మనలో ప్రతి ఒక్కరి

పాట రచయిత: ప్రభు భూషణ్ ప్రత్తిపాటి
Lyricist: Prabhu Bhushan Pratthipaati

Telugu Lyrics


మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు
మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు (2)
హృదయాంత రంగములో బాధలు తెలుసు
మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు (2)
జగత్తు పునాది వేయబడక ముందే
మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా (2)       ||మనలో||

మనసులోని మాట నీవు పలుకకముందే
ఎరిగియున్నాడు – యేసు ఎరిగియున్నాడు
తల్లి గర్భమునందు నిను రూపించకముందే
ఎరిగియున్నాడు – యేసు ఎరిగియున్నాడు (2)
సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించినా
ఆకాశ వీధులలో నీవు విహరించినా (2)
ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమా
ప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా        ||మనలో||

నీవు నడిచే దారిలో నీతో సహవాసిగా
యేసు ఉన్నాడు – ప్రభు యేసు ఉన్నాడు
నీవు మాట్లాడు వేళలో మంచి స్నేహితునిగా
యేసు ఉన్నాడు – ప్రభు యేసు ఉన్నాడు (2)
నీ యవ్వన కాలమున ప్రభు యేసుని స్మరియించి
నీ ఒంటరి సమయములో కన్నీటితో ప్రార్ధించు (2)
ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమా
ప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా        ||మనలో||

English Lyrics

Audio

ఈ జీవితం విలువైనది

పాట రచయిత: సత్యవేద సాగర్
Lyricist: Satyaveda Sagar

Telugu Lyrics

ఈ జీవితం విలువైనది
నరులారా రండని సెలవైనది (2)
సిద్ధపడినావా చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు
నీవుండుటకు           ||ఈ జీవితం||

సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2)
పోతున్నవారిని నువు చుచుటలేదా (2)
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2)    ||ఈ జీవితం||

మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు
కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2)
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2)
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2)    ||ఈ జీవితం||

పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2)
యేసు రక్తమే నీ పాపానికి మందు (2)
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2)    ||ఈ జీవితం||

English Lyrics

Audio

మెల్లని చల్లని

పాట రచయిత: ఎం ఎస్ శాంతవర్ధన్
Lyricist: M S Shanthavardhan

Telugu Lyrics


మెల్లని చల్లని స్వరము యేసయ్యదే
ఉల్లమంతటిని నింపు ఆనందము
అల్లకల్లోలము బాపి శాంతి నిచ్చుఁన్       ||మెల్లని||

శూన్యము నుండి సర్వం – సృష్టి చేసెనుగా
మంచిదంతటిని మాటతో చేసెను
పాపులను పిలిచిన ప్రేమ గల స్వరము
పావనపరచెడి పరిశుద్ధుని స్వరము       ||మెల్లని||

స్వస్థత శక్తి కలదు ప్రభుని స్వరమందున
దీనులను ఆదరించు దివ్య కరుణ స్వరం
కుళ్ళిన శవమునందు జీవమును పోసెను
పునరుత్తాన బలం కలదు ఆ స్వరములో       ||మెల్లని||

గాలి తుఫానులన్ అణచిన స్వరమది
భీతి భయములన్ని బాపెడి స్వరమది
అంత్య దినమందున మృతుల లేపునుగా
అందరికి తీర్పును తీర్చి పాలించును       ||మెల్లని||

మహిమ గల ఆ స్వరం పిలుచుచుండె నిన్ను
మహిమ నాథుండేసు కోరుచుండె నిన్ను
మహిమ గల ఆ స్వరం వినెడి చెవులున్నావా
మహిమ నాథుండేసున్ కోరు హృది ఉన్నదా       ||మెల్లని||

English Lyrics

Audio

దేవుని ప్రేమ ఇదిగో

పాట రచయిత: గొల్లపల్లి నతానియేలు
Lyricist: Gollapalli Nathaaniyelu

Telugu Lyrics


దేవుని ప్రేమ ఇదిగో – జనులార – భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును         ||దేవుని||

సర్వలోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెను
సర్వోపకారుడుండే – మన మీద – జాలిపరుడై యుండెను         ||దేవుని||

మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెను
మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే         ||దేవుని||

యేసు క్రీస్తను పేరున – రక్షకుడు – వెలసి నాడిలలోపల
దోసకారి జనులతో – నెంతో సు – భాషలను బల్కినాడు         ||దేవుని||

పాప భారంబు తోడ – నే ప్రొద్దు – ప్రయాసముల బొందెడి
పాపులందరు నమ్మిన – విశ్రాంతి – పరిపూర్ణమిత్తు ననెను         ||దేవుని||

సతులైన పురుషులైనన్ – యా కర్త – సర్వ జనుల యెడలను
సత్ప్రేమగా నడిచెను – పరలోక – సద్బోధలిక జేసెను         ||దేవుని||

చావు నొందిన కొందరిన్ – యేసుండు – చక్కగా బ్రతికించెను
సకల వ్యాధుల రోగులు – ప్రభు నంటి – స్వస్థంబు తా మొందిరి         ||దేవుని||

గాలి సంద్రపు పొంగులన్ – సద్దణిపి – నీళ్లపై నడచినాడే
మేలు గల యద్భుతములు – ఈలాగు – వేల కొలదిగ జేసెను         ||దేవుని||

చేతుల కాళ్లలోను – రా రాజు – చేర మేకులు బొందెను
పాతకులు గొట్టినారే – పరిశుద్ధ – నీతి తా మోర్వలేకన్         ||దేవుని||

ఒడలు రక్తము గారగ – దెబ్బలు – చెడుగు లందరు గొట్టిరి
వడిముళ్లు తల మీదను – బెట్టిరి – ఓర్చెనో రక్షకుండు         ||దేవుని||

ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు – చున్న పాప నరులను
మన్నించు మని తండ్రిని – యేసుండు – సన్నుతితో వేడెను         ||దేవుని||

రక్షకుడు శ్రమ బొందగా – దేశంబు – తక్షణము చీకటయ్యెన్
రక్షకుడు మృతి నొందగ – తెర చినిగి – రాతి కొండలు పగిలెను         ||దేవుని||

రాతి సమాధిలోను – రక్షకుని – నీతిగల దేహంబును
పాతి పెట్టిరి భక్తులు – నమ్మిన – నాతు లందరు జూడగా         ||దేవుని||

మూడవ దినమందున – యేసుండు – మృతి గెల్చి లేచినాడు
నాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున్         ||దేవుని||

పదునొకండు మారులు – వారలకు – బ్రత్యక్షు డాయె నేసు
పరలోకమున కేగెను – తన వార్త – బ్రకటించు మని పల్కెను         ||దేవుని||

నమ్మి బాప్తిస్మమొందు – నరులకు – రక్షణ మరి కల్గును
నమ్మ నొల్లక పోయెడు – నరులకు – నరకంబు సిద్ధమనెను         ||దేవుని||

English Lyrics

Audio

నీ నిర్ణయం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నీ నిర్ణయం ఎంతో విలువైనది ఈ లోకంలో
అది నిర్దేశించును జీవిత గమ్యమును
ఈనాడే యేసుని చెంతకు చేరు (2)       ||నీ నిర్ణయం||

లోకం దాని ఆశలు గతించిపోవును
మన్నైన నీ దేహం మరల మన్నై పోవును (2)
మారుమనస్సు పొందినచో పరలోకం పొందెదవు
క్షయమైన నీ దేహం అక్షయముగా మారును (2)       ||నీ నిర్ణయం||

పాపం దాని ఫలము నిత్య నరకాగ్నియే
శాపంతో నీవుండిన తప్పదు మరణము (2)
భరియించె నీ శిక్ష సిలువలో ఆ ప్రభు యేసే
ఈనాడే యోచించి ప్రభు యేసుని నమ్ముకో (2)       ||నీ నిర్ణయం||

English Lyrics

Audio

వీనులకు విందులు చేసే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర
వేగిరమే వినుటకు రారండి
ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి     ||వీనులకు||

రండి… విన రారండి
యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)
నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి
మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)
రండి…                 ||వీనులకు||

రండి… వచ్చి చూడండి
యేసయ్య చేసే కార్యములు చూడండి (2)
నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి
శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)
రండి…                 ||వీనులకు||
సృష్టి కర్తను మరచావు నీవు
సృష్టిని నీవు పూజింప దగునా (2)
భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి
నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2)
రండి…                 ||వీనులకు||

English Lyrics

Audio

నలుగకుండ గోధుమలు

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Telugu Lyrics


నలుగకుండ గోధుమలు కడుపు నింప గలుగునా
కరగకుండ కొవ్వొత్తి కాంతి నివ్వగలుగునా (2)
ఆత్మీయ యాత్రలో నలుగుటయే విలువయా
ఇరుకైన బాటలో కరుగుటయే వెలుగయా (2)       ||నలుగకుండ||

పగలని బండనుండి జలములు హోరులు
విరుగని పొలము మనకు పంటలివ్వగలుగునా (2)
పరలోక యాత్రలో పగులుటయే ఫలమయా (2)
విశ్వాసి బాటలో విరుగుటయే పరమయా (2)       ||నలుగకుండ||

రక్తము చిందకుండ పాపములు పోవునా
కన్నీరు కార్చకుండ కలుషములు కరుగునా (2)
అంతిమ యాత్రలో క్రీస్తేసే గమ్యమయా (2)
ఏకాంత బాటలో ప్రభు యేసే శరణమయా
బహు దూర బాటలో ప్రభు యేసే శరణమయా         ||నలుగకుండ||

English Lyrics

Audio

నా ప్రియ దేశం

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Telugu Lyrics


నా ప్రియ దేశం భారత దేశం
బైబిల్ లో రాయబడిన ధన్యమైన దేశం (2)
ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2)
ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా (2)

నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను
భారతీయుడనైనందుకు గర్విస్తాను (2)
సంతోష సౌభాగ్యం – సమృద్ధి సంక్షేమం
దేశంలో ఉండాలని ప్రార్ధిస్తాను (2)
ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2)

క్రైస్తవ్యం మతము కాదని మారుమనస్సని
జీవమునకు నడిపించునని వివరిస్తాను (2)
మతి మార్చు వాడు యేసని మత బోధకుండు కాదని
రక్షించే దేవుడని ప్రకటిస్తాను (2)
ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2)
ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా (2)

మనుషులంతా ఒక్కటేనని మంచి భావన
అందరిలో కలిగించుటకు శ్రమియిస్తాను (2)
కేవలము మాటలు కాక క్రియలందు మేలు చేయుచు
యేసయ్య అడుగులలో పయనిస్తాను (2)
ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) ||నా ప్రియ||

English Lyrics

Audio

యేసయ్య నామంలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2)        ||యేసయ్య||

పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)        ||యేసయ్య||

రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం
మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)        ||యేసయ్య||

దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామం
దుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)        ||యేసయ్య||

సృష్టిని శాసించగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం
మృతులను లేపగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం (2)        ||యేసయ్య||

పాతాళాన్ని తప్పించే – శక్తి కలిగినది యేసయ్య నామం
పరలోకానికి చేర్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)        ||యేసయ్య||

 

English Lyrics

Audio

పేద నరుని రూపము

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


పేద నరుని రూపము ధరించి
యేసు రాజు నీ చెంత నిలచె
అంగీకరించు-మాయనను (2)       ||పేద నరుని||

కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడెన్
ముళ్ల మకుటము శిరస్సున పెట్టబడెన్ (2)
నింద వేదన శ్రమలను సహించెనేసు
చిందే తనదు రక్తము నీ పాపముకై
దీనుడై నిన్ను పిలచుచుండె (2)       ||పేద నరుని||

తల వాల్చుటకు ఇల స్థలమే లేదు
దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు (2)
తన్ను ఆదరించు వారెవరు లేరు
ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే
పాట్లుపడే నిన్ను విడిపింపను (2)       ||పేద నరుని||

ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్
పాప డాగులన్ రక్తముతో కడిగెన్ (2)
నీ వ్యాధిని వేదన తొలగించ
నీ శాపము నుండి విడిపింప
సిలువలో విజయము పొందే (2)       ||పేద నరుని||

మాయ లోకమును నీవు నమ్మకుము
మనుష్యుల మనస్సు మారిపోవునిల (2)
నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు
నిశ్చయముగా ప్రభువులో ఆనందింప
నేడే రమ్ము విశ్వాసముతో (2)       ||పేద నరుని||

తామసించెదవేల ఓ ప్రియుడా
ప్రియ యేసుని యొద్దకు లేచి రమ్ము (2)
ఈ లోకము నీకివ్వని శాంతిని
ఈ దినమే ప్రభువు నీకొసగ
ప్రేమతో నిన్ను పిలచుచుండె (2)       ||పేద నరుని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME