నా ప్రాణమా సన్నుతించుమా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా ప్రాణమా సన్నుతించుమా
యెహోవా నామమును
పరిశుద్ధ నామమును (2)
అంతరంగ సమస్తమా
సన్నుతించుమా (2)        ||నా ప్రాణమా||

ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2)
దీర్ఘ శాంత దేవుడు
నిత్యము కోపించడు (2)        ||నా ప్రాణమా||

మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2)
దాక్షిణ్యపూర్ణుడు
నిత్యము తోడుండును (2)        ||నా ప్రాణమా||

English Lyrics

Audio

నా ప్రాణమా సన్నుతించుమా

పాట రచయిత: మాట్ రెడ్మాన్
అనువదించినది: బెంజమిన్ మాలోగి
Lyricist: Matt Redman
Translator: Benjamin Malogi

Telugu Lyrics


నా ప్రాణమా సన్నుతించుమా
పరిశుద్ధ నామమున్
ఎన్నడూ లేని రీతిగా
ఆరాధించు ఆయనను

వేకువ వెలుగు తేజరిల్లును
మరలా నిన్ను కీర్తించే తరుణం
గతించినదేమైనా ముందున్నది ఏదైనా
స్తుతించనేల సర్వ సిద్ధమే           ||నా ప్రాణమా||

ఉన్నత ప్రేమతో విసుగు చెందక
గొప్పవాడవు దయగల దేవా
నీ మంచితనముకై స్తుతియింతును
ఎన్నెన్నో మేలుల్ కనుగొనగలను           ||నా ప్రాణమా||

నా శరీరము కృశించు ఆ దినము
జీవిత గడువు సమీపించినా
కొనసాగించి కీర్తించుచుండ
నిత్యము నిత్యము కీర్తింతును           ||నా ప్రాణమా||

English Lyrics

Audio

ప్రాణమా నా ప్రాణమా

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics

ప్రాణమా నా ప్రాణమా
ప్రియ యెహోవాను సన్నుతించుమా
ప్రియ యెహోవా చేసిన మేలులను
నీవు ఎన్నడు మరువకుమా ||ప్రాణమా||

గత కాలములన్నిటిలో
కృపతోనే నడిపించెను (2)
కరుణ కటాక్షమనే (2)
కిరీటం నీకు దయచేసెను (2) ||ప్రాణమా||

నిను విడువక ఎడబాయక
నిత్యం నీకు తోడైయుండెను (2)
నీవు నడిచిన మార్గములో (2)
నీకు దీపమై నిలచెనుగా (2) ||ప్రాణమా||

పాప శాపము వ్యాధులను
పారద్రోలియే దీవించెను (2)
పరిశుద్ధుడు పరమ తండ్రి (2)
బలపరిచెను తన కృపతో (2) ||ప్రాణమా||

మహా ఆనంద మానందమే
మహారాజా నీ సన్నిధిలో (2)
మహిమగల మహారాజా (2)
మనసారా స్తుతించెదను (2) ||ప్రాణమా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME