ప్రియ యేసు మన కొరకు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ప్రియ యేసు మన కొరకు
ప్రేమతో పొందిన శ్రమలు
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం (2)    ||ప్రియ యేసు||

కల్వరి కొండపైన
దొంగాల మధ్యలోన
సిల్వలోన వ్రేలాడెను
నాకై యేసు మరణించెను (2)    ||ప్రియ యేసు||

ముండ్లతో అల్లిన మకుటం
జల్లాటమున పెట్టగా
స్రవించె పరిశుద్ధ రక్తం
ద్రవించె నా హృదయం (2)    ||ప్రియ యేసు||

పాపాంధకారములో
పయనించు మనుజులను
పావనులుగా చేయుటకు
పావనుడేసు మరణించెను (2)    ||ప్రియ యేసు||

పాపినైన నా కొరకు
ప్రేమించి ప్రాణమిచ్చెను
సిల్వలో వ్రేళాడెను
నీకై ప్రాణమునిచ్చెను (2)    ||ప్రియ యేసు||

English Lyrics

Audio

నా కొరకు బలియైన

పాట రచయిత: ప్రభు కుమార్
Lyricist: Prabhu Kumar

Telugu Lyrics


నా కొరకు బలియైన ప్రేమ
బహు శ్రమలు భరియించె ప్రేమ (2)
కడు ఘోర కఠిన శిక్ష సహియించె ప్రేమ (2)
తుది శ్వాసనైన నాకై అర్పించె ప్రేమ (2)
క్రీస్తేసు ప్రేమ         ||నా కొరకు||

నా హృదయ యోచనే జరిగించె పాపము
నా క్రియల దోషమే నడిపించె పతనముకై (2)
ఏ మంచి యుందని ప్రేమించినావయ్యా
నా ఘోర పాపముకై మరణించినావయ్యా
ఉన్నత ప్రేమ చూపి రక్షించినావయ్యా (2)
నా మంచి యేసయ్యా (2)      ||నా కొరకు||

నీ సిలువ త్యాగము నా రక్షణాధారం
నీ రక్త ప్రోక్షణయే నా నిత్య ఐశ్వర్యం (2)
అర్హతే లేని నాకై మరణించినావయ్యా
నీ మరణ త్యాగమే బ్రతికించె యేసయ్యా
ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలనయ్యా
ప్రాణాత్మ దేహముతో స్తుతియింతు యేసయ్యా
ఘనపరతు యేసయ్యా (2)      ||నా కొరకు||

English Lyrics

Audio

గూడు విడచి వెళ్లిన నాడే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

గూడు విడచి వెళ్లిన నాడే
చేరెదనా ఇంటికి
పాడెదన్ జయగీతమే
నాకై శ్రమలు పొందిన యేసుకై

నిందలు పోవును బాధలు తీరును
ప్రాణప్రియతో ఎత్తబడగా
పావురము వలెనే ఎగురుచు
రూపాంతరము పొందెదనే

బంధువు మిత్రులంతా నన్ను విడచినను
ఏకమై కూడి రేగినను
చేయి పట్టిన నాధుడే నన్ను
తన చెంత చేర్చుకొనును

లోకము నాకు వద్దు లోకపు ఆశలు వద్దు
నడిచెద యేసుని అడుగులో
నాకున్న సమస్తమును నీకై
అర్పించెదను యేసువా

English Lyrics

Audio

కలువరి గిరి సిలువలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


కలువరి గిరి సిలువలో పలు శ్రమలు పొందిన దైవమా (2)
విశ్వ మానవ శాంతి కోసం ప్రాణమిచ్చిన జీవమా (2)
యేసు దేవా నీదు త్యాగం వివరింప తరమా (2)         ||కలువరి||

కరుణ లేని కఠిన లోకం కక్షతో సిలువేసినా (2)
కరుణ చిందు మోముపైన గేలితో ఉమ్మేసినా (2)
ముళ్ళతోన మకుటమల్లి
నీదు శిరమున నుంచినా – (2)         ||కలువరి||

జాలి లేని పాప లోకం కలువలేదో చేసినా (2)
మరణమందు సిలువలోన రుధిరమే నిను ముంచినా (2)
కలుష రహిత వ్యధను చెంది
అలసి సొలసి పోతివా – (2)         ||కలువరి||

English Lyrics

Audio

నాలోని ఆశ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని
నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని
దేవా.. యేసయ్యా నిన్ను చూడాలని
దేవా… యేసయ్యా నిన్ను చేరాలని

జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూ
జీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ లార్డ్ (2)
మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ
మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ.. ఫరెవర్

శ్రమలు నన్ను తరిమినా – విడువలేదు నీ కృప
వేదనలో నేను కృంగినా – లేవనెత్తెను నీ చేయి (2)
ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా
తరతరాలు మారినా మారని దేవుడా         ||జీసస్||

విరిగి నలిగిన మనస్సుతో నీ దరి చేరితి యేసయ్యా
మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా (2)
తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తించెద
నా బ్రతుకు దినములన్ని నిన్ను పూజింతును          ||జీసస్||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME