దూరపు కొండపై

పాట రచయిత: సీయోను గీతములు
Lyricist: Songs of Zion

దూరపు కొండపై శ్రమలకు గుర్తగు
కౄరపు సిలువయే కనబడె
పాపలోకమునకై ప్రాణము నొసగిన
ప్రభుని సిలువను ప్రేమింతున్

ప్రియుని సిలువను ప్రేమింతున్
ప్రాణమున్నంత వరకును
హత్తుకొనెదను సిలువను
నిత్యకిరీటము పొందెదన్

లోకులు హేళన చేసిన సిలువ
నా కెంతో అమూల్యమైనది
కల్వరిగిరికి సిలువను మోయను
క్రీస్తు మహిమను విడచెను   ||ప్రియుని||

రక్తశిక్తమైన కల్వరి సిలువలో
సౌందర్యంబును నే గాంచితిని
నన్ను క్షమించను పెన్నుగ యేసుడు
ఎన్నదగిన శ్రమ పొందెను   ||ప్రియుని||

వందనస్తుడను యేసుని సిలువకు
నిందను ఈ భువిన్ భరింతు
పరమ గృహమునకు పిలిచెడు దినమున
ప్రభుని మహిమను పొందెద   ||ప్రియుని||

Download Lyrics as: PPT

సిలువను గెలిచిన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సిలువను గెలిచిన సజీవుని త్యాగము
విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము (2)
ముందే తెలియును – తన బలియాగము
తెలిసే చేసెను స్వ బలిదానము
తండ్రేర్పరచిన ఆజ్ఞానుసారము
తననే వంచెను తనువే అర్పించెను

దేవా నీ త్యాగము మము రక్షించెను
పాపము నుండి విడిపించెను
దేవా నీ త్యాగము మమ్ము బ్రతికించెను
ఇల సజీవులుగా మేము నిలిపెను        ||సిలువను||

English Lyrics

Audio

సువార్తను ప్రకటింపవా

పాట రచయిత: సామ్ జె వేదాల
Lyricist: Sam J Vedala

Telugu Lyrics


సువార్తను ప్రకటింపవా
సునాదము వినిపింపవా
సిలువను ధరియించవా
దాని విలువను వివరింపవా
లెమ్ము సోదరా
లేచి రమ్ము సోదరీ (2)        ||సువార్తను||

సుఖము సౌఖ్యము కోరి నీవు
సువార్త భారం మరచినావు (2)
సోమరివై నీవుండి
స్వామికి ద్రోహం చేయుదువా (2)        ||లెమ్ము||

నీలోని ఆత్మను ఆరనీకు
ఎదలో పాపము దాచుకోకు (2)
నిను నమ్మిన యేసయ్యకు
నమ్మక ద్రోహం చేయుదువా (2)        ||లెమ్ము||

English Lyrics

Audio

చూడరే సిలువను

పాట రచయిత: ఒంగోలు అబ్రాహాము
Lyricist: Ongole Abraham

Telugu Lyrics

చూడరే సిలువను వ్రే-లాడు యేసయ్యను
పాడు లోకంబునకై – గోడు జెందె గదా        ||చూడరే||

నా చేతులు చేసినట్టు – దోషంబులే గదా
నా రాజు చేతులలో ఘోరంపు జీలలు        ||చూడరే||

దురితంపు దలఁపులే – పరమ గురిని శిరముపై
నెనరు లేక మొత్తెనయ్యొ – ముండ్ల కిరీటమై        ||చూడరే||

పరుగెత్తి పాదములు – చేసిన పాపంబులు
పరమ రక్షకుని – పాదములలో మేకులు        ||చూడరే||

పాపేఛ్చ తోడ గూడు – నాడు చెడ్డ పడకలే
పరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోటులు        ||చూడరే||

English Lyrics

Audio

అయ్యా నా కోసం కల్వరిలో

పాట రచయిత: భరత్
Lyricist: Bharath

Telugu Lyrics

అయ్యా నా కోసం కల్వరిలో
కన్నీరును కార్చితివా (2)
నశించిపోవు ఈ పాపి కొరకై
సిలువను మోసితివా
అయ్యా వందనమయ్యా
యేసు వందనమయ్యా (2)          ||అయ్యా||

పడిపోయి ఉన్న వేళలో
నా చేయి పట్టి లేపుటకు
గొల్గొతా కొండపై పడిపోయిన
యేసు నా కొరకు తిరిగి లేచితివి (2)          ||అయ్యా వందనమయ్యా||

అనాథ నేను కాదని
సిలువపై నాకు చెప్పుటకు
ఒంటరిగా ఉన్న మరియను
యేసు యోహానును అప్పగించితివి (2)          ||అయ్యా వందనమయ్యా||

English Lyrics

Audio

సిలువ సాక్షిగా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సిలువ సాక్షిగా యేసు సిలువను
సిలువ మోయుచు ప్రకటించెదను (2)
ఇదే నా వేదన – ఇదే నా ప్రార్థన           ||సిలువ||

యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే
క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2)
మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే
సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే
కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో        ||సిలువ||

లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే
పాప శాప విమోచన యేసు సిలువ మార్గమే (2)
దైవమా నవ పాలన క్రీస్తు సిలువ జీవమే
సమ సమాజ స్థాపనలో యేసు సిలువ సత్యమే
కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో           ||సిలువ||

English Lyrics

Audio

పోరాటం ఆత్మీయ పోరాటం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

పోరాటం ఆత్మీయ పోరాటం (2)
చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదు
సాగిపోవుచున్నాను
సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2)

నా యేసుతో కలిసి పోరాడుచున్నాను
అపజయమే ఎరుగని జయశీలుడాయన (2)
నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

నా యేసు వెళ్ళిన మార్గము లేనని
అవమానములైనా ఆవేదనలైనా (2)
నా యేసు కృపనుండి దూరపరచలేవని (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

ఆదియు అంతము లేనివాడు నా యేసు
ఆసీనుడయ్యాడు సింహాసనమందు (2)
ఆ సింహాసనం నా గమ్యస్థానం (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

English Lyrics

Audio

 

 

ఓ మానవా

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics

ఓ మానవా.. నిజమేదో ఎరుగవా
ఓ మానవా.. ఇకనైనా మారవా
మన పాపములను క్షమియించుటకే
సిలువ మరణము పొందెనని (2)
గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు (2)
ఈ దినమే అనుకూలం…
లేదిక వేరే ఏ సమయం (2)
నిజమేదో తెలియకనే
చనిపోతే నీ గతి ఏమి? (2)     ||ఓ మానవా||

సిలువను గూర్చిన శుభ వార్త
వెర్రితనముగా ఉన్నదా?
దేవుని శక్తని తెలుసుకొని
ప్రభు మార్గమును చేరెదవా (2)           ||ఈ దినమే||

ప్రయాసముతో భారము మోసే
నిన్నే దేవుడు పిలిచెనుగా
ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద
వేగిరమే పరుగిడి రావా (2)          ||ఈ దినమే||

నీ ధనము నీ ఘనము
నీ సర్వస్వము చితి వరకే
అర్పించుము నీ హృదయమును
(నిజ) రక్షకుడైన ప్రభు కొరకే (2)           ||ఈ దినమే||

English Lyrics

Audio

HOME