నీకే నా ఆరాధన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నీకే నా ఆరాధన
నీకే నా ఆలాపన (2)
నిన్ను కీర్తింతును నా హృదయముతో
నిన్ను సేవింతును నా మనసుతో (2)
ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే (2)

క్రీస్తే నా నిరీక్షణ
క్రీస్తే నా రక్షణ (2)
నిన్ను స్తుతియింతును నా స్వరముతో
నిన్ను ప్రేమింతును నా హృదయముతో (2)        ||ఆరాధన||

యేసే నా విశ్వాసము
యేసే నా విమోచన (2)
నిన్ను పూజింతును నా హృదయముతో
నిన్ను ప్రణుతింతును నా పూర్ణాత్మతో (2)        ||ఆరాధన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సర్వ చిత్తంబు నీదేనయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సర్వ చిత్తంబు నీదేనయ్యా
స్వరూపమిచ్చు కుమ్మరివే (2)
సారెపైనున్న మంటినయ్యా
సరియైన పాత్రన్ చేయుమయ్యా
సర్వేశ్వరా నే రిక్తుండను
సర్వదా నిన్నే సేవింతును         ||సర్వ చిత్తంబు||

ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే
ప్రార్ధించుచుంటి నీ సన్నిధి (2)
పరికింపు నన్నీ దివసంబున
పరిశుభ్రమైన హిమము కన్నా
పరిశుద్ధున్ జేసి పాలింపుమా
పాపంబు పోవ నను కడుగుమా          ||సర్వ చిత్తంబు||

నీ చిత్తమే సిద్ధించు ప్రభూ
నిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2)
నీఛమౌ గాయముల చేతను
నిత్యంబు కృంగి అలసియుండ
నిజమైన సర్వ శక్తుండవే
నీ చేత పట్టి నన్ రక్షింపుమా          ||సర్వ చిత్తంబు||

ఆత్మ స్వరూప నీ చిత్తమే
అనిశంబు చెల్లు ఇహ పరమున (2)
అధికంబుగా నన్ నీ ఆత్మతో
ఆవరింపుమో నా రక్షకా
అందరు నాలో క్రీస్తుని జూడ
ఆత్మతో నన్ను నింపుము దేవా         ||సర్వ చిత్తంబు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నా సమస్తము

పాట రచయిత: రాబిన్ మార్క్
అనువదించినది: ఎం జి రామాంజులు
Lyricist: Robin Mark
Translator: M G Raamaanjulu

Telugu Lyrics


యేసు స్వామీ నీకు నేను
నా సమస్త మిత్తును
నీ సన్నిధి-లో వసించి
ఆశతో సేవింతును

నా సమస్తము – నా సమస్తము
నా సురక్షకా నీ కిత్తు – నా సమస్తము

యేసు స్వామీ నీకు నేను
ద్రోసి లొగ్గి మ్రొక్కెదన్
తీసివేతు లోక యాశల్
యేసు చేర్చుమిప్పుడే        ||నా సమస్తము||

నేను నీ వాడను యేసు
నీవును నా వాడవు
నీవు నేను నేకమాయే
నీ శుద్ధాత్మ సాక్ష్యము        ||నా సమస్తము||

యేసు నీదే నా సర్వాస్తి
హా సుజ్వాలన్ పొందితి
హా సురక్షణానందమా
హల్లెలూయా స్తోత్రము       ||నా సమస్తము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నిన్నే ప్రేమింతును

పాట రచయిత:
అనువదించినది: అనిల్ అలెగ్జాండర్ పెరం
Lyricist:
Translator: Anil Alexander Peram

Telugu Lyrics

నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా

నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా నే వెనుదిరుగా

నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు
నిన్నే పూజింతును నే వెనుదిరుగా             ||నీ సన్నిధిలో||

నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు
నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా                ||నీ సన్నిధిలో||

నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు
నిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా             ||నీ సన్నిధిలో||

నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు
నిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా             ||నీ సన్నిధిలో||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME