ధ్యానించుచుంటిమి

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Telugu Lyrics


ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన – విలువైన నీ మాటలు
ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు (2)
మోక్షమునకు చేర్చు బాటలు
పరిశుద్ధతలో పరిపూర్ణుడా – ఉన్నత గుణ సంపన్నుడా (2)
శ్రేష్టుడా…                                  ||ధ్యానించుచుంటిమి||

తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు
వీరిని దయతో క్షమించుము (2)
అని ప్రార్ధన చేసావా బాధించే వారికి (2)
శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2)           ||పరిశుద్ధతలో||

నేడే నాతోను పరదైసులో నీవుందువు
నిశ్చయముగ ప్రవేశింతువు (2)
అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి (2)
అధికారముతో పాపిని రక్షించి (2)           ||పరిశుద్ధతలో||

ఇదిగో నీ తల్లి ఇతడే నీ కుమారుడు
కష్టము రానీయకు ఎప్పుడు (2)
అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను (2)
తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను (2)           ||పరిశుద్ధతలో||

దేవా నా దేవా నను విడనాడితివెందుకు
చెవినీయవె నా ప్రార్థనకు (2)
అని కేక వేసావా శిక్షననుభవిస్తూ (2)
పరలోక మార్గం సిద్ధము చేస్తూ (2)           ||పరిశుద్ధతలో||

సర్వ సృష్టికర్తను నే దప్పిగొనుచుంటిని
వాక్యము నెరవేర్చుచుంటిని (2)
అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు (2)
జీవ జలమును అనుగ్రహించుటకు (2)           ||పరిశుద్ధతలో||

సమాప్తిమయ్యింది లోక విమోచన కార్యం
నెరవేరెను ఘన సంకల్పం (2)
అని ప్రకటన చేసావా కల్వరి గిరి నుంచి (2)
పని ముగించి నీ తండ్రిని ఘనపరచి (2)           ||పరిశుద్ధతలో||

నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని
నీ యొద్దకు వచ్చుచుంటిని (2)
అని విన్నవించావా విధేయత తోటి (2)
తల వంచి తృప్తిగ విజయము చాటి (2)           ||పరిశుద్ధతలో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

విలువైన నీ కృప

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


విలువైన నీ కృప నాపై చూపి – కాచావు గత కాలము
ఎనలేని నీ కృప నాపై ఉంచి – ఇచ్చావు ఈ వత్సరం
దినములు సంవత్సరాలు గడచిపోయెను ఎన్నో
ప్రతి దినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలో
నా జీవిత కాలమంతా నను నడుపుము యేసయ్యా
నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్యా (2)       ||విలువైన||

గడచినా కాలమంతా తోడైయున్నావు
అద్భుతాలు ఎన్నో చేసి చూపావు (2)
లెక్కించ లేని మేలులతో తృప్తి పరిచావు (2)
నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు (2)     ||నా జీవిత||

సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా
నూతన కార్యాలు ఎన్నో చేశావు (2)
సంవత్సరమను నీ దయా కిరీటం ధరింప చేశావు (2)
నా దినములు పొడిగించి నీ కృపలో దాచావు
మా దినములు పొడిగించి నీ కృపలో దాచావు         ||నా జీవిత||

English Lyrics

Audio

అమూల్య రక్తం

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics

అమూల్య రక్తం – ప్రశస్త రక్తం
విలువైన రక్తం – శక్తి గల రక్తం (2)
యేసు రక్తమే జయము
క్రీస్తు రక్తమే విజయము (2)
పాప క్షమాపణ యేసు రక్తములోనే
శాప విమోచన క్రీస్తు రక్తములోనే          ||అమూల్య||

తండ్రి చిత్తము నెరవేర్చ
గెత్సేమనేలో ప్రార్ధింప (2)
చెమట రక్తము గొప్ప బిందువులై కారెనే
ఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే (2)         ||యేసు||

శాపానికి ప్రతిఫలము ముళ్ళు
ముండ్ల కిరీటముతో చెల్లు (2)
ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలు
ప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే (2)             ||యేసు||

నీ చేతుల పనిని ఆశీర్వదింప
ప్రభు చేతులలో మేకులు గొట్ట (2)
కాళ్లలో మేకులు సువార్తకు సుందరమే
బల్లెపు పోటు బాగు చేయును – గుండెలను (2)         ||యేసు||

English Lyrics

Audio

కావలెనా యేసయ్య

పాట రచయిత: వినయ్
Lyricist: Vinay

Telugu Lyrics


కావలెనా యేసయ్య బహుమానము
(మరి) చేయాలి విలువైన ఉపవాసము (2)
సిద్ధమౌ శ్రీ యేసుని ప్రియా సంఘమా
చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా (2)     ||కావలెనా||

నీనెవె పట్టణము యెహోవా దృష్టికి
ఘోరమాయెను – పాపముతో నిండిపోయెను
సృష్టికర్త యెహోవా యోనాను దర్శించి
నీనెవెకు పంపెను – కనికరము చూపించెను
ఘనులేమి అల్పులేమి – నీనెవె పట్టణపు రాజేమి
పిల్లలేమి పెద్దలేమి – ఉపవాసము చేయగా
ఆగింది యెహోవా శాపము
కురిసింది కరుణ వర్షము (2)     ||కావలెనా||

దేవుని ప్రజలను నశియింప చేయుటకు
దుష్టుడు తలచెను – కలవరము పుట్టించెను
మొర్దెకై వేదనతో రాజునొద్దకు పంపుట
దైవ చిత్తమని – ఎస్తేరును సిద్ధపరచెను
ఘనులేమి అల్పులేమి – షూషను కోటలో రాణి ఏమి
పిల్లలేమి పెద్దలేమి – ఉపవాసము చేయగా
అణిగింది హామాను గర్వము
జరిగింది దేవుని చిత్తము (2)     ||కావలెనా||

English Lyrics

Audio

విడువదు మరువదు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


విడువదు మరువదు – విడువదు మరువదు
విడువదు మరువదు – ఎన్నడూ ఎడబాయదు
ఎనలేని ప్రేమ – విలువైన ప్రేమ
మితిలేని ప్రేమ.. నీ ప్రేమ         ||విడువదు||

నా స్థితి ఏదైనా – చింత ఏదైనా
బాధ ఏదైనా – నను విడువదు
లోకమే నను చుట్టినా – ఆశలే నను ముట్టినా
యేసయ్య సాన్నిధ్యం – నను విడువదు
మా నాన్న నా చేయి విడువడు
ప్రాణంలా ప్రేమించే నా దేవుడు (2)

విడువడు మరువడు – విడువడు మరువడు
విడువడు మరువడు – ఎన్నడూ ఎడబాయడు

నన్ను ఎత్తుకున్న – నన్ను హత్తుకున్న
నా తండ్రి కౌగిలి – నే విడువను
శోకమే కృంగించినా – దుఃఖమే బాధించినా
నా ప్రియుని చిరునవ్వు – నే మరువను
నన్నెంతో ప్రేమించిన రాజును
ఎడబాసి మనలేనే రోజును (2)

విడువను మరువను – విడువను మరువను
విడువను మరువను – ఎన్నడూ ఎడబాయను
ఎనలేని ప్రేమ విలువైన ప్రేమ
మితిలేని ప్రేమ.. నీ ప్రేమ        ||విడువను||

English Lyrics

Audio

యేసయ్య మాట విలువైన మాట

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్య మాట విలువైన మాట
వినిపించుకోవా సోదరా
వినిపించుకోవా సోదరీ (2)
నీ గుండెలోన ముద్రించుకోవా
ఏ నాటికైనా గమనించలేవా
గమనించుము పాటించుము ప్రచురించుము
నిన్నూవలె నీ పొరుగువారిని
ప్రేమించమని ప్రేమించమని         ||యేసయ్య||

ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులని చెప్పిన మాట
నీతివిషయమై ఆకలిగొనువారు ధన్యులని చెప్పిన మాట
కనికరము గలవారు – హృదయశుద్ది గలవారు (2)
సమాధానపడువారు – సాత్వికులు ధన్యులని (2)
దుఃఖపడువారు ధన్యులని చెప్పిన మాట          ||యేసయ్య||

నరహంతకులు కోపపడువారు నరకాగ్నికి లోనగుదురని
అపహారకులు వ్యభిచరించువారు నరకములో పడిపోదురని
కుడిచెంప నిను కొడితే – ఎడమ చెంప చూపుమని (2)
అప్పడుగగోరువారికి నీ ముఖము త్రిప్పకుము (2)
నీ శత్రువులను ద్వేషించక ప్రేమించమని         ||యేసయ్య||

English Lyrics

Audio

సిలువ ధ్యానం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నీ సిలువే నా శరణము (2)
విలువైన రుధిరాన్ని కార్చి
వెలపోసి నన్ను కొన్నావు (2)
ప్రేమా త్యాగం నీవే యేసయ్యా
మహిమా నీకే ఆరోపింతును

గాయాలు పొందినావు – వెలివేయబడినావు
నా శిక్ష నీవు పొంది – రక్షణను కనుపరచావు (2)
నీ ప్రేమ ఇంత అంతని – నే తెలుపలేను
నీ కృపను చాటెదన్ – నా జీవితాంతము

నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ – మోయలేక మోసావు
కొరడాలు చెళ్ళని చీల్చెనే – నీ సుందర దేహమునే (2)
తడిపెను నీ తనువునే రుధిరంబు ధారలే (2)
వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా (2)

సిలువలో ఆ సిలువలో – ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)

విలువే లేని నా బ్రతుకును – విలువ పెట్టి కొన్నావయ్యా (2)
నాదు పాపమంతయూ (2)
నీదు భుజముపై మోసావయ్యా (2)

గొల్గొతా కొండ పైన (2)
గాయాలు పొందితివే (3)

చెమటయు రక్తముగా – ఆత్మల వేదనయూ (2)
పొందెను యేసు నీ కొరకే
తండ్రీ నీ చిత్తం – సిద్ధించు గాక అని పలికెను (2)

కల్వారిలో జీవామిచ్చెన్ (2)
నీ పాపములను తొలగించుటకై
నీదు సిలువన్ మోసెను యేసు (2)

రగిలిందిలే ఒక జ్వాలలా – ప్రభు యేసు హృదయము
కరిగిందిలే ఒక ధారలా – పరమాత్మ రుధిరము
చలించిపోయెనే ఆ సిలువ ధాటికి (2)
కసాయి చేతిలో అల్లాడిపోయెనే (2)

రగిలిందిలే ఒక జ్వాలలా – ప్రభు యేసు హృదయము
కరిగిందిలే ఒక ధారలా – పరమాత్మ రుధిరము

కృపా సత్య దేవా – సిలువలో మాకై బలియై
రక్తము చిందించినావు – రక్షణిచ్చినావు (2)
ఆరాధింతుము నిన్ను యేసు – ఆత్మ సత్యముతో
పాడి కొనియాడి కీర్తింతుము
పూజించి ఘనపరతుము

హాల్లేలూయా హాల్లేలూయా (3)
నిన్నే ఆరాధింతుమ్ (3)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నా సంకట దుఃఖములెల్ల

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా
నశింపజేయు దూత నన్ను దాటిపోయెను (2)   ||నా సంకట||

విలువైన గొర్రెపిల్ల రక్తము ద్వారా (2)
కలిగియున్న రక్షణలో దాగియుంటిని (2)           ||నా సంకట||

ఇంకా నేను ఫరోకు దాసుడను కాను (2)
ఇంకా నేను సీయోను కన్యుడను గాను (2)           ||నా సంకట||

మార్చబడు నాడు మారా మధురముగా (2)
పారు జలము బండనుండి త్రాగుచుండును (2)           ||నా సంకట||

సౌందర్యమయమగు పరమ కానాను (2)
నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పుజెందదు (2)           ||నా సంకట||

ఆనందమే పరమానందమే (2)
కానాను జీవితము నా కానందమే (2)           ||నా సంకట||

నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు (2)
నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును (2)           ||నా సంకట||

నా యేసు ప్రభువే నా బలము గానము (2)
నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా (2)           ||నా సంకట||

English Lyrics

Audio

HOME