
శుద్ధి జేయునిలన్ – పరమునకై (2)
బుద్ధిహీనులను – శ్రమలచేత
బద్ధులుగ జేయున్ – వేదనతో (2)
బాధ కలిగించున్ – సాతాను       ||ప్రభుని||

స్వరముతో వచ్చున్ – అధికారి
మహిమతో మరలున్ – తన దూత (2)
సూర్యచంద్రునిలన్ – తారలతో
జీకటుల్ క్రమ్మున్ – ప్రభు రాక (2)
పగలు రాత్రియగున్ – త్వరపడుము       ||ప్రభుని||

మొదట లేతురు – సజీవులై
ప్రభునియందుండు – ఆ మృతులు (2)
మరల అందరము – ఆ ధ్వనితో
పరము జేరుదుము – ధరనుండి (2)
ధన్యులగుదుము – పరికించు       ||ప్రభుని||

వెయ్యియేండ్లు – పాలించెదరు
ప్రియుని రాజ్యమున – ప్రియులు (2)
సాయం సమయమున – చేరి
నెమలి కోకిలలు – రాజున్ (2)
పాడి స్తుతించును – ఆ దినము       ||ప్రభుని||

గొర్రె మేకలును – ఆ చిరుత
సింహజాతులును – ఒక చోట (2)
భేధము లేక – బరుండి
గరిక మేయును – ఆ వేళ (2)
కలసి మెలగును – భయపడక       ||ప్రభుని||

న్యాయ నీతులన్ – మన ప్రభువు
ఖాయముగ దెల్పున్ – ఆనాడు (2)
సాక్షులుగ నిలుతుం – అందరము
స్వామియేసునకు – ధ్వజమెత్తి (2)
చాటి యేసునకు – ఓ ప్రియుడా       ||ప్రభుని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఎటు చూచినా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఎటు చూచినా యుద్ధ సమాచారాలు
ఎటు చూచినా కరువూ భూకంపాలు
ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు
ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు
ఓ సోదరా ఓ సోదరీ (2)
రాకడ గురుతులని తెలుసుకోవా
తినుటకు త్రాగుటకు ఇది సమయమా       ||ఎటు||

మందసము నీ ప్రజలు – గుడారములో నివసిస్తుండగ
యోవాబుని సేవకులు దండులో నుండగను (2)
తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు (2)
ఇది సమయమా.. ఇది సమయమా.. అని
ఆనాడు ఊరియా దావీదునడిగాడు
ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు      ||ఎటు||

నా పితరుల యొక్క – సమాధులుండు పట్టణము
పాడైపోయెను పాడైపోయెను (2)
యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా (2)
సంతోషముగ నుండుటకు ఇది సమయమా.. అని
ఆనాడు నెహెమ్యా పర రాజునడిగాడు
ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు         ||ఎటు||

ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు
సజీవ దహనాలు స్త్రీల మానభంగాలు (2)
ఎన్నో గుడులు నేల మట్టం చేయబడుచుండగా (2)
తినుటకు త్రాగుటకు ఇది సమయమా అని
నీ సృష్టికర్తగు యేసు నిన్ను అడుగుచున్నాడు
ఈనాడు దేశం కొరకు ప్రార్ధించమన్నాడు         ||ఎటు||

English Lyrics

Audio

యేసయ్యా నా యేసయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్యా నా యేసయ్యా ఎపుడయ్యా నీ రాకడ
రమ్ము రమ్ము యేసునాథ వేగమె రారమ్ము
ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ

చూచుటకెన్నో వింతలున్నవి ఈ భువిలోన
చూడగా ఎందరో ఘనులున్నారు ఈ ధరలోన
ఏమి చూచిన ఎవరిని చూచిన ఫలమేమి
నా కన్నులారా నిన్ను చూడాలి యేసయ్యా         ||రమ్ము||

నా రూపమే మారునంట నిన్ను చూచువేళ
నిన్ను పోలి ఉండెదనంట నీవు వచ్చు వేళ
అనంతమైన నీ రాజ్యమే నా స్వదేశమయ్యా
అందుండు సర్వ సంపదలన్నీ నా స్వంతమయ్యా       ||రమ్ము||

అమూల్యమైన రత్నములతో అలంకరించబడి
గొర్రెపిల్ల దీపకాంతితో ప్రకాశించుచున్న
అంధకారమే లేని ఆ దివ్యనగరమందు
అవధులు లేని ఆనందముతో నీతో నుండెదను          ||రమ్ము||

English Lyrics

Audio

 

 

రాకడ సమయంలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో
యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2)
రావయ్య యేసయ్య – వేగరావయ్యా
రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2)       ||రాకడ||

యేసయ్య రాకడ సమయంలో
ఎదురేగె రక్షణ నీకుందా? (2)
లోకాశలపై విజయం నీకుందా? (2)       ||రావయ్య||

ఇంపైన ధూపవేదికగా
ఏకాంత ప్రార్థన నీకుందా? (2)
యేసు ఆశించే దీన మనస్సుందా? (2)       ||రావయ్య||

దినమంతా దేవుని సన్నధిలో
వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2)
యేసునాథునితో సహవాసం నీకుందా? (2)       ||రావయ్య||

శ్రమలోన సహనం నీకుందా?
స్తుతియించే నాలుక నీకుందా? (2)
ఆత్మలకొరకైన భారం నీకుందా? (2)       ||రావయ్య||

నీ పాత రోత జీవితము
నీ పాప హృదయం మారిందా? (2)
నూతన హృదయంతో ఆరాధన నీకుందా? (2)       ||రావయ్య||

అన్నీటికన్నా మిన్నగను
కన్నీటి ప్రార్థన నీకుందా? (2)
ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా? (2)       ||రావయ్య||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

రాకడ ప్రభుని రాకడ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రాకడ ప్రభుని రాకడ
రాకడ రెండవ రాకడ
ఏ దినమో ఏ ఘడియో (2) ఎవ్వరు ఎరుగనిది
రెప్పపాటున కాలమున తప్పక వచ్చునది ||రాకడ||

నోవాహు దినములలో జరిగినట్లుగా
లోతు కాలమున సాగినట్లుగా (2)
పాపమందు ప్రజలంతా మునిగి తేలగా
లోకమంతా దేవుని మరచియుండగా (2)
మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా
మహిమతో తన ప్రజల చేర పిలుచుగా (2)      ||రాకడ||

దేవుని మరచిన ప్రజలందరిని
సువార్తకు లోబడని జనులందరిని (2)
శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చును
అగ్ని జ్వాలలతో అవని కాల్చును (2)
వేదనతో భూమినంత బాధపరచును
తన మహిమను ప్రజలకు తెలియపరచును (2)       ||రాకడ||

English Lyrics

Audio

 

 

HOME