సరిపోదు ఆరాధన

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics

నిరతము నిను స్తుతియించినా
దేవా – సరిపోదు ఆరాధన
ప్రతి క్షణము కీర్తించినా
ప్రభువా – నీ కృపలకు సరితూగునా (2)
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నికే ఆరాధన (2)        ||నిరతము||

ప్రభువా యెహోవా రాఫా నీవే
నా స్వస్థతలు అన్ని నీవే నీవే
దేవా యెహోవా నిస్సి నీవే
నా విజయాల అధిపతి నీవే నీవే (2)        ||ఆరాధన||

ప్రేమించే శ్రీమంతుడవు నీవే దేవా
కోపానికి కాలయాపన నీదే ప్రభువా
నాకున్న ఈ విశ్వాసం నీదే కాదా
నీ తోడు ఉంటే నా దరి రాదు ఏ భాధ (2)        ||ఆరాధన||

నా గతము రద్దు చేసిన నాదు దేవా
నా రేపును నడిపించేది నీవే ప్రభువా
నీ స్తుతికి ఆలస్యం చేయను నా ప్రభువా
నా స్థితిని ఎన్నటికి మరువను నా దేవా (2)        ||ఆరాధన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఎన్ని తరములు స్తుతియించినా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఎన్ని తరములు స్తుతియించినా (2)
తీరునా నీ ఋణం (4)
నా ప్రాణము – నా జీవము (2)
నీవే నా యేసయ్యా
నీవే నా మెస్సయ్యా      ||ఎన్ని||

కరిగిపోని కన్నీరెంతో
కుమ్మరించాను – కుమ్మరించాను (2)
కరుణామయుడా కన్నులు తుడిచి (2)
(నీ) కృపను చూపావు – కృపను చూపావు (2)      ||నా ప్రాణము||

పాపములోనే పుట్టిన వారిని
పరిశుద్ధపరచితివి – పరిశుద్ధపరచితివి (2)
పరమ తండ్రి పవిత్రతతోనే (2)
(నీ) పరమున చేర్చెదవు – పరమున చేర్చెదవు (2)      ||నా ప్రాణము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

వేయి నోళ్లతో స్తుతియించినా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


వేయి నోళ్లతో స్తుతియించినా
నీ ఋణమును నే తీర్చగలనా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా

నా రోగములను భరియించి
నా వ్యసనములను వహియించి
నా దోషములను క్షమియించి
స్వస్థత నొసగిన నా దేవా         ||యేసయ్యా||

శోధనలో నాకు జయమిచ్చి
బాధలలో నను ఓదార్చి
బలహీనతలో బలమిచ్చి
నెమ్మది నొసగిన నా దేవా         ||యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME