మార్గం సత్యం జీవం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మార్గం సత్యం జీవం నీవే యేసు
సర్వం సకలం నీవే క్రీస్తు (2)
మా ఆధారం నీవేనయ్యా
మా అనుబంధం నీతోనేనయ్యా (2)
వధియింపబడిన ఓ గొర్రెపిల్ల
ప్రభువైన మా యేసువా
మా స్తుతి స్తోత్రముల్ నీకే
మహిమా ప్రభావముల్ నీకే (2)        ||మార్గం||

పరమును విడిచావు మాకై
నరునిగా పుట్టావు ధరపై (2)
ఆహా నీదెంత ప్రేమ
ఎవరికైనా వర్ణింప తరమా (2)          ||వధియింప||

కలువరిలో రక్తమును కార్చి
విలువగు ప్రాణమును ఇచ్చి (2)
తెచ్చావు భువికి రక్షణ
ఇచ్చావు పాప క్షమాపణ (2)          ||వధియింప||

English Lyrics

Audio

దావీదు వలె నాట్యమాడి

పాట రచయిత: సి హెచ్ సంతోష్ రెడ్డి
Lyricist: Ch Santhosh Reddy

Telugu Lyrics


దావీదు వలె నాట్యమాడి
తండ్రీని స్తుతించెదము (2)
యేసయ్యా స్తోత్రముల్‌ (4)          ||దావీదు||

తంబురతోను సితారతోను
తండ్రీని స్తుతించెదను (2)          ||యేసయ్యా||

కష్టము కలిగినా – నష్టము కలిగినా
తండ్రీని స్తుతించెదను (2)          ||యేసయ్యా||

పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన
తండ్రీని స్తుతించెదను (2)          ||యేసయ్యా||

క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన
తండ్రీని స్తుతించెదను (2)          ||యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

లెక్కించలేని స్తోత్రముల్

పాట రచయిత:సరోజిని ప్రకాష్
Lyricist:
Sarojini Prakash

Telugu Lyrics


లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)
ఇంత వరకు నా బ్రతుకులో (2)
నువ్వు చేసిన మేళ్ళకై                 ||లెక్కించలేని||

ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును (2)
భూమిలో కనబడునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్             ||లెక్కించలేని|| 

అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును (2)
భూమిపైనున్నవన్ని (2)
దేవా నిన్నే పొగడును                ||లెక్కించలేని|| 

నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు (2)
ఆకాశమున ఎగురునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్            ||లెక్కించలేని||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME