నా జీవిత భాగస్వామివి

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


నా జీవిత భాగస్వామివి నీవు
నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు (2)
నాకే సమృద్దిగా నీ కృపను పంచావు
నా యేసురాజ కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా (2)

నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి
నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి (2)
నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి
నీ సైన్యములో నన్ను చేర్చితివి (2)       ||నా జీవిత||

నీ దయగల మాటలే చేరదీసినవి
నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి (2)
నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివి
నీ విందుశాలకు నను చేర్చితివి (2)       ||నా జీవిత||

నీ దయగల తలంపులే రూపునిచ్చినవి
నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి (2)
నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు
నీ అంతఃపురములో నను చేర్చుదువు (2)       ||నా జీవిత||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆత్మీయ గానాలతో

పాట రచయిత: ఆడమ్ బెన్ని
Lyricist: Adam Benny

Telugu Lyrics

ఆత్మీయ గానాలతో
నిన్నే ఆరాధన చేయనా
స్తుతి స్తోత్ర గీతాలతో
నీ నామము పూజించనా (2)
మహిమ ఘనత ప్రభావములు
నీకే చెల్లించుచున్నానయ్యా (2)
ఆరాధించనా నీ పాద సన్నిధి (2)
స్తుతి పాత్రుడా – స్తోత్రార్హుడా
ఆరాధనా నీకే ఆరాధనా (2)           ||ఆత్మీయ||

సమీపించరాని తేజస్సులో
వసియించుచున్న పరిశుద్ధుడా (2)
కెరూబులు సెరాపులు (2)
దీవా రాత్రులు నీ సన్నిధిలో (2)
స్తోత్రం చేసెనా నా ప్రాణ నాథుడా (2)           ||స్తుతి పాత్రుడా||

అందరిలోను అతి శ్రేష్టుడా
వేల్పులలోన మహనీయుడా (2)
పూజార్హుడా స్తోత్రార్హుడా (2)
అతి సుందరుడా మనోహరుడా (2)
చేతులెత్తనా నీ సన్నిధి కాంతిలో (2)           ||స్తుతి పాత్రుడా||

అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడా
అపరంజిని పోలిన పాదాలు గలవాడా (2)
(దేవా) విస్తార జల నదుల శబ్దము పోలిన (2)
స్వరమును కలిగిన ఘననీయుడా (2)
శిరము వంచనా సర్వోన్నతుడా (2)           ||స్తుతి పాత్రుడా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అల్ఫా ఒమేగయైన

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా (2)
రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా
ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా
నాతో స్నేహమై నా సౌఖ్యమై
నను నడిపించే నా యేసయ్యా (2)       ||అల్ఫా||

కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే
ఉన్నతముగా నిను ఆరాధించుటకు
అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి
నూతన వసంతములు చేర్చెను (2)
జీవించెద నీ కొరకే
హర్షించెద నీలోనే (2)       ||అల్ఫా||

తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే
ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు
ఆశ నిరాశల వలయాలు తప్పించి
అగ్ని జ్వాలగా నను చేసెను (2)
నా స్తుతి కీర్తన నీవే
స్తుతి ఆరాధన నీకే (2)       ||అల్ఫా||

నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు
అంతులేని అగాధాలు దాటించి
అందని శిఖరాలు ఎక్కించెను (2)
నా చెలిమి నీతోనే
నా కలిమి నీలోనే (2)       ||అల్ఫా||

English Lyrics

Audio

నీకసాధ్యమైనది ఏదియు లేదు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నీకసాధ్యమైనది ఏదియు లేదు
సమస్తము సాధ్యము నీకు (2)
ప్రభువా ప్రభువా
సమస్తము సాధ్యం (2)       ||నీకసాధ్యమైనది||

వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం – సాధ్యం
బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం – సాధ్యం (2)
నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా
నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2)       ||నీకసాధ్యమైనది||

పాపమునుండి విడిపించుట సాధ్యం – సాధ్యం
శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం – సాధ్యం (2)
నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2)       ||నీకసాధ్యమైనది||

దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం – సాధ్యం
నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం – సాధ్యం (2)
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2)       ||నీకసాధ్యమైనది||

సర్వ సత్యములో నడిపించుట సాధ్యం – సాధ్యం
పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం – సాధ్యం (2)
నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2)       ||నీకసాధ్యమైనది||

English Lyrics

Audio

దివినేలు స్తోత్రార్హుడా

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా
దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా
మొదటివాడవు – కడపటివాడవు
యుగయుగములలో ఉన్నవాడవు (2)

మానక నా యెడల కృప చూపుచున్నావు
మారదు నీ ప్రేమ తరతరములకు (2)
మాట తప్పని మహనీయుడవు – మార్పులేని వాడవు
నీవు చెప్పిన మంచి మాటలు – నెరవేర్చువాడవు
నీ మాటలు జీవపు ఊటలు
నీ కృపలే బలమైన కోటలు (2)       ||దివినేలు||

దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు
దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు (2)
దాటి వెళ్లని కరుణామూర్తివై – మనవి ఆలకించావు
దీర్ఘ శాంతముగలవాడవై – దీవించువాడవు
నీ దీవెన పరిమళ సువాసన
నీ ఘనతే స్థిరమైన సంపద (2)       ||దివినేలు||

సీయోను శిఖరముపై నను నిలుపుటకే
జ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే (2)
దివ్యమైన ప్రత్యక్షతతో – నన్ను నింపియున్నావు
సుందరమైన నీ పోలికగా – రూపు దిద్దుచున్నావు
నీ రాజ్యము పరిశుద్ధ నగరము
ఆ రాజ్యమే నిత్య సంతోషము (2)       ||దివినేలు||

English Lyrics

Audio

స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా

పాట రచయిత: యేసుదాస్
Lyricist: Yesudas

Telugu Lyrics


స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతులందుకో పూజార్హుడా (2)
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభు (2)        ||స్తుతి||

నా శత్రువులు నను తరుముచుండగా
నా యాత్మ నాలో కృంగెనే ప్రభు (2)
నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనే
శత్రువుల చేతినుండి విడిపించినావు
కాపాడినావు (2)         ||స్తుతి||

నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
దూరాన నిలిచేరు నా ప్రభూ (2)
నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నిధిలో
నీ సంఘములో (2)         ||స్తుతి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

స్తుతించి పాడెదం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


స్తుతించి పాడెదం – స్తుతుల స్తోత్రార్హుడా
ఉత్సాహించి పాడెదం – ఉదయ సాయంత్రముల్
స్తుతుల సింహాసనం మీదాసీనుడా
మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము (2)         ||స్తుతించి||

గతకాలమంతా నీవు – మము కాచి కాపాడావు
వ్యధలన్ని తీసావు (2)
గతి లేని మాపై నీవు
మితిలేని ప్రేమ చూపి (2)
శత సంఖ్యగా మమ్ము దీవించావు          ||స్తుతించి||

కరుణా కటాక్షములను కిరీటములగాను
ఉంచావు మా తలపై (2)
పక్షి రాజు యవ్వనమువలె
మా యవ్వనమునంతా (2)
ఉత్తేజపరిచి తృప్తిని ఇచ్చావు         ||స్తుతించి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

HOME