నీవు తప్ప నాకు ఇలలో

పాట రచయిత: ఫిలిప్ ప్రకాష్
Lyricist: Phillip Prakash

నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా
నీ ప్రేమ కన్నా సాటి భువిపై ఏదీ లేదయ్యా
నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా
నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా
నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా
గుండె నిండ నిండున్నావు ఓ నా యేసయ్యా      ||నీవు తప్ప||

కష్టాల చెరలో చిక్కుకున్న నన్ను
నీ ప్రేమ వరమే కురిపించినావు
ఈ లోకమంతా వెలివేస్తున్న
నీ ప్రేమ నాపై చూపించినావు
నీ అరచేతిలో నను దాచినావయ్యా
నా చేయి విడువక నను నడిపినావయ్యా
నా తోడై నా నీడై వెంటుంటే చాలయ్యా          ||నువ్వంటూ||

కన్నీటి అలలో మునిగిన నన్ను
నీ దివ్య కరమే అందించినావు
ఆ సిలువలోనే నీ ప్రాణమును
నను రక్షింప అర్పించినావు
నీ కృప నీడలో నను కాచినావయ్యా
ఒక క్షణము వీడక కాపాడినావయ్యా
నా శ్వాసై నా ధ్యాసై నువ్వుంటే చాలయ్యా          ||నువ్వంటూ||

Download Lyrics as: PPT

సాటి ఎవ్వరూ

పాట రచయిత: జోయెల్ ఎన్ బాబ్
Lyricist: Joel N Bob

Telugu Lyrics


సాటి ఎవ్వరూ లేరు ఇలలో
సమానులెవ్వరూ ఇహ పరములో (2)
యోగ్యత లేని నాపై దేవా
మితిలేని కృప చూపి
నిరాశే మిగిలిన ఈ జీవితంలో
నిరీక్షణనిచ్చావు        ||సాటి ఎవ్వరూ||

దేవా నా కరములనెత్తి
దేవా నిన్నే కీర్తించి
దేవా నిన్నారాధింతును (4)

పాప బానిస బ్రతుకు
ఆకర్షణ నిండిన లోకం
సర్వమనే భ్రమలోనే బ్రతికానే
నీ వాక్యముతో సంధించి
నా ఆత్మ నేత్రములు తెరచి
ప్రేమతో నన్నాకర్షించావే (2)

దేవా నా కరములనెత్తి
దేవా నిన్నే కీర్తించి
దేవా నిన్నారాధింతును (2)

మలినమైన మనసు
గమ్యంలేని పయనం
హృదయమే చీకటిమయమయ్యిందే
నీ రక్తముతో నను కడిగి
నాకు విడుదలను దయచేసి
వెలుగుతో నాకు మార్గం చూపావే (2)

దేవా నా కరములనెత్తి
దేవా నిన్నే కీర్తించి
దేవా నిన్నారాధింతును (2)        ||సాటి ఎవ్వరూ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నమ్మకు ఇలలో

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Telugu Lyrics


నమ్మకు ఇలలో ఎవరిని
సాయం చేస్తారనుకొని (2)
నమ్ముకో రక్షకుడేసుని (2)
కార్యం చూడు నిలుచొని (2)        ||నమ్మకు||

సహాయము చేస్తామని వస్తారు ఎందరో నీ చెంతకు
చేయూతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుర్లు నీకు
అక్కరలడ్డం పెట్టుకొని లాభం పొందుతుంటారు (2)
శవాలపై కాసులేరాలని కాచుకొని చూస్తుంటారు (2)        ||నమ్మకు||

నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమౌతారు వెనువెంటనే
మేముండగా నీకేమని వెన్నంటి ఉంటారు నీ ఇంటనే
నీకున్న అవసరతలన్ని వారిపై వేసుకుంటారు (2)
దోచుకొని నీ సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు (2)        ||నమ్మకు||

నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి
జవాబును చూపిస్తామని పేలుస్తు ఉంటారులే కుంపటి
సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు (2)
రహస్యాలను బయటేసి నిను అల్లరి చేస్తుంటారు (2)        ||నమ్మకు||

English Lyrics

Audio

ఇన్నేళ్లు ఇలలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము
చల్లని దేవుని నీడలో
గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం
సంతోషించు ఈ దినం          ||ఇన్నేళ్లు||

లోకమే నటనాలయం
జీవితమే రంగుల వలయం (2)
పరలోకమే మనకు శాశ్వతం
పరలోక దేవుని నిత్య జీవం
ప్రేమామయుడే ఆ పరమాత్ముడే
పదిలపరచెనే రక్షణ భాగ్యం      ||ఇన్నేళ్లు||

మారు మనస్సు మనిషికి మార్గం
పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2)
నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా
నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా
పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే
కరుణించునే కలకాలం           ||ఇన్నేళ్లు||

English Lyrics

Audio

నీతో స్నేహం చేయాలని

పాట రచయిత: అక్షయ ప్రవీణ్
Lyricist: Akshaya Praveen

Telugu Lyrics


నీతో స్నేహం చేయాలని
నీ సహవాసం కావాలని (2)
నీ లాగే నేను ఉండాలని
నిను పోలి ఇలలో నడవాలని (2)
యేసయ్యా… యేసయ్యా…
నీ స్నేహం నాకు కావాలయ్యా (2)     ||నీతో||

శాశ్వతమైన నీ కృపతో నింపి
నీ రక్షణ నాకు ఇచ్చావయ్యా (2)
ఏమివ్వగలను నీ కృపకు నేను
నన్ను నీకు అర్పింతును (2)
యేసయ్యా… యేసయ్యా…
నీ కృపయే నాకు చాలునయ్యా (2)

మధురమైన నీ ప్రేమతో నన్ను పిలచి
నీ సేవకై నన్ను ఏర్పరచుకున్నావా (2)
ఏమివ్వగలను నీ ప్రేమకు యేసు
నన్ను నీకు అర్పింతును (2)
యేసయ్యా… యేసయ్యా…
నీ ప్రేమే నాకు చాలునయ్యా (2)

బలమైన నీ ఆత్మతో నన్ను నింపి
నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)
ఏమివ్వగలను నీ కొరకు నేను
నన్ను నీకు అర్పింతును (2)
యేసయ్యా… యేసయ్యా…
నీ తోడే నాకు చాలునయ్యా (2)     ||నీతో||

English Lyrics

Audio

నీకు సాటి ఎవరు లేరు

పాట రచయిత: ఫిలిప్ గరికి
Lyricist: Philip Gariki

Telugu Lyrics


నీకు సాటి ఎవరు లేరు (యేసయ్యా)
ఇలలో నీవే ఏకైక దేవుడవు (2)
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
నీదు క్రియలు కొనియాడెదను (2)
అత్యున్నతుడా నా యేసయ్యా
నీవే నాకు నిజ రక్షకుడవు (2)         ||నీకు||

పరమందు దూతలు నిను పొగడుచుందురు
నీవే ప్రభువుల ప్రభువని (2)
నీ ఘన కీర్తిని వివరించగలనా
నా ప్రియుడా నా యేసయ్యా (2)        ||అత్యున్నతుడా||

ఆకాశమనాడు ఆసీనుడైనవాడా
నీ తట్టు కన్నులెత్తుచున్నాను (2)
ఊహించువాటి కంటే అత్యధికముగా
దయచేయువాడవు నీకే స్తోత్రం (2)        ||అత్యున్నతుడా||

English Lyrics

Audio

చిరు దివ్వెల వెలుగులతో

పాట రచయిత: జాషువా షేక్
Lyricist: Joshua Shaik

Telugu Lyrics


చిరు దివ్వెల వెలుగులతో
నీ దివ్య కాంతులతో
నను బ్రోవ రావయ్యా
కంటి పాపలా.. నను కాన రావయ్యా (2)
యేసయ్యా.. యేసయ్యా.. (2)
నను బ్రోవ రావయ్యా
నను కాన రావయ్యా (2)
ఆ లోయలో… క్రమ్మిన చీకటిలో
ఈ ఇలలో… నిరాశల వెల్లువలో (2)

దహించివేస్తున్న అవమానము
కరువైపోయిన సమాధానము (2)
పగిలిన హృదయము
కన్నీటి ధారల సంద్రము (2)
ఎగసి పడుతున్న కెరటము
కానరాని గమ్యము (2)         ||చిరు||

ఏకమైన ఈ లోకము
వేధిస్తున్న విరోధము
దూరమవుతున్న బంధము
తాళలేను ఈ నరకము (2)
ఈదలేని ప్రవాహము
చేరువైన అగాధము (4)           ||చిరు||

English Lyrics

Audio

మరువగలనా మరలా

పాట రచయిత: జోనా శామ్యూల్
Lyricist: Jonah Samuel

Telugu Lyrics


మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా
ఈలాంటి ప్రేమను కలిగినను
క్షమించు నింతటి నేరమును
జీవిత కాలమంతా – యేసు ధ్యానము చేసెదను

ఆశయు అక్కరయు పాపమై
చిక్కితి శత్రువు చేతులలో
మరణపు టంచున చేరితిని
ఇంతలోనే యేసు కరుణింప వచ్చి
క్షమియించి విడిపించెను
ఈలాంటి ప్రేమను కలిగినను
క్షమించు నింతటి నేరమును
నిందను పొందినను – ప్రభు చెంతకు చేరెదను

ఏ పాపికి కడు భాగ్యమే
యేసుని చేరగ ధన్యమే
యేసుని ప్రేమ అనంతమే
నీ పాపమంతా తొలగించి
యేసు ప్రేమించి దీవించును
నీ భారమంతయు భరియించును
కన్నీరు తుడిచి ఓదార్చును
శాశ్వత ప్రేమ చూపి – తన కౌగిట దాచుకొనున్

మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా
ఆ సిల్వ ప్రేమను చూపెదను
నా క్రీస్తు వార్తను చాటెదను
జీవిత కాలమంత – యేసు ధ్యానము చేసెదను

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దేవుని సముఖ జీవ కవిలెలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దేవుని సముఖ జీవ కవిలెలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే (2)
హత సాక్షుల కవిలెలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన (2)
విజయవీరుల కవిలెలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు (2)
సర్వోన్నతుని పురములలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

దేవుని సన్నిధి మహిమ ధననిధి – దాతను వేడి వరము పొందిన (2)
ప్రార్ధన వీరుల కవిలెలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

పరమునుండి ప్రభువు దిగగా – పరిశుద్ధులు పైకెగయునుగా (2)
పరిశుద్ధుల కవిలెలో (2)
నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆహా ఆనందమే

పాట రచయిత: మేరీ విజయ్ నన్నేటి
Lyricist: Mary Vijay Nanneti

Telugu Lyrics

ఆహా ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో (2)
ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో (2)       ||ఆహా||

యెషయా ప్రవచనము నేడు రుజువాయే
జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2)      ||ఆనందమే||

మీకా ప్రవచనము నేడు రుజువాయే
ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2)      ||ఆనందమే||

తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2)          ||ఆనందమే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME