సదాకాలము నీ యందే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


(యేసయ్యా) సదాకాలము – నీ యందే నా గురి
నిలుపుచున్నాను (2)
అక్షయ కిరీటం పొందాలని
అనుక్షణం నే స్తుతియింతును (2)
ఆరాధనా ఆరాధనా
యేసయ్యా నీకే నా ఆరాధనా (2)       ||సదాకాలము||

చుక్కాని లేని నావనై
సంద్రాన నే చిక్కుబడగా (2)
నా దరి చేరి – ఈ ధరలోన
నీ దరి నడిపించావే (2)       ||ఆరాధనా||

అన్య జనులు ఏకమై
నిందలు నాపైన మోపినా (2)
నిందలు బాపి – నన్నాదుకొని
విడువని కృప చూపినావే (2)       ||ఆరాధనా||

నాశనకరమైన ఊభిలో
నేను పది కృంగగా (2)
హస్తము చాచి – నను ఆదుకొని
(నీ) ఆత్మతో బలపరచినావే (2)       ||ఆరాధనా||

English Lyrics

Audio

రక్షింపబడిన నీవు

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


రక్షింపబడిన నీవు – లోకాశలపైనే నీదు
గురి నిలిపి పయనిస్తున్నావా
రక్షకుని ఎరిగిన నీవు – తానెవరో తెలియదు నాకు
అన్నట్టు జీవిస్తున్నావా (2)
యేసే లేని నీ బ్రతుకులో
వెలుగే లేదని తెలుసుకో
యేసే లేని జీవితానికి
విలువే లేదని తెలుసుకో (2)        ||రక్షింపబడిన||

మంటితోనే నిను చేసినా
కంటి పాపగా కాపాడెనే
మాటి మాటికి పడిపోయినా
శాశ్వత ప్రేమతో ప్రేమించెనే (2)
ఆ ప్రేమను కాదని – అవసరమే లేదని
ఈ లోకం నాదని – ప్రభు మార్గం విడచితివా
యేసే లేనిదే – పరలోకానికి
ప్రవేశం లేదనే – పరమార్ధం మరచితివా      ||యేసే||

యేసులోనే నీ రక్షణ
యేసులోనే నిరీక్షణ
యేసులోనే క్షమాపణ
చేసుకో మరి ప్రక్షాళన (2)
ఎంతో ప్రేమను – నీపై చూపించెను
తన ప్రాణము సహితము – నీకై అర్పించెనుగా
ఇప్పటికైననూ – మార్చుకో మనస్సునూ
ప్రభువును చేరగా – వేగిరమే పరుగిడిరా       ||యేసే||

English Lyrics

Audio

పరుగెత్తెదా పరుగెత్తెదా

పాట రచయిత: ఫ్రెడ్డీ పాల్
Lyricist: Freddy Paul

Telugu Lyrics


పరుగెత్తెదా పరుగెత్తెదా
పిలుపుకు తగిన బహుమతికై
ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో
గురి యొద్దకే నేను పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా||

దైవ భయము కలిగి – శరీరేఛ్చలను విడిచి (2)
అక్షయ కిరీటము కొరకే – ఆశతో పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా||

ఆత్మాభిషేకము కలిగి – ఆత్మల భారముతో (2)
అతిశయ కిరీటము కొరకే – అలయక పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా||

యేసు వైపు చూచుచు – విశ్వాసము కాపాడుకొనుచు (2)
వాడబారని కిరీటముకే – వాంఛతో పరుగెత్తెదా (2)       ||పరుగెత్తెదా||

English Lyrics

Audio

పరవాసిని నే జగమున

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

పరవాసిని నే జగమున ప్రభువా (2)
నడచుచున్నాను నీ దారిన్
నా గురి నీవే నా ప్రభువా (2)
నీ దరినే జేరెదను
నేను.. నీ దరినే జేరెదను       ||పరవాసిని||

లోకమంతా నాదని యెంచి
బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2)
అంతయు మోసమేగా (2)
వ్యర్ధము సర్వమును
ఇలలో.. వ్యర్ధము సర్వమును      ||పరవాసిని||

ధన సంపదలు గౌరవములు
దహించిపోవు నీలోకమున (2)
పాపము నిండె జగములో (2)
శాపము చేకూర్చుకొనే
లోకము.. శాపము చేకూర్చుకొనే     ||పరవాసిని||

తెలుపుము నా అంతము నాకు
తెలుపుము నా ఆయువు యెంతో (2)
తెలుపుము ఎంత అల్పుడనో (2)
విరిగి నలిగియున్నాను
నేను.. విరిగి నలిగియున్నాను        ||పరవాసిని||

ఆ దినము ప్రభు గుర్తెరిగితిని
నీ రక్తముచే మార్చబడితిని (2)
క్షమాపణ పొందితివనగా (2)
మహానందము కలిగే
నాలో.. మహానందము కలిగే        ||పరవాసిని||

యాత్రికుడనై ఈ లోకములో
సిలువ మోయుచు సాగెదనిలలో (2)
అమూల్యమైన ధనముగా (2)
పొందితిని నేను
యేసునే.. పొందితిని నేను       ||పరవాసిని||

నా నేత్రములు మూయబడగా
నాదు యాత్ర ముగియునిలలో (2)
చేరుదున్ పరలోక దేశము (2)
నాదు గానము ఇదియే
నిత్యము.. నాదు గానము ఇదియే       ||పరవాసిని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

తోడు లేరని కుమిలిపోకు

పాట రచయిత: బాబన్న
Lyricist: Babanna

Telugu Lyrics


తోడు లేరని కుమిలిపోకు
యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2)
ఓహో సోదరా యేసే నీ గురి (2) ||తోడు||

ఆదరణ లేక అల్లాడిపోకు
శోధన వేదనలో కృంగిపోకు (2)
ఆదరించే వాడే యేసు
అల్లాడిపోకు ఓ సోదరా (2) |      |ఓహో సోదరా||

విడువడు యేసు ఎడబాయడెన్నడు
అనుక్షణము నిన్ను కాపాడును (2)
ఆయన మీదనే భారము మోపు
ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2)         ||ఓహో సోదరా||

English Lyrics

Audio

HOME