దేవా పరలోక దుతాలి

పాట రచయిత: అంశుమతి మేరీ
Lyricist: Amshumathi Mary

Telugu Lyrics


దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
నిన్ను భజియించి పూజించి ఆరాధింప
నీకే నీకే మహిమ (2)
దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
ఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
మహిమా నీకే మహిమా – (4)          ||దేవా||

కష్టాలలోన నష్టాలలోన
కన్నీరు తుడిచింది నీవే కదా (2)
నా జీవితాంతం నీ నామ స్మరణే
చేసేద నా యేసయ్యా (2)        ||మహిమా||

నా కొండ నీవే నా కోట నీవే
నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే (2)
నిన్నే భజించి నిన్నే స్తుతించి
ఆరాధింతునయా (2)        ||మహిమా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసయ్యా నా ప్రాణనాథా నిను

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


యేసయ్యా నా ప్రాణనాథా నిను
ఆడి పాడి కీర్తించెదను
నీవే నా జీవదాత అని
లోకమంతా చాటించెదను           ||యేసయ్యా||

సర్వశక్తిమంతుడా సర్వాధికారి
సర్వలోకమును సృష్టించిన సుందరుడా (2)
స్తుతి మహిమా ఘనతా నీకే అని
సంతసించి స్తోత్రించెదను           ||యేసయ్యా||

పాపమే ఎరుగని నీతిమంతుడా
పాపిని రక్షించిన నీతిసూర్యుడా (2)
పరిశుద్ధ పరలోక తండ్రి అని
పరవశించి నే పాడెదను           ||యేసయ్యా||

ఆది అంతమైన అల్ఫా ఒమేగా
మేఘముపై రానున్న మహిమోన్నతుడా (2)
ఉన్నవాడవు అనువాడవు నీవని
ఉల్లసించి ఆరాధింతును           ||యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

స్తోత్రబలి అర్పించెదము

పాట రచయిత: ఎస్ జె బెర్క్మన్స్
Lyricist: S J Berchmans

Telugu Lyrics

స్తోత్రబలి అర్పించెదము
మంచి యేసు మేలు చేసెన్ (2)
చేసెను మేలులెన్నో
పాడి పాడి పొగడెదన్ (2)
తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం (2)

ప్రాణమిచ్చి నను ప్రేమించి
పాపం తొలగించి కడిగితివే (2)
నీ కొరకు బ్రతుక వేరుపరచి
సేవ చేయ కృప ఇచ్చితివే (2)           ||తండ్రీ||

గొప్ప స్వరముతో మొరపెట్టి
సిలువ రక్తమును కార్చితివే (2)
రక్త కోటలో కాచుకొని
శత్రు రాకుండ కాచితివే (2)           ||తండ్రీ||

చూచే కన్నులు ఇచ్చితివి
పాడే పెదవులు ఇచ్చితివి (2)
కష్టించే చేతులు ఇచ్చితివి
పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి (2) ||తండ్రీ||

మంచి ఇల్లును ఇచ్చావయ్యా
వసతులన్నియు ఇచ్చావయ్యా (2)
కష్టించి పనిచేయ కృప చూపి
అప్పు లేకుండ చేసితివే (2)           ||తండ్రీ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

స్తుతికి పాత్రుడ యేసయ్యా

పాట రచయిత: ఫిలిప్ గరికి
Lyricist: Philip Gariki

Telugu Lyrics


స్తుతికి పాత్రుడ యేసయ్యా
నా స్వాస్థ్య భాగము నీవయ్యా (2)
పూర్ణ హృదయముతో పాడి కొనియాడెద (2)
నీవే నా రక్షణ – నీవే నా స్వస్థత
నీవే నా విడుదల (2)    ||స్తుతికి||

పాప ఊభిలో నుండి – పైకి లేపితివి
మరణ ఛాయను తొలగించి – కరుణ చూపితివి (2)
నీ వైపే చూస్తూ – నీతోనే నడుస్తూ
నీ వెనకే చేరెద యేసూ (2)       ||నీవే||

జీవాహారము నీవే – జీవ జలము నీవే
నీదు నామమే శక్తి – లేదు ఇలలో సాటి (2)
ప్రతి మోకాలొంగును – ప్రతి నాలుక ఒప్పును
యేసు రాజా నీ యెదుట (2)       ||నీవే||

English Lyrics

Audio

ప్రార్ధన విన్నావయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ప్రార్ధన విన్నావయ్యా – విజయం నిచ్చావయ్యా (2)
తొట్రిల్ల నియ్యలేదు – తోడుండి నడిపించావు (2)
పొగడెద పాటపాడి – పెనుతుఫానాగిపోయె
పరవశించి పాడెదా (2)
తండ్రి దేవా మంచివాడా – నిరంతరం గొప్పవాడా (2)
నిరంతరం గొప్పవాడా (2)

కన్నీరు చూసావయ్యా – కరం పట్టి నడిపావయ్యా (2)
విన్నపం విన్నావయ్యా – విడుదల నిచ్చావయ్యా (2)      ||పొగడెద||

ఎబినేజర్ నీవేనయ్యా – సహాయం చేసావయ్యా (2)
ఎల్రోయి నీవేనయ్యా – నన్నిల చూసావయ్యా (2)      ||పొగడెద||

నిన్నే నమ్ముకొనెదన్ – నీపై ఆనుకొనెదన్ (2)
శాంతి నొసగువాడా – నీ సన్నిధి చాలునయ్యా (2)      ||పొగడెద||

English Lyrics

Audio

ప్రేమించు దేవుడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు
పాలించు దేవుడు – యేసు దేవుడు
పాటలు పాడి ఆనందించెదం
ఆహా ఎంతో ఆనందమే (2)       ||ప్రేమించు||

తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు
ప్రతి అవసరమును తీర్చు దేవుడు (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు
తోడు నీడగా నన్ను కాపాడును (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు
సర్వ కాలమందు జయమిచ్చును (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు
అంతము వరకు చేయి విడువడు (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

నీ పాదం మ్రొక్కెదన్

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి
నిన్ను పాడి కీర్తించెదను
యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది (2)

పరిశుద్ధమైన పరవశమే
పరమ యేసుని కృపా వరమే (2)
వెదకి నన్ను కనుగొంటివి (2)
పాడుటకు పాటనిచ్చితివి (2)      ||నీ పాదం||

నూతన నూనె ప్రభావముతో
నూతన కవిత్వపు కృపతోను (2)
నింపి నిత్యము నడిపితివి (2)
నూతన షాలేము చేర్చేడవు (2)      ||నీ పాదం||

ఇరుకు నందు పిలచితివి
నాకు సహాయము చేసితివి (2)
చెడి ఎక్కడ తిరుగకుండా (2)
చేరవచ్చి నన్ను ఆడుకొంటివి (2)      ||నీ పాదం||

నిత్యముగ నీ సన్నిధి
నాకు ఇచ్చును విశ్రాంతిని (2)
దుడ్డు కర్ర నీ దండమును (2)
నిజముగ నన్ను ఆదరించును (2)      ||నీ పాదం||

ఫలించు చెట్టు నీవు నిలచు
తీగగా నేను వ్యాపించుటకై (2)
కొమ్మ నరికి కలుపు తీసి (2)
కాపాడి శుద్దీకరించితివి (2)      ||నీ పాదం||

పరిశుద్ధమైన కీర్తితోను
ప్రకాశమైన శిఖరముపై (2)
శీఘ్రముగ చేర్చెదవు (2)
సీయోనులో నిన్ను కీర్తించెదన్ (2)      ||నీ పాదం||

English Lyrics

Audio

HOME