నిను స్తుతించినా చాలు

పాట రచయిత:
Lyricist: 

Telugu Lyrics

నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో
నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2)
ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా
నీ సన్నిధిలో…
నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు      ||నిను||

స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను||

ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను||

ఆరాధ్య దైవము నీవేనయ్యా
ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను||

ఆదిసంభూతుడవు నీవేనయ్యా
ఆదరించు దేవుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నిత్యము స్తుతించినా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నిత్యము స్తుతించినా
నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా
నీ త్యాగము మరువలేను (2)

రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవాది దేవుడవు (2)           ||నిత్యము||

అద్వితీయ దేవుడా
ఆది అంతములై యున్నవాడా (2)
అంగలార్పును నాట్యముగా
మార్చివేసిన మా ప్రభు (2)                  ||రాజా||

జీవమైన దేవడా
జీవమిచ్చిన నాథుడా (2)
జీవజలముల బుగ్గ యొద్దకు
నన్ను నడిపిన కాపరి (2)                    ||రాజా||

మార్పులేని దేవుడా
మాకు సరిపోయినవాడా (2)
మాటతోనే సృష్టినంతా
కలుగజేసిన పూజ్యుడా (2)                   ||రాజా||

English Lyrics

Audio

HOME