అదిగదిగో ఒక యుద్ధం

పాట రచయిత:
Lyricist:

అదిగదిగో ఒక యుద్ధం
అరెరెరె ఆగేనే ఆ సైన్యం
ఆర్బాటించెను ఆ జైంటు
ఆయెను సౌలు సైన్యం ఫెయింటు

అడుగడుగో ఒక చిన్నోడు
అరె దైవిక రోషం ఉన్నోడు
చేతిలో వడిసెలు పట్టాడు
ఆ జైంటు పకపక నవ్వాడు
హహహహహహ

విసిరితె వడిసెల రాయి
కొట్టింది దేవుడేనోయి (2)
గొల్యాతాయెను జీరో
దావీదే ఇక హీరో (2)

అదిగదిగో ఒక యుద్ధం
అరెరెరె ఆగేనే ఆ సైన్యం

Download Lyrics as: PPT

నిశిరాత్రి

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics

నిశిరాత్రి సుడిగాలిలో చిక్కితిని
ఊపిరితో మిగిలెదనా ఉదయానికి
తడవు చేయక యేసు నను చేరుకో
నా ప్రక్కనే ఉండి నను పట్టుకో
భయముండగలదా నీవున్నచో
నీ కన్నులు నామీద నిలిచుండగా
నా చేయి నీ చేతిలో ఉండగా     ||నిశిరాత్రి||

ఈ చీకటి సమయం నిలిచెను నా ఈ పయనం
కనిపించక దారులు మొదలాయెను కలవరము
వీచే ఈ గాలులలో నే కొట్టుకుపోకుండా
తప్పించెదవని దేవా ఆశతో నే వేచితిని
నీవు గాక నాకిపుడు దిక్కెవ్వరు     ||నిశిరాత్రి||

నే చేసిన వాగ్ధానము లెన్నో ఉన్నాయి
నెరవేర్చు బాధ్యతలు ఇంకా మిగిలాయి
ఈ రేయి ఈ చోటే నేనాగి పోవలదు
రాతిరి గడిచేవరకు నీ చాటున నను దాచి
ఉదయమును చూపించుము నా కంటికి

అల్పము ఈ జీవితమని నేనెరిగితిని
కనురెప్పపాటున ఆవిరికాగలదు
అనుదినమిక నీ కృపనే నే కోరుచు
పయనింతును నా గురివైపు నిను ఆనుకుని
భయముండగలదా నీవున్నచో
నీ కన్నులు నామీద నిలిచుండగా
నా చేయి నీ చేతిలో ఉండగా

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యావే

పాట రచయిత: సామ్ పడింజరెకర
అనువదించినది:
ఫాన్ని జాయ్ మోసెస్
Lyricist: Sam Padinjarekara
Translator: Fannie Joy Moses

Telugu Lyrics

భయము లేదు దిగులే లేదు
నా జీవితమంతా ప్రభు చేతిలో
నిరాశ నన్నెన్నడు ముట్టలేదు
నిరీక్షణతో అనుదినం సాగెదను (2)

యావే నీవే నా దైవం – తరతరముల వరకు
యావే నీవే నా ఆశ్రయం – తరతరముల వరకు
నీవు కునుకవు నీవు నిదురపోవు
ఇశ్రాయేలున్ కాపాడువాడ(వు) (2)

మరణ భయం అంతా పోయెను
శత్రు భీతి అంతా తొలగించెను (2)
మరణమును ఓడించి
శత్రువును జయించిన
సర్వాధికారివి నా దేవా (2)      ||యావే||

ఓటమిని అంతా తీసివేసి
రోగాన్ని అంతా మాన్పివేసి (2)
జయశీలుడవు
పరమ వైద్యుడవు
సర్వశక్తుడవు నా రక్షకా (2)      ||యావే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఒక చేతిలో కర్ర

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఒక చేతిలో కర్ర
ఒక చేతిలో గొర్రె (2)

చేసేటి చేతులలోన
మేకులు నాటిరి నరులు (2)

కారింది నీదు రక్తం కాలువలై పారే
చిందింది నీదు రక్తం సిలువపై వ్రాలే        ||ఒక చేతిలో||

నడిచేటి కాళ్ళలలోన
మేకులు నాటిరి నరులు (2)      ||కారింది||

కిరీటంబు తెచ్చిరి
తలపైన పెట్టిరి (2)      ||కారింది||

సిలువను తెచ్చిరి
భుజం పైన పెట్టిరి (2)      ||కారింది||

బల్లెంబు తెచ్చిరి
ప్రక్కలోన పొడచిరి (2)      ||కారింది||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

కుమ్మరి చేతిలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

కుమ్మరి చేతిలో మంటి వలె
తల్లి ఒడిలో పసి బిడ్డ వలె (2)
అయ్యా నీ కృపతో నన్ను మార్చుము
యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము       ||కుమ్మరి||

నాలోని స్వయమును నలుగ గొట్టుము
నాలోని వంకరలు సక్కగా చేయుము (2)
నీ పోలిక వచ్చే వరకు
నా చేయి విడువకు (2)
సారె పైనుండి తీసివేయకు (2)      ||కుమ్మరి||

నాలోని అహమును పారద్రోలుము
నాలోని తొందరలు తీసి వేయుము (2)
నీ భుజముపై ఆనుకొనే
బిడ్డగా మార్చుము (2)
నీ చేతితో నడిపించుము (2)      ||కుమ్మరి||

English Lyrics

Audio

తుప్పు పట్టి పోవుటకంటే

పాట రచయిత: శైలన్న
Lyricist: Sailanna

Telugu Lyrics


తుప్పు పట్టి పోవుటకంటే (2)
కరిగిపోత యేసయ్య నీ చేతిలో
అరిగిపోత యేసయ్య నీ సేవలో (2) ||తుప్పు పట్టి||

సుఖమనుభవించుటకంటే (2)
శ్రమలనుభవిస్తాను నీ సేవలో
నిన్ను నేను సంతోషపెడత యేసయ్యా (2) ||తుప్పు పట్టి||

వెన్న లాగ కరుగుకుంట (2)
కటిక చీకట్ల దీపమైతానయ్యా
నీ చిత్తము జరిగిస్తా యేసయ్యా (2) ||తుప్పు పట్టి||

మూర్ఖమైన వక్ర జనం మధ్యల (2)
ముత్యమోలె నేనుండాలి యేసయ్యా
దివిటీ నయ్యి వెలుగుతుండాలే యేసయ్యా (2) ||తుప్పు పట్టి||

వెండి బంగారాల కన్నా
ధన ధాన్యముల కన్నా
నీ పొందు నాకు ధన్యకరము యేసయ్యా
నీతో ఉండుటే నాకు ఆనందం యేసయ్యా (2) ||తుప్పు పట్టి||

నాలో ఊపిరున్నంత వరకు (2)
ప్రకటిస్త యేసయ్య నీ ప్రేమను
కటిక చీకట్ల దీపమెలిగిస్తాను (2) ||తుప్పు పట్టి||

English Lyrics

Audio

నీ చేతిలో రొట్టెను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా (2)
విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా (2)       ||నీ చేతిలో||

తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును
ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి (2)           ||నీ చేతిలో||

అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు
ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి (2)           ||నీ చేతిలో||

హింసకుడు దూషకుడు హానికరుడైన
సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి (2)              ||నీ చేతిలో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME