సుడిగాలైననూ

పాట రచయిత: సామర్థ్ శుక్లా, దీపికా కోటెచ, ఫిలేమోన్ ఆనంద్,
బెన్హర్ బిన్నీ, విశాల్ దాస్ జేష్ అబ్రహం, షెల్డన్ బంగెరా,
సామ్ అలెక్స్ పసుల, ఆనంద్ పాల్ & రేచెల్ ఫ్రాన్సిస్
అనువదించినది: ఎస్తేర్ తాటపూడి & విక్కీ
Lyricist: Samarth Shukla, Deepika Kotecha, Philemon Anand,
Benhur Binny, Vishal Das Jesh Abraham, Sheldon Bangera,
Sam Alex Pasula, Anand Paul & Rachel Francis
Translator: Esther Thatapudi & Vicky

Telugu Lyrics


సుడిగాలైననూ నిశ్చలముగ చేసెదవు
నీవే నా బలం నీవే నా నమ్మకం (2)
గడచిన కాలము నాతో ఉన్నావు
నేడు నా తోడు నడుచుచున్నావు
సదా నాతోనే ఉంటావు
ఎగసిపడే తుఫానుల్లో – నీవే ఆశ్రయ దుర్గము
ఎదురుపడే అలలెన్నైనా – అవి నీ పాదముల క్రిందనే (2)

వ్యాధి నను చుట్టినా
లెమ్మని సెలవిచ్చెదవు
యెహోవా రాఫా
నీవే నా స్వస్థత (2)       ॥గడచిన॥

ఓ వ్యాధి నీ శిరస్సు వొంగెనే
నాపై నీ అధికారం చెల్లదే
రూపింపబడిన ఏ ఆయుధం
నాకు విరోధముగా వర్ధిల్లదు (2)      ॥ఎగసిపడే॥

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యెహెూవాయే నా బలము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యెహెూవాయే నా బలము
యెహెూవాయే నా శైలము (2)
యెహెూవాయే నా కోటయు
యెహెూవాయే నా కేడెము
యెహెూవాయే నా శృంగము
యెహెూవాయే నా దుర్గము (2)       ||యెహెూవాయే||

నా దీపము ఆరనీయక నన్ను వెలిగించెను
నా అడుగులు తడబడకుండా నన్ను నడిపించెను (2)
నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను
నా పక్షమున తానేయుండి నన్ను గెలిపించెను (2)    ||యెహెూవాయే||

నాకు బలము అనుగ్రహించి నన్ను దృఢపరిచెను
నా శత్రువులకంటె నన్ను బహుగా తానే హెచ్చించెను (2)
నా జనులకు నాకు లోపరచి నన్ను ఘనపరచెను
నా ముందుగా తానే నడచి నన్ను బలపరచెను (2)    ||యెహెూవాయే||

English Lyrics

Audio

నాలో ఉన్న ఆనందం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నాలో ఉన్న ఆనందం
నాకున్న సంతోషం
నా జీవన ఆధారం నీవే కదా (2)        ||నాలో||

నా ఆశ్రయము నా దుర్గము
నా కోట నీవే యేసు
నా బలము… నా యేసుడే (2)

గాఢాంధకారములో నే సంచరించిననూ
ఏ అపాయమునకు నే భయపడను (2)
నీ దుడ్డు కర్రయు నీ దండమును
నన్నాదరించును నా యేసయ్యా (2)      ||నా ఆశ్రయము||

నే బ్రతుకు దినములలో కృపయు క్షేమమును
నన్నాదరించును నా వెంట వచ్చుఁను (2)
చిరకాలము నేను నీ మందిరావరణములో
నివాసము చేసెదను నా యేసయ్యా (2)      ||నా ఆశ్రయము||

English Lyrics

Audio

యెహోవ నా ఆశ్రయం

పాట రచయిత: డేవిడ్ ఎడిసన్ తేళ్ల
Lyricist: David Edison Thella

Telugu Lyrics


యెహోవ నా ఆశ్రయం
నా విమోచన దుర్గము (2)
నా ధ్యానం నా గానం
యెహోవ నా అతిశయం (2)      ||యెహోవ||

తన ఆలయాన నా మోర వినెను
భూమి కంపించేలా ఘర్జన చేసెను
మేఘాలు వంచి ఎగిరి వచ్చి
జలరాసులనుండి నన్ను లేపెను
ఆయనకు ఇష్టుడను – అందుకే నన్ను తప్పించెను
ఆయనలో నా స్వాస్థ్యము – ఎంత మహిమోన్నతమైనది
ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది (2)

హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4)     ||యెహోవ||

నా చేతి వేళ్ళకు సమరము నేర్పెను
నా గుండెకు శౌర్యము నేర్పెను
జయము నాకు జన్మ హక్కు
ఆత్మాభిషేకము నా అగ్ని స్వరము
శత్రువుల గుండెలలో – యేసు రక్తము సింహ స్వప్నము
ఏ యుద్ధ భూమైనాను – యేసు నామం సింహనాదం
ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది (2)

హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4)       ||యెహోవ||

English Lyrics

Audio

దేవుడే నాకాశ్రయంబు

పాట రచయిత: పంతగాని పరదేశి
Lyricist: Panthagani Paradeshi

Telugu Lyrics


దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము
మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ          ||దేవుడే||

పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను
సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్       ||అభయ||

దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును
ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు      ||అభయ||

రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన
పూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును       ||అభయ||

విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన
చెల్ల చెదర జేసి రిపుల – నెల్లద్రుంచు నాయనే           ||అభయ||

పిశాచి పూర్ణ బలము నాతో – బెనుగులాడ జడియును
నశించి శత్రు గణము దేవు – నాజ్ఞ వలన మడియును      ||అభయ||

కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగా
ఏటి కింక వెరవ వలయు – నెప్డు నాకు బండుగ         ||అభయ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసే నా ఆశ్రయము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసే నా ఆశ్రయము
యేసే నా ఆధారము
నా కోట నీవే… నా దుర్గము నీవే
నా కాపరి నీవే (2)

శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా
కష్టాల ఊభిలో కూరుకున్ననూ (2)
నన్ను లేవనెత్తును నన్ను బలపరచును
నాకు శక్తినిచ్చి నడిపించును (2)      ||యేసే నా||

జీవ నావలో తుఫాను చెలరేగినా
ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2)
నాకు తోడైయుండును నన్ను దరి చేర్చును
చుక్కాని అయి దారిచుపును (2)      ||యేసే నా||

దినమంతయు చీకటి అలుముకున్ననూ
బ్రతుకే భారమైన సంద్రమైననూ (2)
నాకు వెలుగిచ్చిను నన్ను వెలుగించును
నా నావలో నాతో నుండును (2)         ||యేసే నా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME