చుక్క పుట్టింది – 2

పాట రచయిత: మోజెస్ డేవిడ్ కళ్యాణపు
Lyricist: Moses David Kalayanapu

Telugu Lyrics

యుగపురుషుడు శకపురుషుడు
ఇమ్మానుయేలు లోకరక్షకుడు
చుక్క పుట్టింది ధరణి మురిసింది

చుక్క పుట్టింది ధరణి మురిసింది
రాజులకు రారాజు వచ్చాడనింది
ఆకాశంలోన వెలుగే నింపింది – శ్రీ యేసు పుట్టాడని
ఈ బాలుడే తండ్రి పరిశుద్ధాత్మలతో కలిసిన త్రియేక దేవుడని
ఈ బాలుడే మన పితరులకు వాగ్ధానం చెయ్యబడిన మెస్సయ్యా ఇతడేనని
ఈ బాలుడే తన నోటిమాటతో జగమును సృష్టించిన ఎలోహిమ్ దేవుడని
ఈ బాలుడే నిన్న నేడు నిరంతరము ఉండువాడని..

శకమే ముగిసే నవశకమే మొదలే
నింగి నేల ఆనందముతో నిండెనే
దివినే విడిచే పరమాత్ముడే
పాపం శాపం తొలగింప నేతెంచెనే…..
శరీరధారిగా భువిలోకి వచ్చెగా – మన కోసమే ఇమ్మానుయేల్
మన పాప శాపముల్ హరింపవచ్చెగా – మన కోసమే రక్షకుడై (2)

జగత్త్పునాది వేయకముందే – ఉన్నవాడే ఉన్నవాడే
అబ్రహాముకంటే ముందే – ఉన్నవాడే ఉన్నవాడే
వెలుగు కమ్మని నోటితో పలికినవాడే
సూర్య చంద్ర తారలను చేసినవాడే
నిన్న నేడు నిరతరము నిలిచేవాడు ఈయనే
నిత్యానందము నిత్యజీవము – నీకిచ్చును ఇమ్మానుయేల్
నీ చీకటంతయు తొలగింపవచ్చెగా – నీ కోసమే నీతి సూర్యుడై (2)

దుఃఖితులను ఓదార్చుటకు – వచ్చినవాడే మన యేసయ్యా
పాపములను తొలగించుటకు – వచ్చినవాడే మన యేసయ్యా
మంటి నుండి మానవుని చేసినవాడే
మహిమను విడచి మనకోసమే వచ్చాడే
కంటి పాపలా మనలను కాచేవాడు ఈయనే
మహిమా స్వరూపుడే మనుజావతారిగా – మహిలోకీ వచ్చె ఇమ్మానుయేల్
మన పాప శాపముల్ హరింపవచ్చెగా – మన కోసమే రక్షకుడై (2)      ||చుక్క పుట్టింది||

ఇమ్మానుయేలు ఎలోహిమ్
ఇమ్మానుయేలు ఎల్ షడ్డాయ్
ఇమ్మానుయేలు అడోనాయ్ – యావే
ఇమ్మానుయేలు రాఫా
ఇమ్మానుయేలు ఎల్ రోయి
ఇమ్మానుయేలు ఎల్ ఓలం – షాలోమ్
ఎల్ ఇజ్రాయెల్ ఎల్ హన్నోరా
ఎల్ మీకాదేష్ ఎల్ హక్కావోద్ – ఇమ్మానుయేల్

ఆమెన్ అనువాడా అల్ఫా ఒమేగా
నిన్న నేడు నిరతము నిలుచువాడా (2)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

రక్షకుడు వచ్చినాడు

పాట రచయిత: డేవిడ్సన్ గాజులవర్తి
Lyricist: Davidson Gajulavarthi

Telugu Lyrics


రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా
నిన్ను నన్ను పరముకు చేర్చ భువికొచ్చాడమ్మా (2)
పాపమే లేనోడమ్మా పాపుల రక్షకుడమ్మా
ప్రాణమియ్య వెనుకాడని ప్రేమామయుడోయమ్మా
మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా
జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా (2)

ప్రవక్తల ప్రవచనాలు నేరవేర్చాడమ్మా
మోడుబారిన బ్రతుకులలో దావీదు చిగురమ్మా (2)
బాలుడై వచ్చాడమ్మా భారమే మోసాడమ్మా
విడుదలనే ఇచ్చిన దేవుని గొర్రెపిల్లమ్మా ||మన కోసం||

వినరే ప్రేమామయుని చరితం వినరే జనులారా
నమ్మితే చాలు మోక్షమునిచ్చును నమ్ము మనసారా (2)
వెల తానే చెల్లించి తన వారసులుగ ఎంచి
నిత్యం తనతో ఉండే భాగ్యమునిచ్చాడమ్మా        ||మన కోసం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సర్వోన్నత

పాట రచయిత: డేనియల్ పమ్మి
Lyricist: Daniel Pammi

Telugu Lyrics


సర్వోన్నత స్థలములలో సమాధానము
ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను (2)
హల్లెలూయా అర్పణలు – ఉల్లముతో చెల్లింతుమ్
రాజాధి రాజునకు – హోసన్నా ప్రభువునకు (2)      ||సర్వోన్నత||

పశువుల పాకలో మనకు శిశువు జన్మించె
పొత్తిగుడ్డలలో చుట్టగ పవళించిన తండ్రి (2)
ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త (2)
నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు (2)         ||హల్లెలూయా||

మన వ్యసనములను బాప మొత్తబడుట కొరకై
మన సమాధానార్థ శిక్ష మోపబడుట కొరకై (2)
మన దోషము బాప – మానవరూపమున (2)
జనియించె బాలుండు ఇమ్మానుయేలుండు (2)         ||హల్లెలూయా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

క్రిస్మస్ మెడ్లీ 1

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నజరేతు పట్నాన నాగుమల్లె ధరణిలో
యోసేపు మరియమ్మ నాగుమల్లె ధరణిలో (2)
హల్లెలూయా హల్లెలూయా (4)

మేము వెళ్లి చూచినాము స్వామి యేసు నాథుని (2)
ప్రేమ మ్రొక్కి వచ్చినాము మామనంబు లలరగా (2)
బేతలేము పురములోన బీద కన్య మరియకు (2)
పేదగా సురూపు దాల్చి వెలసె పశుల పాకలో (2)

పేద వడ్ల వారి కన్య మరియమ్మ
ప్రేమ గల యేసు తల్లి మరియమ్మ
ప్రేమ గల యేసు తల్లి
పేరెళ్ళిన దేవా దేవుడే
యేసయ్య.. ప్రేమ గల అవతారం (2)
స్వర్గ ద్వారాలు తెరిచిరి
యేసయ్య… స్వర్గ రాజు పుట్టగానే
యేసయ్య… స్వర్గ రాజు పుట్టగానే
సరుగున దూతలు వచ్చిరి
యేసయ్య.. చక్కని పాటల్ పాడిరి (2)

నువ్వు బోయే దారిలో యెరూషలేం గుడి కాడ (2)
అచ్ఛం మల్లె పూల తోట యేసయ్య (2)
దొడ్డు దొడ్డు బైబిళ్లు దోసిట్లో పెట్టుకొని (2)
దొరోలే బయలెల్లినాడే యేసయ్య (2)

రాజులకు రాజు పుట్టన్నయ్య (2)
రారే చూడ మనం వెళ్లుదాం అన్నయ్య (2)
తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2)
తరలినారే బెత్లహేము అన్నయ్య (2)

పదరా పోదాము రన్న
శ్రీ యేసుని చూడ
పదరా పోదాము రన్న (2)

శ్రీ యేసన్న నట లోక రక్షకుడట (2)
లోకులందరికయ్యె ఏక రక్షకుడట (2)
పదరా.. హే – పదరా.. హే
పదరా పోదాము రన్న – శ్రీ యేసుని చూడ
పదరా పోదాము రన్న (4)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆకాశమే పట్టనోడు

పాట రచయిత: కే ఆర్ జాన్
Lyricist: KR John

Telugu Lyrics

అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని చూడరే
పుడమియే పరవశించె పసిబాలుని చూడగనే… పసిబాలుని చూడగనే

ఆకాశమే పట్టనోడు – ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు దీనుడై – వెలసినాడు రక్షకుడు (2)
ఆనందమే మహా ఆనందమే – అందరికి ఇలలో సంతోషమే
ఆశ్చర్యమే ఇది అద్భుతమే – యేసు జననం అద్భుతమే (2)

అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు
ఆది అంతమైన పరలోక నాథుడు(2)
ఆదియందు వాక్యంబుగా – సృష్టి కార్యము జరిగించినాడు
అనాది నుండి జ్ఞానంబుగా – సృష్టి క్రమము నడిపించినాడు (2)
అన్నిటిని కలిగించిన మహరాజు
కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు (2)     ||ఆనందమే||

ప్రేమను పంచే ప్రేమామయుడు
రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు (2)

పాపమే లేని సుగుణాల సుందరుడు
శాపము బాపను జన్మించెను చూడు (2)
నిత్యముండు నీతి సూర్యుడు – సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు
ప్రేమను పంచే పావనాత్ముడు – పశుల పాకలో పవళించినాడు (2)
సర్వాధికారియైన మహరాజు
దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు (2) ||ఆనందమే||    ||ఆకాశమే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

వచ్చింది వచ్చింది వచ్చింది

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా
మార్పులేకుండ చేస్తే శుద్ద దండగా
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ
యేసయ్య కోరింది మనలో మార్పునే కదా
ఇంటికి రంగులు కాదు – వంటికి హంగులు కాదు
అల్లరి ఆటలు కాదు – త్రాగుబోతు విందులు కాదు (2)
మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్
అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్
దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్
ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్      ||వచ్చింది||

రంగురంగు వస్త్రాలు – మురికిగుడ్డల మనస్సులు
మెరిసిపోతున్న ఇళ్ళు – మాసిపోయాయి హృదయాలు
ఇంటిపైన నక్షత్రాలు – ఇంటిలో మద్యపానులు
పేరుకేమో క్రైస్తవులు – తీరుమారని జనులు (2)      ||ఇంటికి||

విద్యలేని పామరులు – విధేయులై బ్రతికారు
విద్యవున్న సోమరులు – మందిరాలకే రారు
తూర్పుదేశపు జ్ఞానులే – మోకాళ్ళు వంచినారు
చదువు పదవుంటే చాలు – మోకరించరు వీరు (2)      ||ఇంటికి||

దినములు చెడ్డవి గనుక – సమయమును పోనియ్యక
అజ్ఞానులవలె కాక – జ్ఞానులవలె నడవాలి
పాపము తీయుట కొరకే – ప్రభు పుట్టాడని తెలిసి
పాపము వీడక నీవు – ఉత్సవ ఉల్లాసాలా (2)      ||ఇంటికి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సామాన్యుడవు కావు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


(హో) హ్యాప్పీ క్రిస్మస్ హ్యాప్పీ క్రిస్మస్
హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)
సామాన్యుడవు కావు సృష్టికర్తవు నీవు
బలహీనుడవు కావు బలమైన దేవుడవు (2)
పాపిని రక్షింప యేసు పరమును వీడావు
చీకటి తొలగించి మాలో వెలుగును నింపావు (2)

ఆదాము హవ్వలు చేసిన పాపం శిక్షను తెచ్చింది (2)
క్రీస్తు చేసిన త్యాగం మనకు రక్షణ నిచ్చింది (2)     ||హ్యాప్పీ క్రిస్మస్||

జ్ఞానులు గొర్రెల కాపరులు ప్రభువుని చూశారు (2)
దీనులైన వారలకు ఆ భాగ్యం దొరికింది (2)     ||హ్యాప్పీ క్రిస్మస్||

యేసుని నీవు నమ్మినచో శాంతి సమాధానం (2)
నిత్యమైన సంతోషం పరలోకమే నీ సొంతం (2)     ||హ్యాప్పీ క్రిస్మస్||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

దివి నుండి భువికి

పాట రచయిత: ఎం యేసు పాల్
Lyricist: M Yesu Paul

Telugu Lyrics


దివి నుండి భువికి రారాజుగా
బేత్లెహేము పురముకు ఏతెంచెను (2)
గ్రామమంతా చిరునవ్వు లొలికె
పట్టణమంతా పండుగ చేసె (2)
సర్వలోకము సంబరమాయె (2)

ఆశ్చర్యకరుడు హల్లెలూయ
ఆలోచనకర్త హల్లెలూయ
బలమైన దేవుడు హల్లెలూయ
నిత్యుడగు తండ్రి హల్లెలూయ
సమాధానకర్త హల్లెలూయ

గొల్లలు జ్ఞానులు పరవశులై
బంగారం సాంబ్రాణి బోళమును (2)
సాష్టాంగపడి తమ హృదయములన్
ప్రభువుకు కానుకలర్పించిరి
మనము కూడా అర్పించెదం
ప్రభువు నామము ఘనపరచెదం
మనము కుడా సాష్టాంగపడుచు
పరవశించుచు పాడెదము       ||ఆశ్చర్యకరుడు||

పాపము శాపము బాపగను
వేదన శోధన తీర్చగను (2)
పరిశుద్ధుడు జన్మించెనని
ఇహమున పరమున కొనియాడెదం
మనము కూడా కొనియాడెదం
ప్రభువు నామం ఘనపరచెదం
మనము కూడా హోసన్నయనుచు
కరములెత్తి పాడెదము       ||ఆశ్చర్యకరుడు||     ||గ్రామమంతా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దావీదు వంశంలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దావీదు వంశంలో – బెత్లేము గ్రామములో యేసయ్యా జన్మించెను
యేసయ్య కథ వింటే రక్షణ కలుగును – మార్గము సత్యం జీవము (2)
ఇది ఇమ్మనుయేలుని ధన్య చరితం
పరిశుద్ధ దేవుని దివ్య రచితం
నమ్మిన వారికి కలుగును జీవము
పరిశుద్ధ ఆత్ముని కార్య ఫలితం
గొల్లలు జ్ఞానులు చాటారు రక్షకుని
మహిమ పరిచిరి సాక్ష్యములు ఇచ్చిరి
హల్లెలూయ హల్లెలూయ దూతల గానాలు
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ రక్షణ స్తోత్రాలు
అరె హల్లెలూయ హల్లెలూయ


క్రీస్తు జన్మము మార్చింది చరితను – క్రీస్తు శకముగ ప్రారంభము
చీకటి రాజ్యముకు అంతము కలిగెను – దైవ రాజ్యము ఆరంభము (2)
పాత బ్రతుకును క్రొత్తదిగా మార్చును
మరణచ్చాయలు అంతమగును
అంతమే లేని జీవము నీకిచ్చును
ఆది అంతము ఆ ప్రభువు      ||గొల్లలు||

జీవాహారమును జీవజలమును నేనే – మంచి కాపరిని నేనన్నాడు
భారమంతయు నాపైన మోపితే – నిత్యం భరియిస్తా నేనన్నాడు (2)
దిగులుచెందకు ఆనందించు నాలో
నీ స్నేహితుడ నేనన్నాడు
మరల హృదయంలో తిరిగి నీవు జన్మిస్తే
దేవుని రాజ్యంలో చోటన్నాడు      ||గొల్లలు||

English Lyrics

Audio

క్రిస్మస్ మెడ్లీ 2

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నర జన్మమెత్తి వరసుతునిగా
అరుదెంచె నేడు సరసముగా
శ్రీ వేల్పుడగు ఆనందమూర్తి
క్రీస్తేసు స్వామి ఈ భువిలోన
మానసవేది పావనమూర్తి
మానవులను పాలించుకర్త
నర జన్మమెత్తి…

లోకముద్ధరింప పరిశుద్ధ జన్మ
మెత్తి కన్య మరియ గర్భవతియాయే (2)    ||మానసవేది||

బంతి యనగ యాడరే మన
బాల చిన్న ముద్దుల యేసుకు (2)
ముత్తిక తోడ కూడి యాడి
ముద్దుల పరుడు పల్క పరుడు

గ గ గ రి గ మ మ మ మ
ప మ ప మ ప ద ని స (2)
ప ద ని స.. ప ద ని స..
ప ద ప ద గ మ గ మ గ రి స రి ||బంతి||

జ్ఞానులెల్ల వచ్చిరి
మంచి కానుకలర్పించిరి (2)       ||ముత్తిక||

జననము నొందెను జయ యేసు
జయ గీతములు పాడుడి (2)
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

గొర్రెల కాపరులకు దూత
గొప్ప వార్తను తెలిపినట (2)        ||జననము||

శ్రీ యేసుండు జన్మించే రేయిలో (2)
నేడు పాయక బేత్లెహేమ యూరిలో (2)

సత్రమందున పశువుల శాలయందున (2)
దేవపుత్రుండు మనుజుండాయెనందున (2)          ||శ్రీ యేసుండు||

చూడబోదాము రారే
సకల జనంబులార
శ్రీ యేసు నాథుని జన్మంబు (2)
ఆనందముతో మనమందరం (2) ఆహ        ||చూడబోదాము||

ఘల్లు ఘల్లున మనమెల్లి యేసుని
పాదంబు జంబులకు మ్రొక్కెదము (2)       ||ఆనందముతో||
ఆహ చూడ… ఆహ చూడ…
ఆహ చూడబోదాము రారే
సకల జనంబులార
శ్రీ యేసు నాథుని జన్మంబు (2)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME