యెహోవా నిస్సీ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ
యెహోవా నిస్సీ – అనుచు పాడెదం
మా ధ్వజము విజయ ధ్వజమే (2)
యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ (2)          ||యెహోవా||

ప్రభువే ముందు నిలిచి యుద్ధం చేయును
కలత చెంద కారణమే లేదుగా
సడలకుండ కరముల కాధారమై
శక్తి గల యేసు ఆత్మ నిలుపును (2)
సర్వ సైన్య అధిపతి ప్రభువే (2)          ||యెహోవా||

మనయందున్నట్టి బలము చాలును
నాధుడేసు సెలవిచ్చెను పోదము
ఆయుధములు భుజబలమవసరమా
పరమ దేవునాత్మ మనలో నుండగా (2)
మనము దైవ సైన్యమేగదా (2)          ||యెహోవా||

హల్లెలూయ స్త్రోత్తమే మన ఆయుధం
యేసు నామ శక్తే సామర్ధ్యము
యేసు రాక వరకే పోరాటము
జయము పొందుటే జీవిత ధ్యేయము (2)
సిలువే మన జయ పతాకము (2)          ||యెహోవా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

రాజ్యాలనేలే మహారాజు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రాజ్యాలనేలే మహారాజు
రాజుగా నిన్ను చూడాలని (2)
సింహాసనాన్ని విడిచి ఇలలో
సామాన్యునిగా అరుదెంచెన్ (2)
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)

పావనమాయెను ఈ ధరణి నీ – దివ్య పాదాలు మోపగనే
పాపపు సంకెళ్లు తెగిపోయే అతి – పరిశుద్ధుడు అరుదెంచగనే (2)
చీకటినంత పారద్రోల
పావనుడా పవళించావు
ప్రతి హృదయాన్ని వెలుగుతో నింప
నీతి సూర్యుడా ఉదయించావు          ||హ్యాప్పీ||

తారను చూసిన జ్ఞానులు – చేరిరి ప్రభుని చెంతకు
బంగారము సాంబ్రాణి బోళమును – అర్పించిరి భయ భక్తులతో (2)
గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలు
పరవిశించిరి నీ రాకతో
ఆనందమాయెను ఈ జగమంతా
రక్షకుడా నీ జన్మతో          ||హ్యాప్పీ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీ ప్రేమ ఎంతో మధురం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా
నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2)            ||నీ ప్రేమ||

రాతి గుండెలే మారును
నీ మాట సెలవిస్తే (2)
రమణీయము నీ మాటలే
వెదజల్లును సుమగంధమే (2)           ||యేసయ్యా||

వ్యాధి బాధలే పోవును
నీ మాట సెలవిస్తే (2)
బలమైనది నీ మాటయే
తొలగించును కారు చీకటులే (2)           ||యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

కంటి పాపను

పాట రచయిత: మని ప్రకాష్
Lyricist: Mani Prakash

Telugu Lyrics

కంటి పాపను కాయు రెప్పలా
నను కాచెడి యేసయ్యా
చంటి పాపను సాకు అమ్మలా
దాచెడి మా అయ్యా
నీవేగా నీడగా తోడుగా
నీతోనే నేనునూ జీవింతు
నీకన్నా మిన్నగా ఎవరయ్యా
నాకు నీవే చాలయ్యా      ||కంటి||

మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు
దీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ
ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ         ||కంటి||

ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావు
నిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను మాపై కురిపించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ
ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ        ||కంటి||

English Lyrics

Audio

Chords

మార్పులేని తండ్రివి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మార్పులేని తండ్రివి నీవే
చేయి వీడని స్నేహితుడవు నీవే (2)
వాక్యమై నను నడిపించే
ఆత్మయై నను ఓదార్చే (2)
యెహోవా రఫా యెహోవా యీరే
యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ
యెహోవా షమ్మా ఎలోహిం యావే

ఆకాశము భూమియు
గతియించినా గతియించనీ (2)
మారని నీ వాక్యమే
నను నడుపును సదా
మారని నీ మాటలే
నను నిలుపును సదా       ||యెహోవా||

వాగ్ధానము నెరవేర్చుచు
నా రక్షణకరుడైతివి (2)
తండ్రి అని పిలిచినా
పలికెడి ప్రేమా (2)       ||యెహోవా||

English Lyrics

Audio

HOME