నా ప్రాణమా నీకే వందనం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా ప్రాణమా యేసయ్యా… నా ధ్యానమా యేసయ్యా

నా ప్రాణమా నీకే వందనం
నా స్నేహమా నీకే స్తోత్రము (2)
నిను నే కీర్తింతును
మనసారా ధ్యానింతును (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ నా యేసయ్యా (2)       ||నా ప్రాణమా||

నిను విడచి ఉండలేనయ్యా
నా దేవ క్షణమైనా బ్రతుకలేనయ్యా (2)

సర్వ భూమికి మహారాజ నీవే పూజ్యుడవు
నన్ను పాలించే పాలకుడా నీవే పరిశుద్ధ్దుడా (2)
సమస్త భూజనులా స్తోత్రములపై ఆసీనుడా (2)
మోకరించి ప్రనుతింతును (2) ||హల్లెలూయ||

మహిమ కలిగిన లోకములో నీవే రారాజువూ
నీ మహిమతో నను నింపిన సర్వశక్తుడవు (2)
వేవేల దూతలతో పొగడబడుచున్న ఆరాధ్యుడా (2)
మోకరించి ప్రనుతింతును (2) ||హల్లెలూయ||

English Lyrics

Audio

స్తోత్రము స్తుతి స్తోత్రము

పాట రచయిత: అనిల్ మోహన్
Lyricist: Anil Mohan

Telugu Lyrics

స్తోత్రము స్తుతి స్తోత్రము
వేలాది వందనాలు
కలుగును గాక నీకే మహిమ
ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము
యేసయ్య యేసయ్య యేసయ్య (4)

శూన్యము నుండి సమస్తము కలుగజేసెను
నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను
యేసే నా సర్వము
యేసే నా సమస్తము            ||యేసయ్య||

పరము నుండి భూమికి దిగివచ్చిన యేసు
సిలువ మరణమునొంది మార్గము తెరిచెను
యేసే నా రక్షణ
యేసే నా నిరీక్షణ                ||యేసయ్య||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సర్వకృపానిధియగు ప్రభువా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సర్వకృపానిధియగు ప్రభువా
సకల చరాచర సంతోషమా (2)
స్తోత్రము చేసి స్తుతించెదను
సంతసముగ నిను పొగడెదను (2)

హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను
నేను… ఆనందముతో సాగెదను

ప్రేమించి నన్ను వెదకితివి
ప్రీతితో నను రక్షించితివి (2)
పరిశుద్ధముగా జీవించుటకై
పాపిని నను కరుణించితివి (2)     ||హల్లెలూయా||

అల్పకాల శ్రమలనుభవింప
అనుదినము కృపనిచ్చితివి (2)
నాథుని అడుగుజాడలలో
నడుచుటకు నను పిలిచితివి (2)   ||హల్లెలూయా||

మరణ శరీరము మర్పునొంది
మహిమ శరీరము పొందుటకై (2)
మహిమాత్మతో నను నింపితివి
మరణ భయములను తీర్చితివి (2)     ||హల్లెలూయా||

భువినుండి శ్రేష్ట ఫలముగను
దేవునికి నిత్య స్వాస్థ్యముగా (2)
భూజనములలోనుండి నన్ను
ప్రేమించి క్రయ ధనమిచ్చితివి (2)     ||హల్లెలూయా||

ఎవరూ పాడని గీతములు
యేసుతో నేను పాడుటకై  (2)
హేతువు లేకయే ప్రేమించెన్‌
యేసుకు నేనేమివ్వగలన్‌ (2)     ||హల్లెలూయా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

దేవునికి స్తోత్రము గానము

పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Lyricist: Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics


దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది

యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
ఇశ్రయేలీయులను పోగుచేయువాడని                ||దేవునికి||

గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని        ||దేవునికి||

నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును
వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని           ||దేవునికి||

ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని         ||దేవునికి||

దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి               ||దేవునికి||

ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును
భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని              ||దేవునికి||

పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను
అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును  ||దేవునికి||

గుర్రముల నరులందలి బలము నానందించడు
కృప వేడు వారిలో సంతసించువాడని                ||దేవునికి||

యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని    ||దేవునికి||

పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్
మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును   ||దేవునికి||

భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే
వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును         ||దేవునికి||

వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని
ఏ జనముకీలాగున చేసియుండలేదని               ||దేవునికి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME