పదివేలలో అతిసుందరుడా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

పదివేలలో అతిసుందరుడా
నిన్ను నే ఆరాధింతున్
సూర్యచంద్రులకన్న తేజోమయుడా
నిత్యము ఆరాధింతున్
నిన్ను నే ఆరాధింతున్
నిత్యము ఆరాధింతున్

ఏ యోగ్యతాలేని నన్నూ నీవూ – యోగ్యునిగా మార్చితివే
ఏ ఆధారంలేని నాకై నీవూ – ఆధారణను తప్పించితివే
నన్ను ప్రేమించి రక్షించితివే
నీ కృపను చూపించితివే
నిన్ను నే ఆరాధింతున్
నిత్యము ఆరాధింతున్

ఈ లోకపు సృష్టి యేసను నామమును – ఘనపరచి కీర్తింతునే
తన న్యాయపీఠమెదుట – ప్రతి మోకాలు తప్పక వంగునే
పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఆరాధనకు పాత్రుడా
యోగ్యుడా యోగ్యుడా పూజకు అర్హుడా
నిన్ను నే ఆరాధింతున్
నిత్యము ఆరాధింతున్

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దేవా మహోన్నతుడా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దేవా మహోన్నతుడా
మహిమా ప్రకాశితుడా (2)
పదివేలలో అతి సుందరుడా
కీర్తింతు మనసారా (2)         ||దేవా||

వెలిసావు భువిలో మెస్సయ్యగా
ఎడారి బ్రతుకులో సెలయేరుగా (2)
నిస్సారమైన నా జీవితములో
చిగురించె ఆనందము (2)          ||దేవా||

లేచాను ఒంటరి విశ్వాసినై
వెదికాను నీ దారి అన్వేషినై (2)
నీ దివ్య మార్గము దర్శించినా
ఫలియించె నా జన్మము (2)        ||దేవా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దవలవర్ణుడా

పాట రచయిత: ప్రవీణ్ కుమార్
Lyricist: Praveen Kumar

Telugu Lyrics


దవలవర్ణుడా రత్నవర్ణుడా
పదివేలలో అతిప్రియుడా
అతి కాంక్షనీయుడా (2)
ఎందుకయ్యా మాపై ప్రేమ
ఎందుకయ్యా మాపై కరుణ (2)

ఘోర పాపినైన నన్ను
లోకమంతా వెలివేసినా
అనాథగా ఉన్న నన్ను
ఆప్తులంతా దూషించగా (2)
నీ ప్రేమ నన్నాదుకొని
నీ కరుణ నన్నోదార్చెను (2)

గాయములతో ఉన్న నన్ను
స్నేహితులే గాయపరచగా
రక్తములో ఉన్న నన్ను
బంధువులే వెలివేసినా (2)
నీ రక్తములో నను కడిగి
నీ స్వారూపము నాకిచ్చితివా (2)

అర్హత లేని నన్ను నీవు
అర్హునిగా చేసితివి
నీ మహిమలో నిలబెట్టుటకు
నిర్దోషిగా చేసితివి (2)
నీ సేవలో నను వాడుకొని
నీ నిత్య రాజ్యము చేర్చితివి (2)        ||దవలవర్ణుడా||

English Lyrics

Audio

పదివేలలో అతిసుందరుడా (మనోహరుడా)

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

పదివేలలో అతిసుందరుడా
మనోహరుడా మహిమోన్నతుడా (2)
నీ నామం అతి మధురం
నీ త్యాగం మహానీయం (2)

తల్లిదండ్రుల కన్నను
బంధు మిత్రుల కన్నను (2)
ప్రేమించి నాకై నిలచే
స్నేహితుడా ప్రాణ నాథుడా (2)        ||పదివేలలో||

నీ కొరకే యేసు నీ కొరకే (3)
నా కరములెత్తెదను
మోకరించి నా శిరము వంచి
నా కరములెత్తెద నీ కొరకే (2)
పరిశుద్ధ ఆత్మ రమ్ము (2)
నను యేసు పాదము చెంత చేర్చుము
పరిశుద్ధ ఆత్మ రమ్ము              ||నీ కొరకే||

English Lyrics

Audio

 

పదివేలలో అతిప్రియుడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

పదివేలలో అతిప్రియుడు
సమీపించరాని తేజోనివాసుడు
ఆ మోము వర్ణించలేము
స్తుతుల సింహాసనాసీనుడు
నా ప్రభు యేసు (4)

ఏ బేధము లేదు ఆ చూపులో
ఏ కపటము లేదు ఆ ప్రేమలో (2)
జీవితములను వెలిగించే స్వరం
కన్నీరు తుడిచే ఆ హస్తము (2)
అంధకారంలో కాంతి దీపం
కష్టాలలో ప్రియనేస్తం (2)
నా ప్రభు యేసు (2)         ||పదివేలలో||

దొంగలతో కలిపి సిలువేసినా
మోమున ఉమ్మి వేసినా (2)
తాను స్వస్థతపరచిన ఆ చేతులే
తన తనవును కొరడాలతో దున్నినా (2)
ఆ చూపులో ఎంతో ప్రేమ
ప్రేమామూర్తి అతనెవరో తెలుసా (2)
నా ప్రభు యేసు (2)          ||పదివేలలో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME