ఉదయించినాడు

పాట రచయిత: వి జాషువా
Lyricist: V Joshua

Telugu Lyrics

ఉదయించినాడు నా జీవితాన
నా నీతిసూర్యుడు నా యేసయ్యా
నా నీతిసూర్యుడు నా యేసయ్యా (2)
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ
ఇష్టులైన వారికిల సమాధానము (2)         ||ఉదయించినాడు||

మతిలేని నా జీవితాన్ని – మరువలేదు నా మెస్సయ్యా (2)
మరియమ్మ గర్భాన జన్మించినాడు
మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా (2)
మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా         ||ఉదయించినాడు||

గురిలేని ఈ యాత్రలోన – గుర్తించి నన్ను పిలిచెను (2)
గుణవంతుడైన నా యేసయ్యనే
గురిగా నేను నిలుపుకుంటినే (2)
గురిగా నేను చేసుకుంటినే         ||ఉదయించినాడు||

కష్టాల కడగండ్లలోన కన్నీరు నే కార్చగా (2)
కడతేర్చుటకు కరుణామయునిగా
ఇలలో నాకై ఏతెంచెను (2)
ఇలలో నాకై ఏతెంచెను         ||ఉదయించినాడు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

విలువేలేని నా జీవితం

పాట రచయిత: వినోద్ కుమార్
Lyricist: Vinod Kumar

Telugu Lyrics


విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకు
నీ జీవితాన్నే ధారబోసితివే (2)

నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయా
ఎన్ని యుగాలైనా మారదు
ఎండిన ప్రతి మోడును – మరలా చిగురించును
నా దేవునికి సమస్తము సాధ్యమే (2)

పాపములో పడిన నన్ను
శాపములో మునిగిన నన్ను
నీ ప్రేమతో లేపితివే
రోగమే నన్ను చుట్టుకొనియుండగా
రోదనతో ఒంటరినైయుండగా
నా కన్నీటిని తుడిచితివే (2)        ||నీది||

పగలంతా మేఘ స్తంభమై
రాత్రంతా అగ్ని స్తంభమై
దినమంతయు రెక్కలతో కప్పితివే
స్నేహితులే నన్ను వదిలేసినా
బంధువులే భారమని తలచినా
నా కొరకే బలి అయితివే (2)        ||నీది||

సాధ్యమే సాధ్యమే సాధ్యమే
నా యేసుకు సమస్తము
సాధ్యమే సాధ్యమే సాధ్యమే
నా ప్రియునికి సమస్తము (2)

ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును
నా దేవునికి సమస్తము సాధ్యమే (2)          ||విలువేలేని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

దేవుడు నీకు తెలుసు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దేవుడు నీకు తెలుసు – నీవు దేవునికి తెలుసా
నీవు దేవుని నమ్మినా – నిన్ను దేవుడు నమ్మాలి (2)
అవసరాలకు దేవుని నమ్మక
ఆత్మకు తండ్రని నమ్మాలి (2)
నీ ఆత్మకు తండ్రని నమ్మాలి         ||దేవుడు||

నాలుగు గోడల మధ్య నీవు నలిగిపోక
నలు దిక్కులకు సువార్తను ప్రకటించు (2)
ప్రభువా ప్రభువని పిలువక – ప్రార్ధనతో విసిగించక
పాపిని రక్షించు పరలోకానికి నడిపించు
నా నిమిత్తము ఎవడు పోవునని అడుగుచున్నాడు దేవుడు
నా అవసరత తీర్చమని అడుగుచున్నాడు క్రైస్తవుడు          ||దేవుడు||

నామకార్ధ భక్తి దేవునికే అది విరక్తి
సువార్త భారం కలిగి నీవు బ్రతికితేనే ముక్తి (2)
ప్రజలందరికి ఇదే బైబిల్ సూక్తి (2)
దేవుని చేయి వెతకకుంటే అగ్నితోనే శాస్తి (2)
దేవునికిష్టమైనది తెలుసుకోవాలి ముందు
దేహానికిష్టమైనది అడగకూడదు ముందు         ||దేవుడు||

English Lyrics

Audio

ఆనందమానందమే

పాట రచయిత: జె దేవానంద్ కుమార్
Lyricist: J Devanand Kumar

Telugu Lyrics

ఆనందమానందమే
ఈ భువిలో యేసయ్య నీ జననము (2)
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికి మహిమ ప్రభావము
భూమి మీద తనకిష్టులకు
సమాధానము కలుగును గాక
హల్లెలూయా           ||ఆనంద||

తన ప్రజలను వారి పాపమునుండి రక్షించుట
కొరకై యేసు భువికి దిగి వచ్చెను
తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించుటకు
దేవుని జ్ఞానమై వచ్చెను          ||సర్వోన్నత||

మరణ ఛాయలు చీకటిలోను కూర్చున్నవారికి
యేసు అరుణోదయమిచ్చెను
పాప శాపము నుండి ప్రజలకు విడుదలనిచ్చుటకు
క్రీస్తు నర రూపము దాల్చెను       ||సర్వోన్నత||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దేవునికి భయపడవా

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics


దేవునికి భయపడవా మానవా
నీ దేవునికి భయపడవా మానవా (2)
పాపాన్ని విడువుమా – ప్రభు చెంత చేరుమా (2)
యేసయ్యను నీవు శరణు వేడుమా (2)       ||దేవునికి||

ఐగుప్తు మంత్రసానుల గమనించితివా
రాజాజ్ఞను సైతము అతిక్రమించిరి (2)
దేవునికి విధేయత చూపిరి
వంశాభివృద్ధిని పొందిరి (2)      ||దేవునికి||

నినెవె ప్రజలను గమనించితివా
దేవుని మాటకు లోబడినారు (2)
పాపమును విడిచి ఉపవాసముండి
ప్రార్థించి ప్రభు దీవెన పొందిరి (2)       ||దేవునికి||

English Lyrics

Audio

హల్లెలూయ స్తుతి మహిమ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)
ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

అల సైన్యములకు అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము (2)
అల సంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము (2)    ||హల్లెలూయ||

ఆకాశమునుండి మన్నాను పంపిన
దేవుని స్తుతించెదము (2)
బండనుండి మధుర జలమును పంపిన
ఆ యెహోవాను స్తుతించెదము (2)     ||హల్లెలూయ||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

దేవునికి స్తోత్రము గానము

పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Lyricist: Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics


దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది

యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
ఇశ్రయేలీయులను పోగుచేయువాడని                ||దేవునికి||

గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని        ||దేవునికి||

నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును
వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని           ||దేవునికి||

ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని         ||దేవునికి||

దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి               ||దేవునికి||

ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును
భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని              ||దేవునికి||

పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను
అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును  ||దేవునికి||

గుర్రముల నరులందలి బలము నానందించడు
కృప వేడు వారిలో సంతసించువాడని                ||దేవునికి||

యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని    ||దేవునికి||

పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్
మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును   ||దేవునికి||

భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే
వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును         ||దేవునికి||

వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని
ఏ జనముకీలాగున చేసియుండలేదని               ||దేవునికి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME