దోషివా ప్రభూ

పాట రచయిత: జాషువా షేక్
Lyricist: Joshua Shaik

Telugu Lyrics


సర్వమానవ పాపపరిహారార్థమై
సిలువలో వ్రేలాడిన శ్రీ యేసునాధా – (2)

దోషివా…. ప్రభూ…. నువు దోషివా
నీ విధేయతకు నా అవిధేయతకు
మధ్యలో నలిగి, వ్రేలాడిన నిర్దోషివా (2)
దోషివా…. ప్రభూ…. నువు దోషివా

ఘోరంబుగా నే చేసిన నేరాలకు
నువు పొందిన మరణ శిక్ష
నే నడచిన వక్ర మార్గాలకు
నువు పొందిన సిలువ యాతన (2)
కలువరి గిరిలో ఆ ఘోర యాత్ర (2)
నే పొందిన రక్షణా పాత్ర (2)      ||దోషివా||

నే వేసిన తప్పటడుగులకు
నీవు కార్చిన రక్త పు మడుగులూ
నే చేసిన కపటంబులకు
నీవు పొందిన కొరడా దెబ్బలు (2)
సంపూర్ణ సిద్ది నొసగితివే నాకు (2)
ప్రేమించితివే నన్ను (2)      ||దోషివా||

తులువలలో ఓ తులువగా నున్న
నా పై నీ దయగల చూపు
పరలోకములో నీతో నుండ
భాగ్యంబును నాకు నిచ్చినదే (2)
తుది వరకు నీ దివ్య ప్రేమను పంచ (2)
నీ తుది శ్వాస వీడనంటివే (2)      ||దోషివా||

English Lyrics

Audio

చిందింది రక్తం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

చిందింది రక్తం ఆ సిలువ పైన
కారింది రుధిరం కలువరిలోన (2)
కరుణ చూప లేదే కసాయి మనుష్యులు
కనికరించలేదే మానవ లోకం (2)     ||చిందింది||

ఏదేనులో పుట్టిన ఆ పాపము
శాపముగా మారి మరణ పాత్రుని చేసె (2)
ఆ మరణమును తొలగించుటకు
మరణ పాత్రను చేబూనావా (2)
నా మరణమును తప్పించినావా        ||కరుణ||

చేసింది లోకం ఘోరమైన పాపం
మోపింది నేరం నీ భుజము పైనా (2)
యెరుషలేములో పారిన నీ రక్తము
ఈ లోక విమోచన క్రయధనము (2)
ఈ లోక విమోచన క్రయధనము        ||కరుణ||

నువ్వు చేసిన త్యాగం మరువలేని యాగం
మరణపు ముల్లును విరిచిన దేవుడా (2)
జీవకిరీటము నిచ్చుటకై
ముళ్ళ కిరీటము ధరించితివా (2)
నాకు నిత్య జీవమిచ్చితివా       ||కరుణ||

English Lyrics

Audio

సమానులెవరు ప్రభో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సమానులెవరు ప్రభో
నీ సమానులెవరు ప్రభో (2)
సమానులెవరు ప్రభో
సమస్త మానవ శ్రమాను భవమును (2)
సహించి వహించి ప్రేమించగల (నీ) (2)       ||సమానులెవరో||

సమాన తత్వము – సహోదరత్వము (2)
సమంజసము గాను మాకు దెలుప (నీ) (2)       ||సమానులెవరో||

పరార్ధమై భవ – శరీర మొసగిన (2)
పరోపకారా నరావ తారా (నీ) (2)       ||సమానులెవరో||

దయా హృదయ యీ – దురాత్మ లెల్లరున్ (2)
నయాన భయాన దయాన బ్రోవ (నీ) (2)       ||సమానులెవరో||

ఓ పావనాత్ముడ – ఓ పుణ్య శీలుడ (2)
పాపాత్ములను బ్రోవ – పరమాత్మ సుత (నీ) (2)       ||సమానులెవరో||

English Lyrics

Audio

కలువరి గిరి సిలువలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


కలువరి గిరి సిలువలో పలు శ్రమలు పొందిన దైవమా (2)
విశ్వ మానవ శాంతి కోసం ప్రాణమిచ్చిన జీవమా (2)
యేసు దేవా నీదు త్యాగం వివరింప తరమా (2)         ||కలువరి||

కరుణ లేని కఠిన లోకం కక్షతో సిలువేసినా (2)
కరుణ చిందు మోముపైన గేలితో ఉమ్మేసినా (2)
ముళ్ళతోన మకుటమల్లి
నీదు శిరమున నుంచినా – (2)         ||కలువరి||

జాలి లేని పాప లోకం కలువలేదో చేసినా (2)
మరణమందు సిలువలోన రుధిరమే నిను ముంచినా (2)
కలుష రహిత వ్యధను చెంది
అలసి సొలసి పోతివా – (2)         ||కలువరి||

English Lyrics

Audio

HOME