ఇదిగో నేనొక నూతన క్రియను

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను (2)
ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా (2)       ||ఇదిగో||

అడవిలో త్రోవనుజేసి – ఎడారిలో నదులను నేను (2)
ఎల్లప్పుడు సమృద్ధిగా – ప్రవహింప జేసెదను (2)       ||ఇదిగో||

నాదు ప్రజలు త్రాగుటకు – నేనరణ్యములో నదులు (2)
సమృద్ధిగా పారునట్లు – సృష్టించెదను నేను (2)       ||ఇదిగో||

అరణ్యములో జంతువులు – క్రూరపక్షులు సర్పములు (2)
ఘనపరచును స్తుతియించును – దీని నాలోచించుడి (2)       ||ఇదిగో||

నూతన సృష్టిగ నినుజేసి – నీ శాంతిని నదివలెజేసి (2)
ననుజూచి మహిమపరచి – స్తుతిబాడ జేసెదను (2)       ||ఇదిగో||

నేనే దేవుడనని దెలసి – నా కార్యములను నెరవేర్చి (2)
ముందున్న వాటికన్న – ఘనకార్యములను జేతున్ (2)       ||ఇదిగో||

మరుగైన మన్నానిచ్చి – మరితెల్లని రాతినిచ్చి (2)
చెక్కెదనా రాతిమీద – నొక క్రొత్త నామమును (2)       ||ఇదిగో||

పరలోక భాగ్యంబులు – నరలోకములో మనకొసగెన్ (2)
కరుణాసంపన్నుడగు – మన ప్రభువునకు హల్లెలూయ (2)       ||ఇదిగో||

Download Lyrics as: PPT

స్తోత్రించెదము

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో (2)
నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము (2)

యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు (2)
సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ (2)

భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి (2)
బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్ (2)     ||యేసు||

కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు (2)
తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము (2)     ||యేసు||

తల్లిదండ్రియు యెడబాసినను – విడువక కాయును (2)
ఎల్లప్పుడు నేను భజియించెదను – వల్లభుడేసు ప్రభున్ (2)     ||యేసు||

ఆత్మీయ పోరాటమునకు ప్రభువు – ఆత్మశక్తినిచ్చెన్ (2)
స్తుతియు నీకే ఘనతయు నీకే – యుగయుగములలోన (2)     ||యేసు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నూతన హృదయము

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics

నూతన హృదయము నూతన స్వభావము
నూతన ప్రారంభం నాకు దయచేయుము
చెదరిన బ్రతుకును పగిలిన గుండెను
నలిగిన మనస్సును నూతన పరచుము
యేసు నీవే నన్ను సృజియించిన వాడవు
నా బలహీనతలన్ని యెరిగియున్నావు
రాతి గుండెను నాలో తీసివేయుము
అతి మెత్తని హృదయము దయచేయుము         ||నూతన హృదయము||

జీవమును వదులుకుని వెలుపలకు నే పారిపోతిని
పాపములో భోగమును ఆశించి నే మోసపోతిని
నా దేహం నా హృదయం వ్యసనముతోనే నిండిపోయెను
హీనముగా దిగజారి ఘోరముగా నే కృంగిపోతిని
నిన్ను విడచి నే క్షణమైనా బ్రతుకలేక
వెనుతిరిగి నీ చెంతకు వచ్చుచున్నాను
శుద్ధజలమును నాపై వెదజల్లుము
హిమము కంటెను తెల్లగా కడిగివేయుము         ||నూతన హృదయము||

నా పాపం అపరాధం నానుండి దూరము చేయుదువు అని
నా భయము అవమానం బిడియమును తొలగించి వేతువని
నా గతము జ్ఞాపకము నీ మదిలో ఇక దాచుకోవు అని
నిన్నెరిగి ధైర్యముగా నీ ముందు నే నిలబడియున్నాను
నీ శరణు కోరువారిని త్రోసివేయవు
కృపగల మహాదేవ నన్ను మన్నించుము
సదా కృతజ్ఞత స్తుతులు నీకే అర్పింతును
సర్వ మహిమ ప్రభావము నీకే చెల్లును         ||నూతన హృదయము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నూతన సంవత్సరములో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నూతన సంవత్సరములో
యేసు.. నూతన పరచుము నన్ను
నూతన జీవమిచ్చి
నూతన కృపనిమ్మయా (2)
ఆనందమే సంతోషమే
యేసయ్యలో నాకు సంబరమే (2)     ||నూతన||

పాపమంత మన్నించయ్యా
పరిశుద్ధ మనసు నాకు ఇమ్మయ్యా (2)
ప్రభు నీతో నడుచుటకు
నీ సన్నిధిలో ఉండుటకు (2)     ||నూతన||

వాక్యముతో కడుగుమయా
పరిశుద్ధ ఆత్మను నాకిమ్మయ్యా (2)
ప్రభు నీతో నడుచుటకు
నీ సన్నిధిలో ఉండుటకు (2)     ||నూతన||

సత్యముతో నింపుమయా
నీ సాక్షిగ నేనుండుటకు (2)
ప్రభు నీతో నడుచుటకు
నీ సన్నిధిలో ఉండుటకు (2)     ||నూతన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆశతో నీ కొరకు

పాట రచయిత: అబ్రహాం
Lyricist: Abraham

Telugu Lyrics

ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా .
నూతన బలముతో నను నింపినావు (2)
బలహీనులను బలపరచువాడా
కృంగిన వారిని లేవనెత్తువాడా (2)
యేసయ్యా నా ఆశ్రయమా
యేసయ్యా నీకే ఆరాధన (2)         ||ఆశతో||

సొమ్మసిల్లక అడుగులు తడబడక
నడిచెద నీ వెంట జీవితమంతా (2)
లోకము నన్ను ఆకర్షించినా
వెనుదిరుగక నేను సాగెద నీ వెంట (2)     ||యేసయ్యా||

అలయక నేను పరుగెత్తెదను
అంతము వరకు ఆత్మల రక్షణకై (2)
సిద్ధము చేసిన బహుమానముకై
గురియొద్దకే నేను సాగెదనయ్యా (2)     ||యేసయ్యా||

రెక్కలు చాపి పక్షి రాజువలెనే
పైకెగెరెద నీ పరిశుద్ధులతో (2)
పరవశించెదను నీ ముఖమును చూచి
ప్రణమిల్లెద నీ పాదముల చెంత (2)     ||యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

భూపునాది మునుపే

పాట రచయిత: జార్జ్ సాంబత్తిని
Lyricist: George Sambathini

Telugu Lyrics


భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే
ఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలు
కొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడే
ఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులు
నూతనాకాశము.. నూతన లోకము…
నూతనెరుషలేము వచ్చును
దేవుడే మనతో.. గుడారమై యుండును…
మనమంతా మరలా పాడెదము     ||భూపునాది||

జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమే
నిత్యము మనలో ఉందును (2)
తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడు
మనతో ఏకమై యుండును     ||భూపునాది||

వేదన బాధయు – కన్నీరు దుఃఖము
ఇంకెక్కడా ఉండే ఉండవు (2)
సూర్య చంద్రులు – వెలుగును ఇవ్వవు
దేవుడే వెలుగై యుండును      ||భూపునాది||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఈ దినమెంతో శుభ దినము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఈ దినమెంతో శుభ దినము
నూతన జీవితం అతి మధురం
ఆగదు కాలం మన కోసం
గతించిపోయెను చెడు కాలం
వచ్చినది వసంత కాలం     ||ఈ దినమెంతో||

నీ హృదయం ఆశలమయము
కావాలి అది ప్రేమ నిండిన మందిరము (2)
యేసుని కొరకై తెరచిన హృదయం
ఆలయం అది దేవుని నిలయం       ||ఈ దినమెంతో||

జీవితమే దేవుని వరము
తెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2)
నూతన జీవము నింపుకొని
నిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం      ||ఈ దినమెంతో||

English Lyrics

Audio

ఈ దినం క్రీస్తు జన్మ దినం

పాట రచయిత: కృపాదాస్ కొల్లాటి
Lyricist: Krupadas Kollati

Telugu Lyrics

ఈ దినం క్రీస్తు జన్మ దినం
శుభకరం లోక కళ్యాణం
పరమును విడచి ఇలకు చేరిన
మహిమ అవతారం (2)
ఆడుము పాడుము ప్రభుని నామము
నూతన గీతముతో
రక్షణ పొందుము ఈ సమయము
నూతన హృదయముతో (2)        ||ఈ దినం||

దేవ దూతలు పలికిన ప్రవచనం
జ్ఞానులకొసగిన దివ్య మార్గం (2)
ధన్యత కలిగిన దావీదు పురము
కన్య మరియకు ప్రసవ తరుణం        ||ఆడుము||

పాప దుఃఖములన్నియు పారద్రోలును
కృపయు క్షేమము కలుగజేయును (2)
రక్షణ నొసగెడి పరమ సుతునికి
ఇమ్మానుయేలని నామకరణము         ||ఈ దినం||

English Lyrics

Audio

నూతన సంవత్సరం

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


నూతన సంవత్సరం దయచేసిన దేవా
నీకే స్తోత్రములు అద్వితీయ ప్రభువా (2)
ఆశ్చర్యకరుడవు ఆది సంభూతుడవు (2)
అద్భుతకరుడవు అల్ఫా ఓమెగవు (2)         ||నూతన ||

పాపాంధకారమునకు బానిసనై యున్నప్పుడు
శాపముతో నేను హీనుడనై యున్నప్పుడు
చేతులు చాచి నన్ను లేవనెత్తిన దేవా
ప్రేమతో పిలిచి నన్ను ఆదరించిన ప్రభువా
నీ ప్రేమ పిలుపుకు నే ఘనుడనైతిని
నీ స్పర్శ తాకిడికి ఆత్మ పూర్ణుడైతిని          ||నూతన||

కడవరి దినాలలో కంట నీరు పెడుతుండగా
కష్టాలతో నేను సతమతమౌతుండగా
నీ వాక్య వెలుగులో నడిపించిన నా ప్రభువా
ఏ దిక్కు లేని నాకు దారి చూపిన తండ్రి
నీ జాలి హృదయమునకు దాసుడ నేనైతిని
నీ వాక్య జ్ఞానమునకు పరిచారకుడనైతిని          ||నూతన||

English Lyrics

Audio

తొలకరి వాన

పాట రచయిత: ఫిలిప్ & షారోన్
Lyricist: Philip & Sharon

Telugu Lyrics


తొలకరి వాన దీవెనలు కురిపించు వాన
పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2)
అది నూతన పరచును ఫలియింపచేయును
సమృద్ధినిచ్చును సంతోషపరచును (2)        ||తొలకరి||

ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును
జీవజలముతో నింపి జీవింపచేయును (2)
ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును (2)            ||అది నూతన||

సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించును
పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును (2)
యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును (2)            ||అది నూతన||

English Lyrics

Audio

HOME