ఎనలేని ప్రేమ

పాట రచయిత: సృజిత్ మనూక
Lyricist: Srujith Manuka

Telugu Lyrics

ఎనలేని ప్రేమ నాపైన చూపి
నరునిగా వచ్చిన నా దేవా
నా పాపము కొరకు రక్తమును కార్చి
ప్రాణమునర్పించిన నా దేవా (2)
ఊహించగలనా వర్ణింప తగునా
ఆ గొప్ప సిల్వ త్యాగము (2)
ఆ గొప్ప సిల్వ త్యాగము         ||ఎనలేని||

కొరడాలతో హింసించినా
మోముపై ఉమ్మి వేసినా (2)
చెమట రక్తముగా మారినా (2)          ||ఊహించగలనా||

ముళ్ల కిరీటముతో మొత్తినా
బల్లెముతో ప్రక్క పొడచినా (2)
పరలోక తండ్రియే చేయి విడచినా (2)          ||ఊహించగలనా||

English Lyrics

Audio

నా హృదయములో

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


నా హృదయములో నీ మాటలే
నా కనులకు కాంతి రేఖలు (2)
కారు చీకటిలో కలువరి కిరణమై
కఠిన హృదయమును కరిగించిన
నీ కార్యములను వివరింప తరమా
నీ ఘన కార్యములు వర్ణింప తరమా (2)        ||నా హృదయములో||

మనస్సులో నెమ్మదిని కలిగించుటకు
మంచు వలె కృపను కురిపించితివి (2)
విచారములు కొట్టి వేసి
విజయానందముతో నింపినావు
నీరు పారేటి తోటగా చేసి
సత్తువ గల భూమిగా మార్చినావు         ||నీ కార్యములను||

విరజిమ్మే ఉదయ కాంతిలో
నిరీక్షణ ధైర్యమును కలిగించి (2)
అగ్ని శోధనలు జయించుటకు
మహిమాత్మతో నింపినావు
ఆర్పజాలని జ్వాలగా చేసి
దీప స్తంభముగా నను నిలిపినావు         ||నీ కార్యములను||

పవిత్రురాలైన కన్యకగా
పరిశుద్ధ జీవితము చేయుటకు (2)
పావన రక్తముతో కడిగి
పరమానందముతో నింపినావు
సిద్ధపడుచున్న వధువుగా చేసి
సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు         ||నీ కార్యములను||

English Lyrics

Audio

పరిశుద్ధ పరిశుద్ధ

పాట రచయిత: యెషయా వీర మార్టిన్
Lyricist: Yeshayaa Veera Martin

Telugu Lyrics

పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా (2)
వరదూతలైనా నిన్ – వర్ణింప గలరా
వరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరా

పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ (2)
నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావా
నిరుపమ బలబుద్ధి (3) నీతి ప్రభావా

పరిశుద్ధ తనయుడ – నర రూప ధారుడ (2)
నరులను రక్షించు – కరుణా నముద్రా
నరులను రక్షించు (3) కరుణా నముద్రా

పరిశుద్ధ మగు నాత్మ – వరము లిడు నాత్మ (2)
పరమానంద ప్రేమ – భక్తుల కిడుమా
పరమానంద ప్రేమ (3) భక్తుల కిడుమా

జనక కుమారాత్మ – లను నేక దేవ (2)
ఘన మహిమ చెల్లును – దనర నిత్యముగా
ఘన మహిమ చెల్లును (3) దనర నిత్యముగా

English Lyrics

Audio

HOME