కరిగే కొడుకు

పాట రచయిత: జాస్పర్ కునపో
Lyricist: Jasper Kunapo

Telugu Lyrics

అన్ని తెలిసిన తల్లి మరియమ్మా
నీ వెన్న మనసులో వేదన ఏందమ్మా
కరిగే కొడుకును కన్నది నువ్వమ్మా
నీ గుండెలో బరువును తీసేదెవరమ్మా
మది సిలువలో తనయుని పలుమార్లు తలచి
నిలువెల్ల వణికి నిదురంత పోయేనా..
పుట్టినరోజులు పండుగలేవమ్మా
ఈ కారణజన్ముడు కరుణామయుడమ్మా
గట్టిగ పట్టిన ఆపగ లేవమ్మా
గొల్గొతా గమనం తప్పదు ఓయమ్మ
అది మనకోసమేనమ్మా…        ||అన్ని తెలిసిన||

గొల్లలంతా కలిసి మెల మెల్లగ చేరిరి
తమ పిల్లన గ్రోవితో లాలిపాటను పాడిరి
తూరుపు దేశపు జ్ఞానుల మంటిరి
నింగి చుక్కను కనుగొని బహు చక్కగా చేరిరి
బంగారం సాంబ్రాణి అర్పించి రారాజు యాజకుడు అని యెంచి
మొకరించి బహుమతులిచ్చి ఆ మహిమంతా మనసుకు తెలిపి
బోళము నెందుకు తెచ్చిరి ఓ యమ్మ
ఆ మరణపు సూచిక కంటివా మరియమ్మా
బోరున వచ్చిన కన్నీరేదమ్మా నీ గుండెను గుచ్చిన తరుణం కదా అమ్మా
అది మనకోసమేనమ్మా…        ||అన్ని తెలిసిన||

ఎనిమిదో దినమున యెరూషలేము వచ్చి
పేరు యేసు అని పెట్టి ఎంతగానో మురిసిరి
సిమోయోను వచ్చెను ఆ శిశువును చూసేను
మహా సంబరపడుచు బహు నెమ్మది నొందెను
తన ఆత్మ నింపబడి ఎత్తుకుని – మన లోక రక్షణ కై ముద్దాడి
తన తనువు చాలింప తృప్తిపడి – ఆ మహిమంతా జనులకు తెలిపి
నీ హృదయములో ఖడ్గము దూరునని
ఆ సిలువలో త్యాగం నీకు నేర్పేనమ్మా
దీవెన నొందిన ధన్యత నీదమ్మా
ఆ మరణము గెలిచిన తనయుని తల్లివమ్మా
అది మనకోసమేనమ్మా…        ||అన్ని తెలిసిన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అన్నీ సాధ్యమే యేసుకు

పాట రచయిత: జే సీ కూచిపూడి
Lyricist: J C Kuchipudi

Telugu Lyrics

అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే (2)
అద్భుత శక్తిని నెరపుటకైనా
ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2)
ఆ యేసు రక్తానికి
సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2)           ||అన్నీ సాధ్యమే||

మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను
మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను (2)
మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెను
మరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను (2)           ||అన్నీ సాధ్యమే||

బండనే చీల్చగా – జలములే పొంగెను
ఎండిపోయిన భూమిపై – ఏరులై అవి పారెను (2)
బందంటే క్రీస్తేనని – నీ దండమే తానని
మెండైన తన కృపలో – నీకండగా నిలచును (2)           ||అన్నీ సాధ్యమే||

ఏకాంతముగా మోకరిల్లి – ప్రార్ధించుటే శ్రేయము
ఏల నాకీ శ్రమలని – పూర్ణ మనసుతో వేడుము (2)
యేసయ్య నీ వేదన – ఆలించి మన్నించును
ఏ పాటి వ్యధలైననూ – ఆ సిల్వలో తీర్చును (2)           ||అన్నీ సాధ్యమే||

కష్టాల కడలిలో – కన్నీటి లోయలో
కనికరమే ప్రభు చూపును – కంటిపాపలా కాయును (2)
కలిగించు విశ్వాసము – కాదేదీ అసాధ్యము
క్రీస్తేసు నామములో – కడగండ్లకే మోక్షము (2)           ||అన్నీ సాధ్యమే||

English Lyrics

Audio

అన్ని వేళల వినువాడు

పాట రచయిత: జి ఫీనెహాసు
Lyricist: G Phinehas

Telugu Lyrics

అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు
ఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు (2)
ప్రార్ధించుము అలయకనే
కనిపెట్టుము విశ్వాసముతో (2)
నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి
నీ ఎదలో కన్నీరు తుడచును       ||అన్ని||

కుమిలిపోతూ నలిగిపోతూ
ఏమౌతుందో అర్ధం కాక (2)
వేదన చెందుతూ నిరాశలో మునిగావా (2)
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2)     ||అన్ని||

ఎవరికీ చెప్పుకోలేక
అంతగా బాధ ఎందుకు (2)
మొఱ్ఱపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును (2)
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2)     ||అన్ని||

English Lyrics

Audio

అన్ని వేళల ఆరాధన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


అన్ని వేళల ఆరాధన
కన్న తండ్రి నీకే మహిమ (2)
అన్ని వేళల ఆరాధన
కన్న తండ్రి నీకే మహిమ (2)       ||అన్ని వేళల||

పరమందు సెరాపులు ఎగురుచున్నారు
పరిశుద్ధులు పరిశుద్ధుడని పొగడుచున్నారు (2)       ||అన్ని వేళల||

నింగి నేల నిన్ను గూర్చి పాడుచున్నది
సమస్తము మనసారా మ్రొక్కుచున్నది (2)       ||అన్ని వేళల||

ఘనమైన సంఘ వధువు కొనియాడుచున్నది
ఘనత ప్రభావము యేసునకే చెల్లించుచున్నది (2)       ||అన్ని వేళల||

English Lyrics

Audio

స్తుతులకు పాత్రుడా (అన్ని వేళలో)

పాట రచయిత: సి హెచ్ కుమార్ ప్రకాష్
Lyricist: Ch Kumar Prakash

Telugu Lyrics


స్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడా
మహిమ నాథుడా – యేసు నీకే వందనం (2)
అన్ని వేళలో ఎన్నో మేళ్లతో
మమ్ము బ్రోచిన యేసు నీకే వందనం (2)
వందనం వందనం యేసు నీకే వందనం (2)

నమ్మదగిన వాడా – యేసు నీకే వందనం
నీతిమంతుడా – యేసు నీకే వందనం (2)
ఆశ్రయ దుర్గమా – నా విమోచకా (2)         ||వందనం||

ప్రేమాపూర్ణుడా – యేసు నీకే వందనం
ప్రాణ నాథుడా – యేసు నీకే వందనం (2)
పాపరహితుడా – పావన నాథుడా (2)         ||వందనం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసు నీ వారము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు నీ వారము – నీవే మా రాజువు (2)
తల్లి తండ్రి గురువు దైవం – అన్నీ నీవేలే (2)      ||యేసు||

మా ప్రాణం మా గానం – మా సర్వం మా సకలం
అన్నీ నీవొసగినవే
మాదంతా నీకేలే – మహిమంతా నీకేలే
స్తుతి స్తోత్రముల్ నీకేలే (2)
సర్వంబు నీవైన ప్రభువా
హల్లెలూయ స్తుతి మహిమ నీకే (2)      ||యేసు||

ఈ భూమి ఈ గాలి – ఈ నేల ఈ నీరు
అన్నీ నీవొసగినవే
ఆకాశం ఆ తారల్ – ఆ ఇనుని ఆ చంద్రుని
మాకోసం నిలిపితివే (2)
ఆద్యంతముల ప్రభువా
ఆరాధింతుము నిన్నే (2)      ||యేసు||

సిలువలో మరణించి – మరణమునే ఓడించి
జయమును పొందితివే
పాపములు క్షమించి – జీవమును మాకిచ్చి
పరమును ఒసగితివే (2)
మమ్మెంతో ప్రేమించి
మా కొరకు నిలచితివే (2)      ||యేసు||

English Lyrics

Audio

 

 

అన్ని కాలంబుల

పాట రచయిత: బేతాళ జాన్
Lyricist: Bethaala John

Telugu Lyrics

అన్ని కాలంబుల – నున్న యెహోవా ని
నెన్నదరంబయో – కన్న తండ్రి
వన్నె కెక్కిన మోక్ష – వాసాళి సన్నుతు
లున్నతమై యుండ – మున్నె నీకు         ||అన్ని||

నిన్ను బ్రకటన సేయ – నిఖిల లోకములను
బన్నుగ జేసిన – బలుడ వీవె
ఉన్న లోకంబుల – నుడుగక కరుణా సం
పన్నతతో నేలు – ప్రభుడ వీవె
అన్ని జీవుల నెరిగి – యాహార మిచ్చుచు
నున్న సర్వజ్ఞుo – డవు నీవే
ఎన్న శక్యముగాక – ఉన్న లక్షణముల
సన్నుతించుటకు నే – జాలుదునా           ||అన్ని||

పుట్టింప నీవంచు – బోషింప నీవంచు
గిట్టింప నీవంచు – గీర్తింతును
నట్టి పనికి మాలి – నట్టి మానవుల చే
పట్టి రక్షింప బా – ధ్యుండ వంచు
దట్టమైన కృపను దరి జేర్చ నాకిచ్చి
పట్టయు నిలచియుండు – ప్రభుడ వంచు
గట్టడచే గడ – ముట్టుదనుక నా
పట్టుకొలది నిన్ను – బ్రస్తుతింతు           ||అన్ని||

కారుణ్య నిధి వీవు – కఠినాత్ముడను నేను
భూరి శుద్ధుడ వీవు – పాపి నేను
సార భాగ్యుడ వీవు – జగతిలో నాకన్న
దారిద్రుడే లేడు – తరచి చూడ
సార సద్గుణముల – సంపన్నుడవు నీవు
ఘోర దుర్గుణ సం – చారి, నేను
ఏ రీతి స్తుతియింతు – నే రీతి సేవింతు
నేర మెన్నక ప్రోవ – నెర నమ్మితి            ||అన్ని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME