సీయోను నీ దేవుని

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము (2)
శ్రీ యేసు రాజుని ప్రియ సంఘమా స్తొత్రించి పూజింపుము (2)
యేసే మన విమోచన – హల్లెలూయా హల్లేలూయా
యేసే మన సమాదానం – హల్లెలూయా హల్లేలూయా
యేసే మన రక్షణ – హల్లెలూయా హల్లేలూయా
యేసే మన రారాజు – హల్లెలూయా ఆమేన్ (2)

మా ఊటలన్నియు నీ యందు వున్నవని (2)
పాటలు పాడుము నాట్యము చేయుము (2)        ||యేసే||

ఇమ్మనుయేలుగ ఇనాల్లు తోడుగ (2)
జిహ్వా ఫలమర్పించి సన్నుతించెదం (2)        ||యేసే||

అల్ఫా ఒమేగ ఆద్యంతమాయనే (2)
ఆమేన్ అనువానిని ఆరాధించెదం (2)        ||యేసే||

English Lyrics

Audio

ఆకాశంబున్ దూతలు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఆకాశంబున్ దూతలు
ఉత్సాహించి పాడిరి
పుట్టె రక్షకుండని
సంతసించి ఆడిరి

సర్వోన్నతమైన స్థలములలో
ప్రభుకే మహిమలు కలుగును గాక
భూమి పై సమాధానం (2)

బెత్లెహేము నందున
క్రీస్తు రాజున్ చుడుడి
దేవుని కుమారుని
మోకరించి మ్రొక్కుడి    ||సర్వోన్నతమైన||

English Lyrics

Audio

ఆధారం నీవేనయ్యా

పాట రచయిత: ఎస్ రాజశేఖర్
Lyricist: S Rajasekhar

Telugu Lyrics

ఆధారం నీవేనయ్యా (2)
కాలం మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా
యేసయ్యా కారణం నీవేనయ్యా         ||ఆధారం||

లోకంలో ఎన్నో జయాలు
చూసాను నేనింత కాలం (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది       ||ఆధారం||

ఐశ్వర్యం కొదువేమి లేదు
కుటుంబములో కలతేమి లేదు (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది         ||ఆధారం||

నీ సేవకునిగా జీవింప
హృదయంలో ఉన్నకోర్కెలను (2)
హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2)
సాక్షిగా జీవింతును
హల్లేలూయ సాక్షిగా జీవింతును          ||ఆధారం||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME