ఓ క్రైస్తవ యువకా

పాట రచయిత: బొంతా సమూయేలు
Lyricist: Bonthaa Samooyelu

Telugu Lyrics

ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా (2)
నీ బ్రతుకంతా మారుటే మేలు
కోరుము జీవమునే         ||ఓ క్రైస్తవ||

పాపపు చీకటి బ్రతుకేలా
శాపము భారము నీకేలా (2)
పావన యేసుని పాదము చేరిన
జీవము నీదగురా       ||ఓ క్రైస్తవ||

మారిన జీవిత తీరులలో
మానక నీప్రభు సేవకురా (2)
మహిమ కిరీటము మనకొసగును
ఘనమే నీదగురా       ||ఓ క్రైస్తవ||

భయపడి వెనుకకు పరుగిడక
బలమగు వైరిని గెలిచెదవా (2)
బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన
గెలుపే నీదగురా          ||ఓ క్రైస్తవ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

ఎందరో ఎందరు ఎందరో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఎందరో… ఎందరు ఎందరో…
యేసుని ఎరుగనివారు చెబుతారా వారికి మీరు
రాయబారులై బారులు తీరి తరలండి
క్రీస్తుకు రాయబారులై సిలువ ధ్వజం చేబూనండి
వందలు వేలు ఏళ్ళు గడుస్తున్నాయి
సువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి (2)          ||ఎందరో||

పల్లె పల్లెలో పట్టణాలలో క్రీస్తు మార్గమే చూపుదాం
పల్లె పల్లెలో పట్టణాలలో యేసు వార్తనే చాటుదాం
వాగులు వంకలు దాటుదాం
యేసు సిలువ ప్రేమనే చాటుదాం (2)         ||వందలు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

కాలం సమయం నాదేనంటూ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా
రోజులు అన్ని నావేనంటూ జీవిస్తున్నావా (2)
దేవుని ముందు నిలిచే రోజుంది
తక్కెడ తూకం వేసే రోజుంది (2)
జీవ గ్రంథం తెరిచే రోజుంది
నీ జీవిత లెక్క చెప్పే రోజుంది
ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా
ఆగవేమయ్యా నీ మనస్సు మార్చుకోవయ్యా (2)        ||కాలం||

ధనము బలము ఉన్నదని విర్రవీగుతున్నావా
మేడలు మిద్దెలు ఉన్నాయని అనుకుంటున్నావా (2)
గుజరాతును చూడవయ్యా ఎంత ఘోరమో
ఒక్క ఘడియలెందరో బికారులయ్యారు (2)         ||ఆగవేమయ్యా||

చూసావా భూకంపాలు కరువులు విపరీతాలు
పరిశుద్ధ గ్రంథములోని కడవరి కాలపు సూచనలు (2)
నిన్నటి వరకు కొదువ లేదని అనుకున్నారు
ఒక్క ఘడియలో ఎందరో నశించిపోయారు (2)         ||ఆగవేమయ్యా||

సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలు
సిద్ధపడని వారికి ఆ నరకపు ద్వారాలు (2)
అగ్ని ఆరదు పురుగు చావదు
నిత్యం ఏడుపు దుఃఖాలు (2)           ||ఆగవేమయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మహిమగల తండ్రి

పాట రచయిత: డేవిడ్ రాజు
Lyricist: David Raju

Telugu Lyrics


మహిమగల తండ్రి – మంచి వ్యవసాయకుడు
మహితోటలో నర మొక్కలు నాటించాడు (2)
తన పుత్రుని రక్తనీరు – తడి కట్టి పెంచాడు
తన పరిశుద్ధాత్మను – కాపుగా వుంచాడు (2)
కాయవే తోటా – కమ్మని కాయలు
పండవే చెట్టా – తియ్యని ఫలములు (2)       ||మహిమ||

నీతి పూత జాతి కర్త – ఆత్మ సుతా ఫలములు
నీ తండ్రి నిలువచేయు – నిత్య జీవ ఫలములు (2)
అనంతమైన ఆత్మ బంధ – అమర సుధా కాంతులు (2)
అనుకూల సమయమయ్యె – పూయు పరమ పూతలు (2)         ||కాయవే||

అపవాది కంటబడి – కుంటుబడి పోకు
కాపుకొచ్చి చేదు పండ్లు – గంపలుగా కాయకు (2)
అదిగో గొడ్డలి వేరు – పదును పెట్టియున్నది (2)
వెర్రిగా చుక్కలనంటి – ఎదిగి విర్రవీగకు (2)         ||కాయవే||

కలువరి కొండలో పుట్టి – పారిన కరుణా నిధి
కలుషమైన చీడ పీడ – కడిగిన ప్రేమానిధి (2)
నిజముగాను నీవు – నీ సొత్తు కావు (2)
యజమాని వస్తాడు – ఏమి ఫలములిస్తావు (2)         ||కాయవే||

ముద్దుగా పెంచాడు – మొద్దుగా నుండకు
మోదమెంతో ఉంచాడు – మోడుబారి పోకు (2)
ముండ్ల పొదలలో కృంగి – మెత్తబడి పోకు (2)
పండ్లు కోయ వచ్చువాడు – అగ్నివేసి పోతాడు (2)         ||కాయవే||

English Lyrics

Audio

భారత దేశ సువార్త సంఘమా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


భారత దేశ సువార్త సంఘమా – భువి దివి సంగమమా
ధర సాతానుని రాజ్యము కూల్చే – యుద్ధా రంగమా     ||భారత||

ఎవని పంపుదును నా తరపున – ఇల ఎవరు పోవుదురు నాకై
నేనున్నాను నన్ను పంపమని – రమ్మూ సంఘమా
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా         ||భారత||

అడవి ప్రాంతములు, ఎడారి భూములు – ద్వీపవాసులను గనుమా
అంధకార ప్రాంతములో ప్రభుని – జ్యోతిని వెలిగించను కనుమా
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా         ||భారత||

బ్రతుకులోన ప్రభు శక్తిలేని – క్రైస్తవ జనాంగమును గనుమా
కునుకు దివ్వెలను సరిచేయగ – ఉజ్జీవ జ్వాలగొని చనుమా
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా         ||భారత||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దేవుని సముఖ జీవ కవిలెలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దేవుని సముఖ జీవ కవిలెలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే (2)
హత సాక్షుల కవిలెలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన (2)
విజయవీరుల కవిలెలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు (2)
సర్వోన్నతుని పురములలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

దేవుని సన్నిధి మహిమ ధననిధి – దాతను వేడి వరము పొందిన (2)
ప్రార్ధన వీరుల కవిలెలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

పరమునుండి ప్రభువు దిగగా – పరిశుద్ధులు పైకెగయునుగా (2)
పరిశుద్ధుల కవిలెలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆశపడకు ఈ లోకం కోసం

పాట రచయిత: యూ యిర్మియా
Lyricist: U Irmiyaa

Telugu Lyrics

ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా
ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా
మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా          ||ఆశపడకు||

ఆశలు రేపే సుందర దేహం – మట్టి బొమ్మ ఓ చెల్లెమ్మా
దేహం కోరేదేదైనా – అది మట్టిలోనే పుట్టిందమ్మా (2)
వెండి బంగారు వెలగల వస్త్రం
పరిమళ పుష్ప సుగంధములు (2)
మట్టిలోనుండి వచ్చినవేనని
మరువబోకు నా చెల్లెమ్మా (2)           ||ఆశపడకు||

అందమైన ఓ సుందర స్త్రీకి – గుణములేక ఫలమేమమ్మా
పంది ముక్కున బంగారు కమ్మీ – పెట్టిన ఫలితం లేదమ్మా (2)
అందమైన ఆ దీనా షెకెములు
హద్దులేక ఏమయ్యిందమ్మా (2)
అంతరంగమున గుణముకలిగిన
శారా చరిత్రకెక్కిందమ్మా (2)           ||ఆశపడకు||

జాతి కొరకు ఉపవాస దీక్షతో – పోరాడిన ఎస్తేరు రాణిలా
నీతి కొరకు తన అత్తను విడువక – హత్తుకున్న రూతమ్మ ప్రేమలా (2)
కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి
తన కురులతో తుడిచిన మగ్దలీనలా (2)
హన్నా వలె మన దోర్కా వలె
ప్రిస్కిల్ల వోలె విశ్వాస వనితలా (2)
వారి దీక్షయే వారసత్వమై
అనంత రాజ్యపు నిత్య స్వాస్థ్యమై (2)
పవిత్రమైన హృదయము కలిగి
ప్రభువు కొరకు జీవించాలమ్మా (2)           ||ఆశపడకు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

కూర్చుందును నీ సన్నిధిలో

పాట రచయిత: జోసఫ్ కొండా
Lyricist: Joseph Konda

Telugu Lyrics

కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం
ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం (2)
నిరంతరం నీ నామమునే గానము చేసెదను
ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను           ||కూర్చుందును||

ప్రతి విషయం నీకర్పించెదా
నీ చిత్తముకై నే వేచెదా (2)
నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా (2)
నీ నామమునే హెచ్చించెదా (2)
నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే
నా ఆనందము నీవే – నా ఆధారము నీవే
యేసూ యేసూ యేసూ యేసూ..         ||కూర్చుందును||

ప్రతి దినము నీ ముఖ కాంతితో
నా హృదయ దీపం వెలిగించెదా (2)
నీ వాక్యానుసారము జీవించెదా (2)
నీ ఘన కీర్తిని వివరించెదా (2)
నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే
నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే
యేసూ యేసూ యేసూ యేసూ..         ||కూర్చుందును||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సహోదరులారా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సహోదరులారా ప్రతి మనుష్యుడు
ఏ స్థితిలో పిలువబడెనో
ఆ స్థితియందే దేవునితో సహవాసము
కలిగియుండుట మేలు (2)

సున్నతి లేకుండ పిలువబడితివా
సున్నతి పొంద నీవు ప్రయత్నించవద్దు (2)
సున్నతి పొంది నీవు పిలువబడితివా
సున్నతిని నీవు పోగొట్టుకొనవద్దు (2)
దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే
మనకెంతో ముఖ్యమైనది (2)        ||సహోదరులారా||

దాసుడవైయుండి పిలువబడితివా
స్వతంత్రుడవగుటకు ప్రయత్నించుము (2)
స్వతంత్రుడుగ నీవు పిలువబడితివా
క్రీస్తు యేసుకు నీవు దాసుడవు (2)
విలువ పెట్టి మనము కొనబడినవారము
మనుష్యులకెప్పుడూ దాసులుగా ఉండకూడదు (2)         ||సహోదరులారా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

రాకడ సమయంలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో
యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2)
రావయ్య యేసయ్య – వేగరావయ్యా
రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2)       ||రాకడ||

యేసయ్య రాకడ సమయంలో
ఎదురేగె రక్షణ నీకుందా? (2)
లోకాశలపై విజయం నీకుందా? (2)       ||రావయ్య||

ఇంపైన ధూపవేదికగా
ఏకాంత ప్రార్థన నీకుందా? (2)
యేసు ఆశించే దీన మనస్సుందా? (2)       ||రావయ్య||

దినమంతా దేవుని సన్నధిలో
వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2)
యేసునాథునితో సహవాసం నీకుందా? (2)       ||రావయ్య||

శ్రమలోన సహనం నీకుందా?
స్తుతియించే నాలుక నీకుందా? (2)
ఆత్మలకొరకైన భారం నీకుందా? (2)       ||రావయ్య||

నీ పాత రోత జీవితము
నీ పాప హృదయం మారిందా? (2)
నూతన హృదయంతో ఆరాధన నీకుందా? (2)       ||రావయ్య||

అన్నీటికన్నా మిన్నగను
కన్నీటి ప్రార్థన నీకుందా? (2)
ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా? (2)       ||రావయ్య||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME