నీవే ఆశ నీవే శ్వాస

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నీవే ఆశ నీవే శ్వాస
నీవే ధ్యాస యేసువా
నీవే ప్రాణం నీవే గానం
నీవే ధ్యానం నేస్తమా
తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను (2)
నీ రూపులోనే నీ చేతి పనిగా – నను నీవు మలచితివే
నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై – నను సృజియించితివే          ||నీవే||

ఇహమున నా కొసగిన – ఈ ధర ఎంత భాగ్యమని
తలచితి నే భ్రమచితి – అంతయు నాకు సొంతమని
ఆశతో నేను పరుగెడితి ఇలలో చెలిమికై
ప్రతి హృదయం స్వార్ధమాయే
ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన
ఒక ప్రేమైన కాన రాదే           ||నీవే||

హృదయము పులకించెను – నీ ప్రేమ ప్రచించగానే
దృఢమాయె నా మదిలో – ఇక అంతయు వ్యర్థమని
నా జీవన గమనాన్ని నీ వైపు మలచి
నీ అడుగులలో నే నడచి
నీ ప్రియమైన ప్రేమగ ఇలలో జీవించి
నీ కౌగిలిలో ఒదుగుదునే            ||నీవే||

English Lyrics

Audio

క్షణమైన గడవదు

పాట రచయిత: జాషువా గరికి
Lyricist: Joshua Gariki

Telugu Lyrics


క్షణమైన గడవదు తండ్రి
నీ కృప లేకుండా – (2)
ఏ ప్రాణం నిలువదు ప్రభువా
నీ దయ లేకుండా – (2)
నీవే నా ప్రాణం – నీవే నా ధ్యానం
నీవే నా సర్వం – యేసు (2)       ||క్షణమైన||

ఇంత కాలం లోకంలో బ్రతికా
జీవితం అంతా వ్యర్థం చేసా
తెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్థమని
అనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని (2)        ||నీవే||

పనిలో ఉన్నా ఎందరిలో ఉన్నా
ఎక్కడ ఉన్నా నేనేమై యున్నా
నీవు నా చెంత ఉంటేనే నాకు చాలయ్యా
నీ రెక్కలే నాకు ఆశ్రయం నా యేసయ్యా (2)        ||నీవే||

జ్ఞానమున్నా పదవులెన్నున్నా
ధనము ఉన్నా సర్వం నాకున్నా
నీవు నాతో లేకుంటే అంతా శూన్యమేగా
పరలోక స్వాస్థ్యం ఎల్లప్పుడు శ్రేష్ఠమేగా (2)        ||నీవే||

English Lyrics

Audio

నీతోనే గడిపేయాలని

పాట రచయిత: ఈనాష్ కుమార్, పవన్
Lyricist: Enosh Kumar, Pavan

Telugu Lyrics

ప్రెయిస్ హిం ఇన్ ద మార్నింగ్
ప్రెయిస్ హిం ఇన్ ద నూన్
ప్రెయిస్ హిం ఇన్ ద ఈవినింగ్
ప్రెయిస్ హిం ఆల్ ద టైం

వేకువనే నా దేవుని ఆరాధింతును
ప్రతి సమయమున పరిశుద్ధుని కీర్తించెదను (2)
నా ధ్యానం నా సర్వం నా ప్రాణం నీవేగా అని
నా సమయం అనుక్షణము నీతోనే గడిపేయాలని (2)

నను నడిపించే దైవమా
నాతో నిలిచే కేడెమా (2)
ఉదయమున నీ కృపను స్తుతి గానాలతో కీర్తింతును
నీ కార్యముల చేత నన్ను
తృప్తి పరచి సంతోషమే         ||నా ప్రాణం||

నను కరుణించు బంధమా
నను బలపరచి ధైర్యమా (2)
కన్నీటి ప్రార్ధనతో నీ చెంత నే చేరెదన్
నిను విడచి క్షణమైనా
నే బ్రతకలేను ఇలలో        ||నా ప్రాణం||

English Lyrics

Audio

సిలువ ధ్యానం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నీ సిలువే నా శరణము (2)
విలువైన రుధిరాన్ని కార్చి
వెలపోసి నన్ను కొన్నావు (2)
ప్రేమా త్యాగం నీవే యేసయ్యా
మహిమా నీకే ఆరోపింతును

గాయాలు పొందినావు – వెలివేయబడినావు
నా శిక్ష నీవు పొంది – రక్షణను కనుపరచావు (2)
నీ ప్రేమ ఇంత అంతని – నే తెలుపలేను
నీ కృపను చాటెదన్ – నా జీవితాంతము

నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ – మోయలేక మోసావు
కొరడాలు చెళ్ళని చీల్చెనే – నీ సుందర దేహమునే (2)
తడిపెను నీ తనువునే రుధిరంబు ధారలే (2)
వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా (2)

సిలువలో ఆ సిలువలో – ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)

విలువే లేని నా బ్రతుకును – విలువ పెట్టి కొన్నావయ్యా (2)
నాదు పాపమంతయూ (2)
నీదు భుజముపై మోసావయ్యా (2)

గొల్గొతా కొండ పైన (2)
గాయాలు పొందితివే (3)

చెమటయు రక్తముగా – ఆత్మల వేదనయూ (2)
పొందెను యేసు నీ కొరకే
తండ్రీ నీ చిత్తం – సిద్ధించు గాక అని పలికెను (2)

కల్వారిలో జీవామిచ్చెన్ (2)
నీ పాపములను తొలగించుటకై
నీదు సిలువన్ మోసెను యేసు (2)

రగిలిందిలే ఒక జ్వాలలా – ప్రభు యేసు హృదయము
కరిగిందిలే ఒక ధారలా – పరమాత్మ రుధిరము
చలించిపోయెనే ఆ సిలువ ధాటికి (2)
కసాయి చేతిలో అల్లాడిపోయెనే (2)

రగిలిందిలే ఒక జ్వాలలా – ప్రభు యేసు హృదయము
కరిగిందిలే ఒక ధారలా – పరమాత్మ రుధిరము

కృపా సత్య దేవా – సిలువలో మాకై బలియై
రక్తము చిందించినావు – రక్షణిచ్చినావు (2)
ఆరాధింతుము నిన్ను యేసు – ఆత్మ సత్యముతో
పాడి కొనియాడి కీర్తింతుము
పూజించి ఘనపరతుము

హాల్లేలూయా హాల్లేలూయా (3)
నిన్నే ఆరాధింతుమ్ (3)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీవే నా ప్రాణం సర్వం

పాట రచయిత: డేవిడ్ విజయరాజు గొట్టిముక్కల, జోనా శామ్యూల్
Lyricist: David Vijayaraju Gottimukkala, Jonah Samuel

Telugu Lyrics


నీవే నా ప్రాణం సర్వం
నీవే నా ధ్యానం గానం
యేసయ్యా నీవే ఆధారం (2)
నీవేగా నా ప్రాణం – యేసయ్యా నీవే జీవితం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా..
హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2)          ||నీవే||

నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినది
నీ రాకకే కదా నేనెదురు చూచునది (2)
నీవలె ఉందును నీలో వసించెదను (2)
అండా దండా కొండా నీవయ్యా
నాకున్న లోకం అంతా నీవయ్యా
అండా దండా కొండా నీవయ్యా
నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా          ||నీవేగా||

నా కాపరి నీవే నా ఊపిరి నీవే
నా దారివి నీవే నా మాదిరి నీవే (2)
నీవలె ఉందును నీ వెంట సాగెదను (2)
అండా దండా కొండా నీవయ్యా
నాకున్న లోకం అంతా నీవయ్యా
అండా దండా కొండా నీవయ్యా
నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా         ||నీవేగా||

English Lyrics

Audio

యేసయ్యా నీ ప్రేమ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్యా నీ ప్రేమ – నా ధ్యానం
యేసయ్యా నీ మాట – నా దీపం
పసి ప్రాయముల నీదు ఒడిలో
నివసించెదను చిరకాలములు      ||యేసయ్యా||

గాలి వానలో వెలిగే దీపం ఆరదా?
ప్రయాణ చీకటిలో నీదు దీపం ఆరదు
నీ మాటలే నా జీవం
నీ వెలుగే నా ప్రాణం
నీ గానమే నా పాణం
నీ రూపమే నా దీపం        ||యేసయ్యా||

విశేష ఆరాధన గీతం నీకే నా ప్రభు
అపురూప భావాలతో రాగం నీకే అంకితం
నీ పరలోకం చూడాలని
నీ దర్శనం నే పొందాలని
నీ స్వరమే నే వినాలని
ఆశించెద ప్రతి క్షణము        ||యేసయ్యా||

English Lyrics

Audio

 

 

యెహోవ నా ఆశ్రయం

పాట రచయిత: డేవిడ్ ఎడిసన్ తేళ్ల
Lyricist: David Edison Thella

Telugu Lyrics


యెహోవ నా ఆశ్రయం
నా విమోచన దుర్గము (2)
నా ధ్యానం నా గానం
యెహోవ నా అతిశయం (2)      ||యెహోవ||

తన ఆలయాన నా మోర వినెను
భూమి కంపించేలా ఘర్జన చేసెను
మేఘాలు వంచి ఎగిరి వచ్చి
జలరాసులనుండి నన్ను లేపెను
ఆయనకు ఇష్టుడను – అందుకే నన్ను తప్పించెను
ఆయనలో నా స్వాస్థ్యము – ఎంత మహిమోన్నతమైనది
ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది (2)

హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4)     ||యెహోవ||

నా చేతి వేళ్ళకు సమరము నేర్పెను
నా గుండెకు శౌర్యము నేర్పెను
జయము నాకు జన్మ హక్కు
ఆత్మాభిషేకము నా అగ్ని స్వరము
శత్రువుల గుండెలలో – యేసు రక్తము సింహ స్వప్నము
ఏ యుద్ధ భూమైనాను – యేసు నామం సింహనాదం
ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది (2)

హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4)       ||యెహోవ||

English Lyrics

Audio

సర్వ యుగములలో సజీవుడవు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2)

ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2)
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా (2)       ||సర్వ యుగములలో||

స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2)
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా (2)       ||సర్వ యుగములలో||

కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2)
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా (2)       ||సర్వ యుగములలో||

English Lyrics

Audio

HOME