కమనీయమైన

పాట రచయిత: జాషువా షేక్
Lyricist: Joshua Shaik

Telugu Lyrics

కమనీయమైన నీ ప్రేమలోన
నే నిలువనా నా యేసయ్యా

కమనీయమైన నీ ప్రేమలోన
నే నిలువనా నా యేసయ్యా
(తీయ) తీయని నీ పలుకలలోన
నే కరిగిపోనా నా యేసయ్యా (2)
నా హృదిలో కొలువైన నిన్నే
సేవించనా/సేవించెదా నా యేసయ్యా (2)

విస్తారమైన ఘన కీర్తి కన్నా
కోరదగినది నీ నామం
జుంటె తేనె ధారల కన్నా
మధురమైనది నీ నామం (2)
సమర్పణతో నీ సన్నిధిని చేరి
నిత్యము నిన్నే ఆరాధించనా (2)         ||కమనీయమైన||

వేసారిపోయిన నా బ్రతుకులో
వెలుగైన నిన్నే కొనియాడనా (2)
కన్నీటితో నీ పాదములు కడిగి
మనసారా నిన్నే పూజించనా (2)
నీ కృపలో గతమును వీడి
మరలా నీలో చిగురించనా (2)         ||కమనీయమైన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నిను చేరగ నా మది

పాట రచయిత: శామ్యూల్ కర్మోజి
Lyricist: Samuel Karmoji

Telugu Lyrics


నిను చేరగ నా మది ధన్యమైనది
నిను తలచి నా హృదయం నీలో చేరినది (2)
నీవలె పోలి నే జీవింతును
నీ కొరకై నా ప్రాణం అర్పింతును (2)
నీతోనే నా ప్రాణం – నీతోనే నా సర్వం (2)
నది లోతులో మునిగిన ఈ జీవితమును
తీరం చేర్చావు – నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావు
ఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా – (2)       ||నిను చేరగ||

English Lyrics

Audio

నీ కొరకు నా ప్రాణం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది
నీ కొరకు నా కనులు ఎదురు చూచుచున్నవి (2)
హృదయమంత వేదనతో నిండియున్నది
ఆదరణే లేక ఒంటరైనది (2)
దేవా నా కన్నీరు తుడువుము
హత్తుకొని నన్ను ముద్దాడుము (2)

పాపం చేసి నీకు దూరమయ్యాను
నన్ను గన్న ప్రేమని విడిచి నేను వెళ్లాను (2)
నీ మాటలను మీరి లోకాన్ని చేరాను
పాపాన్ని ప్రేమించి హీనుడనయ్యాను (2)       ||దేవా||

నీ హృదయ వేదనకు కారణమైనాను
దోషిగా నీ యెదుట నే నిలిచియున్నాను (2)
నను మన్నించుమా నా తండ్రి (2)

English Lyrics

Audio

నీవే ఆశ నీవే శ్వాస

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నీవే ఆశ నీవే శ్వాస
నీవే ధ్యాస యేసువా
నీవే ప్రాణం నీవే గానం
నీవే ధ్యానం నేస్తమా
తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను (2)
నీ రూపులోనే నీ చేతి పనిగా – నను నీవు మలచితివే
నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై – నను సృజియించితివే          ||నీవే||

ఇహమున నా కొసగిన – ఈ ధర ఎంత భాగ్యమని
తలచితి నే భ్రమచితి – అంతయు నాకు సొంతమని
ఆశతో నేను పరుగెడితి ఇలలో చెలిమికై
ప్రతి హృదయం స్వార్ధమాయే
ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన
ఒక ప్రేమైన కాన రాదే           ||నీవే||

హృదయము పులకించెను – నీ ప్రేమ ప్రచించగానే
దృఢమాయె నా మదిలో – ఇక అంతయు వ్యర్థమని
నా జీవన గమనాన్ని నీ వైపు మలచి
నీ అడుగులలో నే నడచి
నీ ప్రియమైన ప్రేమగ ఇలలో జీవించి
నీ కౌగిలిలో ఒదుగుదునే            ||నీవే||

English Lyrics

Audio

క్షణమైన గడవదు

పాట రచయిత: జాషువా గరికి
Lyricist: Joshua Gariki

Telugu Lyrics


క్షణమైన గడవదు తండ్రి
నీ కృప లేకుండా – (2)
ఏ ప్రాణం నిలువదు ప్రభువా
నీ దయ లేకుండా – (2)
నీవే నా ప్రాణం – నీవే నా ధ్యానం
నీవే నా సర్వం – యేసు (2)       ||క్షణమైన||

ఇంత కాలం లోకంలో బ్రతికా
జీవితం అంతా వ్యర్థం చేసా
తెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్థమని
అనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని (2)        ||నీవే||

పనిలో ఉన్నా ఎందరిలో ఉన్నా
ఎక్కడ ఉన్నా నేనేమై యున్నా
నీవు నా చెంత ఉంటేనే నాకు చాలయ్యా
నీ రెక్కలే నాకు ఆశ్రయం నా యేసయ్యా (2)        ||నీవే||

జ్ఞానమున్నా పదవులెన్నున్నా
ధనము ఉన్నా సర్వం నాకున్నా
నీవు నాతో లేకుంటే అంతా శూన్యమేగా
పరలోక స్వాస్థ్యం ఎల్లప్పుడు శ్రేష్ఠమేగా (2)        ||నీవే||

English Lyrics

Audio

నీతోనే గడిపేయాలని

పాట రచయిత: ఈనాష్ కుమార్, పవన్
Lyricist: Enosh Kumar, Pavan

Telugu Lyrics

ప్రెయిస్ హిం ఇన్ ద మార్నింగ్
ప్రెయిస్ హిం ఇన్ ద నూన్
ప్రెయిస్ హిం ఇన్ ద ఈవినింగ్
ప్రెయిస్ హిం ఆల్ ద టైం

వేకువనే నా దేవుని ఆరాధింతును
ప్రతి సమయమున పరిశుద్ధుని కీర్తించెదను (2)
నా ధ్యానం నా సర్వం నా ప్రాణం నీవేగా అని
నా సమయం అనుక్షణము నీతోనే గడిపేయాలని (2)

నను నడిపించే దైవమా
నాతో నిలిచే కేడెమా (2)
ఉదయమున నీ కృపను స్తుతి గానాలతో కీర్తింతును
నీ కార్యముల చేత నన్ను
తృప్తి పరచి సంతోషమే         ||నా ప్రాణం||

నను కరుణించు బంధమా
నను బలపరచి ధైర్యమా (2)
కన్నీటి ప్రార్ధనతో నీ చెంత నే చేరెదన్
నిను విడచి క్షణమైనా
నే బ్రతకలేను ఇలలో        ||నా ప్రాణం||

English Lyrics

Audio

యేసయ్యా ప్రాణ నాథా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్యా ప్రాణ నాథా – ఎంతో మంచోడివయ్యా
సిలువలో ప్రాణం పెట్టినావయ్యా
రక్తమిచ్చి కొన్నావయ్యా యేసయ్యా
నన్ను.. రక్తమిచ్చి కొన్నావయ్యా యేసయ్యా

మరణాంధకారములో పడియున్న వేళ
ఉదయించినావు ఓ నీతి సూర్యుడా (2)
కురిసింది కల్వరి ప్రేమ నీ రుధిర ధారలై (2)
నిను వీడి క్షణమైనా నే బ్రతుకలేను (2)          ||యేసయ్యా||

మరణ పాశాలన్ని ఛేదించినావు
ప్రేమ పాశాలతో దీవించినావు (2)
నీ ప్రేమ బానిసగా నను చేసుకున్నావు (2)
మోడైన నా బ్రతుకు చిగురింపజేశావు (2)          ||యేసయ్యా||

మృతిని గెల్చి లేచావు మహిమను దాల్చావు
ఈ మట్టి దేహాన్ని మహిమతో నింపావు (2)
నా సృష్టికర్తవు నా క్రీస్తు నీవు (2)
రానున్న రారాజు నీ వధువు నేను (2)          ||యేసయ్యా||

English Lyrics

Audio

నీవే నా ప్రాణం సర్వం

పాట రచయిత: డేవిడ్ విజయరాజు గొట్టిముక్కల, జోనా శామ్యూల్
Lyricist: David Vijayaraju Gottimukkala, Jonah Samuel

Telugu Lyrics


నీవే నా ప్రాణం సర్వం
నీవే నా ధ్యానం గానం
యేసయ్యా నీవే ఆధారం (2)
నీవేగా నా ప్రాణం – యేసయ్యా నీవే జీవితం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా..
హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2)          ||నీవే||

నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినది
నీ రాకకే కదా నేనెదురు చూచునది (2)
నీవలె ఉందును నీలో వసించెదను (2)
అండా దండా కొండా నీవయ్యా
నాకున్న లోకం అంతా నీవయ్యా
అండా దండా కొండా నీవయ్యా
నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా          ||నీవేగా||

నా కాపరి నీవే నా ఊపిరి నీవే
నా దారివి నీవే నా మాదిరి నీవే (2)
నీవలె ఉందును నీ వెంట సాగెదను (2)
అండా దండా కొండా నీవయ్యా
నాకున్న లోకం అంతా నీవయ్యా
అండా దండా కొండా నీవయ్యా
నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా         ||నీవేగా||

English Lyrics

Audio

నాలో ఉన్న ఆశలన్నియు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నాలో ఉన్న ఆశలన్నియు
నాలో ఉన్న ఊహలన్నియు
నాలో ఉన్న ప్రాణమంతయు – నీవే యేసయ్యా (2)
యేసయ్యా నీవే నా మార్గం
యేసయ్యా నీవే నా సత్యం
యేసయ్యా నీవే నా జీవం
నీవే నా ప్రాణం

నాకున్నవన్ని నీకే యేసయ్యా
నాలోన నిన్ను దాచానేసయ్యా (2)
నీ చేతులలో నా రూపమునే ముద్రించితివి
నా పాపముల కొరకై నీవు బలి అయిపోతివి (2)
పరిశుద్ధమైన రక్తము ద్వారా
పాపాలన్ని కడిగివేసితివి        ||యేసయ్యా||

నా కోసమే ఈ భువికి వచ్చితివి
నా కోసమే నీ ప్రాణం ఇచ్చితివి (2)
నా హృదయములో నీ వాక్యమునే నే ఉంచితిని
నీ రాకకై నేను వేచి ఉంటిని (2)
పరిశుద్ధమైన నీ చేతులలో
నీ రూపములో నన్ను చేసితివి         ||యేసయ్యా||

English Lyrics

Audio

మనిషిగా పుట్టినోడు

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: AR Stevenson

Telugu Lyrics


మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా
మరల మంటిలో కలవవలయురా
తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా
ఇల సంపాదన వదలవలయురా (2)
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో
ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో (2)

ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలి
ఆరిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి (2)
క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు
స్వర్గానికి ఆయనతో వారసులౌతారు (2)        ||మనిషిగా||

జన్మనిచ్చినవాడు యేసు క్రీస్తు దేవుడే
జన్మించకముందే నిన్నెరిగిన నాథుడే (2)
ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే
నీ జన్మకు నిజమైన అర్ధముందిలే (2)        ||మనిషిగా||

నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు
చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు (2)
నీలోని ఆత్మకు స్వర్గమో నరకమో
నిర్ణయించు సమయమిదే కళ్ళు తెరుచుకో (2)        ||మనిషిగా||

English Lyrics

Audio

HOME