ఆకాశ మహాకాశంబులు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఆకాశ మహా-కాశంబులు
పట్టని ఆశ్చర్యకరుడా (2)
కృప జూపి నిబంధనను
నెరవేర్చిన ఉపకారి (2)
కాపాడితివి నడిపితివి (2)
నీ యింటికి మమ్ములను (2)       ||ఆకాశ||

నీ దాసునికి నీ ప్రజలకు
నీ క్షమను కనుపరచు (2)
నీదు కల్వరి రక్తమున (2)
నీవే కడుగు కరుణామయా (2)       ||ఆకాశ||

నీతి న్యాయముల కర్త
ప్రీతి తోడ నీ ప్రజలకు (2)
నీతి న్యాయముల నిమ్ము (2)
స్తుతియింప నిరతంబు (2)       ||ఆకాశ||

రాజులనుగా యాజకులనుగా
మమ్ము చేసిన మహారాజ (2)
విజయమిమ్ము మా విజయుండా (2)
నిజమైన నీ ప్రజలకు (2)       ||ఆకాశ||

బలపరచు నీ భక్తులను
బలము తోడ ప్రవేశించి (2)
విలువైన నీ రక్షణను (2)
ధరింప చేయుము హల్లెలూయా (2)       ||ఆకాశ||

English Lyrics

Audio

Chords

ఆకాశ వాసులారా

పాట రచయిత:ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Lyricist: Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics

ఆకాశ వాసులారా
యెహోవాను స్తుతియించుడి (2)
ఉన్నత స్థలముల నివాసులారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)         ||ఆకాశ||

ఆయన దూతలారా మరియు
ఆయన సైన్యములారా (2)
సూర్య చంద్ర తారలారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)         ||ఆకాశ||

సమస్త భుజనులారా మరియు
జనముల అధిపతులారా (2)
వృద్దులు బాలురు, యవ్వనులారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)         ||ఆకాశ||

క్రీస్తుకు సాక్షులారా మరియు
రక్షణ సైనికులారా (2)
యేసు క్రీస్తు పావన నామం
ఘనముగ స్తుతియించుడి – హల్లేలూయ (2)         ||ఆకాశ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నా నీతి నీవే

పాట రచయిత: అనిల్ కుమార్
Lyricist: Anil Kumar

Telugu Lyrics


నా నీతి నీవే నా ఖ్యాతి నీవే
నా దైవమా యేసయ్యా
నా క్రియలు కాదు నీ కృపయే దేవా
నా ప్రాణమా యేసయ్యా
నదులంత తైలం విస్తార బలులు
నీకిచ్చినా చాలవయ్యా
నీ జీవితాన్నే నాకిచ్చినావు
నీకే నా జీవమయ్యా
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (4)       ||నా నీతి||

నా దీన స్థితిని గమనించి నీవు
దాసునిగ వచ్చావుగా
నా దోష శిక్ష భరియించి నీవు
నను నీలో దాచావుగా
ఏమంత ప్రేమ నా మీద నీకు
నీ ప్రాణమిచ్చావుగా
నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను
యజమానుడవు నీవేగా ||హల్లెలూయ||

నా ప్రియులే నన్ను వెలివేసినప్పుడు
నీవు చేరదీసావుగా
నా ప్రక్క నిలిచి నను ధైర్యపరచి
కన్నీరు తుడిచావుగా
నేనున్న నీకు భయమేలనంటూ
ఓదార్పునిచ్చావుగా
చాలయ్య దేవ నీ కృపయే నాకు
బ్రతుకంతయు పండుగా         ||హల్లెలూయ||

ఆ ఊభిలోనా నే చిక్కినప్పుడు
నీవు నన్ను చూసావుగా
నీ చేయి చాపి నను పైకి లేపి
నీ వాక్కునిచ్చావుగా
నా సంకటములు నా ఋణపు గిరులు
అన్నిటిని తీర్చావుగా
నీలోన నాకు నవ జీవమిచ్చి
నీ సాక్షిగా నిలిపావుగా        ||హల్లెలూయ||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

ఆనందము ప్రభు నాకొసగెను

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఆనందము ప్రభు నాకొసగెను
నా జీవితమే మారెను (2)
నా యుల్లమందు యేసు వచ్చెన్
నా జీవిత రాజాయెను (2)         ||ఆనందము||

ప్రభుని రుచించి ఎరిగితిని
ఎంతో ఎంతో ప్రేమాముర్తి (2)
విశ్వమంతట నే గాంచలేదు
విలువైన ప్రభు ప్రేమను (2)      ||ఆనందము||

సంతోషం సముద్రపు అలలన్ పోలి
పైకి ఉప్పొంగి ఎగయుచుండె (2)
నన్ను పిలిచి ఎన్నో మేలులు చేసే
నూతన జీవమొసగెన్ (2)       ||ఆనందము||

శత్రువున్ ఎదిరించి పోరాడెదన్
విజయము పొంద బలమొందెదన్ (2)
ప్రభువుతో లోకమున్ జయించెదన్
ఆయనతో జీవించెదన్ (2)    ||ఆనందము||

English Lyrics

Audio

ఆశీర్వాదంబుల్ మా మీద

పాట రచయిత: డేనియల్ డబ్ల్యూ విట్టల్
Lyricist: Daniel W Whittle

Telugu Lyrics

ఆశీర్వాదంబుల్ మా మీద
వర్షింపజేయు మీశ
ఆశతో నమ్మి యున్నాము
నీ సత్య వాగ్దత్తము

ఇమ్మాహి మీద
క్రుమ్మరించుము దేవా
క్రమ్మర ప్రేమ వర్షంబున్
గ్రుమ్మరించుము దేవా

ఓ దేవా పంపింపవయ్యా
నీ దీవెన ధారలన్
మా దాహమెల్లను బాపు
మాధుర్యమౌ వర్షమున్      || ఇమ్మాహి ||

మా మీద కురియించు మీశ
ప్రేమ ప్రవాహంబులన్
సమస్త దేశంబు మీద
క్షామంబు పోనట్లుగన్        || ఇమ్మాహి ||

ఈనాడే వర్షింపు మీశ
నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేడి
సన్నుతి బ్రౌర్ధింతుము     || ఇమ్మాహి ||

English Lyrics

Audio

Chords

ఓ యేసు నీ ప్రేమ

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2)      ||ఓ యేసు||

అగమ్య ఆనందమే హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి
ప్రతి ఉదయ సాయంత్రములు
స్తుతికి యోగ్యములు (2)                ||ఓ యేసు||

సంకట సమయములో సాగలేకున్నాను
దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా
వింటినంటివి నా మొర్రకు ముందే
తోడునుందునంటివి (2)                ||ఓ యేసు||

కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు
పచ్చిక బయలులో పరుండ జేయును
భోజన జలములతో తృప్తి పరచు
నాతో నుండునేసు (2)                ||ఓ యేసు||

దేవుని గృహములో సదా స్తుతించెదనూ
సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ
స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు
హల్లేలూయా ఆమేన్ (2)                ||ఓ యేసు||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

ఆకాశమందున్న ఆసీనుడా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కనులెత్తుచున్నాను
నేను నీ తట్టు కనులెత్తుచున్నాను        ||ఆకాశ||

దారి తప్పిన గొర్రెను నేను
దారి కానక తిరుగుచున్నాను (2)
కరుణించుమా యేసు కాపాడుమా        ||నీ తట్టు||

గాయపడిన గొర్రెను నేను
బాగు చేయుమా పరమ వైద్యుడా (2)
కరుణించుమా యేసు కాపాడుమా        ||నీ తట్టు||

పాప ఊభిలో పడియున్నాను
లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2)
కరుణించుమా యేసు కాపాడుమా        ||నీ తట్టు||

English Lyrics

Audio

HOME