ప్రభుని రాకడ

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ప్రభుని రాకడ – ఈ దినమే
పరుగులిడి రండి – సుదినమే (2)
పరమునందుండి – మన ప్రభువు
ధరకు నరుగును – పాలనకై (2)
బూరశబ్దముతో – జనులారా       ||ప్రభుని||

సిద్ధులగు వారిన్ – మన యేసు
శుద్ధి జేయునిలన్ – పరమునకై (2)
బుద్ధిహీనులను – శ్రమలచేత
బద్ధులుగ జేయున్ – వేదనతో (2)
బాధ కలిగించున్ – సాతాను       ||ప్రభుని||

స్వరముతో వచ్చున్ – అధికారి
మహిమతో మరలున్ – తన దూత (2)
సూర్యచంద్రునిలన్ – తారలతో
జీకటుల్ క్రమ్మున్ – ప్రభు రాక (2)
పగలు రాత్రియగున్ – త్వరపడుము       ||ప్రభుని||

మొదట లేతురు – సజీవులై
ప్రభునియందుండు – ఆ మృతులు (2)
మరల అందరము – ఆ ధ్వనితో
పరము జేరుదుము – ధరనుండి (2)
ధన్యులగుదుము – పరికించు       ||ప్రభుని||

వెయ్యియేండ్లు – పాలించెదరు
ప్రియుని రాజ్యమున – ప్రియులు (2)
సాయం సమయమున – చేరి
నెమలి కోకిలలు – రాజున్ (2)
పాడి స్తుతించును – ఆ దినము       ||ప్రభుని||

గొర్రె మేకలును – ఆ చిరుత
సింహజాతులును – ఒక చోట (2)
భేధము లేక – బరుండి
గరిక మేయును – ఆ వేళ (2)
కలసి మెలగును – భయపడక       ||ప్రభుని||

న్యాయ నీతులన్ – మన ప్రభువు
ఖాయముగ దెల్పున్ – ఆనాడు (2)
సాక్షులుగ నిలుతుం – అందరము
స్వామియేసునకు – ధ్వజమెత్తి (2)
చాటి యేసునకు – ఓ ప్రియుడా       ||ప్రభుని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

క్రీస్తేసు ప్రభువు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి
కొన్నట్టి సంఘమున
ఎవరు చేరెదరో వారే ధన్యులు
పరలోకము వారిది (2)      ||క్రీస్తేసు||

అపొస్తలుల బోధను నమ్మి
స్థిరపరచబడిన వారే (2)
ఆత్మ శక్తితో వారు ఎల్లప్పుడు
సంఘములో నిలిచెదరు (2)      ||క్రీస్తేసు||

పరిశుద్ధులతో సహవాసమును
ఎవరు కలిగియుందురో (2)
వారే పొందెదరు క్షేమాభివృద్ధి
క్రీస్తేసు ప్రభువు నందు (2)      ||క్రీస్తేసు||

ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారే
తన యందు నిలిచెదరు (2)
ప్రకటించెదరు ఆయన మరణ
పునరుత్తానమును వారు (2)      ||క్రీస్తేసు||

పట్టు వదలక సంఘముతో కూడి
ఎవరు ప్రార్ధించెదరో (2)
ప్రార్ధన ద్వారా సాతాను క్రియలు
బంధించెదరు వారే (2)      ||క్రీస్తేసు||

క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు
ఎవరెదురు చూచెదరో (2)
నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు
సర్వ లోకము నందు (2)      ||క్రీస్తేసు||

English Lyrics

Audio

Audio

Download Lyrics as: PPT

ఎల్లప్పుడును ప్రభువునందు

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics

ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండి
ప్రతి సమయములోను…
ప్రతి పరిస్థితిలోను ఆనందించండి (2)
యెహోవా చేసిన మేలుల కొరకై
ఎల్లప్పుడును ఆనందించండి (2)
ఆరాధించండి          ||ఎల్లప్పుడును||

పాపంబు తోడ చింతించుచుండ
నరునిగా ఈ భువిలో ఉదయించెగా
మన పాప భారం తన భుజమున మోసి
మనకై తన ప్రాణం అర్పించెగా (2)
ఉచితార్ధమైన రక్షణను నొసగి నీతిమంతుని చేసి
ఉల్లాస వస్త్రమును ధరియింపజేసి యున్నాడు గనుకే     ||ఎల్లప్పుడును||

విశ్వాసమునకు కలిగే పరీక్ష
ఓర్పును కలిగించే ఒక సాధనమై
శోధనకు నిలిచి సహించిన వేళ
జీవ కిరీటమును పొందెదము (2)
నానా విధాలైన శోధనలో పడినప్పుడు ఆనందించండి
సంపూర్ణులుగాను కొదువే లేని ఓర్పును కొనసాగించండి     ||ఎల్లప్పుడును||

ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసి
మరణము దుఃఖము ఏడ్పును దూరము చేసి
మనతో నివాసమును కలిగి యుండుటకు
త్వరలోనే రారాజుగా రానైయుండె (2)
శుభప్రదమైన నిరీక్షణతో కాచియుండండి
సిద్ధమైన మనస్సును కలిగి వేచియుండండి      ||ఎల్లప్పుడును||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

స్తుతి నీకే యేసు రాజా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


స్తుతి నీకే యేసు రాజా
మహిమ నీకే యేసు రాజా
స్తోత్రం నీకే యేసు రాజా
ఘనత నీకే యేసు రాజా
హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా (2)
(యేసు) రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు
త్వరలోనే రానున్నాడు
నిత్యజీవమును మన అందరికిచ్చి
పరలోకం తీసుకెళ్తాడు (2)
హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా (2)        ||స్తుతి||

మధ్యాకాశములో ప్రభువును కలిసెదము
పరిశుద్ధుల విందులో పాలునొందెదము (2)
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు (2)
తేజోవాసులతో స్తుతియింతుము       ||హోసన్నా||

సంతోష గానాలతో ఉత్సాహించి పాడెదము
క్రొత్త కీర్తనతో రారాజును ఘనపరచెదము (2)
శ్రమలైనా శోధనలెదురైనా (2)
ఆర్భాటముతో సన్నుతింతుము       ||హోసన్నా||         ||స్తుతి||

English Lyrics

Audio

దేవాది దేవుడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దేవాది దేవుడు మహోపకారుడు
మహాత్యము గల మహారాజు (2)
ప్రభువుల ప్రభువు – రాజుల రాజు
ఆయన కృప నిరంతరముండును      ||దేవాది||

సునాద వత్సరము ఉత్సాహ సునాదము
నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము (2)
ఉత్తమ దేవుని దానములు (2)       ||దేవాది||

యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవు
జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే (2)
నీదు క్రియలు ఘనమైనవి (2)       ||దేవాది||

అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు క్రీస్తు
మహిమా మహాత్యములు సర్వాధిపత్యమును (2)
సదా నీకే కలుగును గాక (2)       ||దేవాది||

English Lyrics

Audio

పాపానికి నాకు

పాట రచయిత: అనిల్ కుమార్
Lyricist: Anil Kumar

Telugu Lyrics


పాపానికి నాకు ఏ సంబంధము లేదు
పాపానికి నాపై ఏ అధికారము లేదు
పాపానికి నాకు ఏ సంబంధము లేదు
పాపానికి నాపై ఏ అజమాయిషీ లేదు
నా పాపములు అన్ని నా ప్రభువు ఏనాడో క్షమియించివేసాడుగా
మరి వాటినెన్నడును జ్ఞాపకము చేసికొనను అని మాట ఇచ్చాడుగా
నేనున్నా నేనున్నా నా యేసుని కృప క్రింద
నే లేను నే లేను ధర్మ శాస్త్రం క్రింద (2)        ||పాపానికి||

కృప ఉందని పాపం చేయొచ్చా – అట్లనరాదు
కృప ఉందని నీతిని విడువొచ్చా – అట్లనరాదు
కృప ఉందని పాపం చేయొచ్చా – అట్లనరాదు
కృప ఉందని నీతిని విడువొచ్చా – నో
కృప అంటే లైసెన్స్ కాదు
కృప అంటే ఫ్రీ పాస్ కాదు – పాపాన్ని చేసేందుకు
కృప అంటే దేవుని శక్తి
కృప అంటే దేవుని నీతి – పాపాన్ని గెలిచేందుకు

గ్రేస్ ఈస్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్
ఈస్ ఎ పవర్ ఆఫ్ గాడ్ టు ఓవర్ కం (4)         ||నేనున్నా||

కృప ద్వారా ధర్మ శాస్త్రముకు – మృతుడను అయ్యా
కృప వలన క్రీస్తులో స్వాతంత్య్రం – నే పొందితినయ్యా
కృప ద్వారా ధర్మ శాస్త్రముకు – మృతుడను అయ్యా
కృప వలెనే క్రీస్తులో స్వాతంత్య్రం
క్రియల మూలముగా కాదు
కృపయే నను రక్షించినది – నా భారం తొలగించినది
కృప నను మార్చేసినది
నీతి సద్భక్తుల తోడ – బ్రతుకమని బోధించినది

గ్రేస్ టుక్ అవే బర్డెన్ ఫ్రమ్ మి
అండ్ టాట్ టు మి లివ్ రైటియస్లీ (4)          ||నేనున్నా||

పాపానికి మృతుడను నేనయ్యా – హల్లెలూయా
కృప వలెనె ఇది నాకు సాధ్యం – అయ్యిందిరా భయ్యా
పాపానికి మృతుడను నేనయ్యా – హల్లెలూయా
కృప వలెనె ఇది నాకు సాధ్యం
కృపను రుచి చూచిన నేను
దేవునికే లోబడుతాను – పాపానికి చోటివ్వను
పరిశుద్ధత పొందిన నేను
నీతి సాధనములుగానే – దేహం ప్రభుకర్పింతును

యీల్డ్ యువర్ బాడీస్ అంటు ద లార్డ్
యాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైటియస్నెస్ (2)
యీల్డ్ యువర్ బాడీస్ అంటు ద లార్డ్
యాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైటియస్నెస్ (2)          ||నేనున్నా||

ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు
ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా – అట్లనరాదు
ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు
ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా – నో
ధర్మశాస్త్రం కొంత కాలమేగా
ధర్మశాస్త్రం బాలశిక్షయేగా – ప్రభు నొద్దకు నడిపేందుకు
క్రీస్తొచ్చి కృప తెచ్చెనుగా
ధర్మశాస్త్రం నెరవేర్చెనుగా – మనలను విడిపించేందుకు

లా హాస్ లెడ్ ది పీపుల్ టు క్రైస్ట్
నౌ గ్రేస్ విల్ మేక్ హిస్ కాన్క్వరర్స్ (4)          ||నేనున్నా||

English Lyrics

Audio

ప్రియ సంఘస్థులారా

పాట రచయిత: దాసరి క్రీస్తు దాసు
Lyricist: Dasari Kreesthu Dasu

Telugu Lyrics


ప్రియ సంఘస్థులారా
ప్రార్థనలోన సరిగ కూర్చోండి
మీరు చక్కగా కూర్చోండి (2)           ||ప్రియ||

ప్రార్థనలోన మాట్లాడువారిని
ప్రభువు ఇష్టపడరండీ (2)
చప్పట్లు మీరు కొట్టండి
దేవుని మీరు స్తుతించండి        ||ప్రియ||

తలపై ముసుగు వేయకపోతే
ప్రభువు ఇష్టపడరండీ (2)
తలపై ముసుగు కష్టమైతే
ప్రభువుకు ఇష్టులు కారండి       ||ప్రియ||

ఎగాదిగా చూపులు మానకపోతే
ప్రభువు ఇష్టపడరండీ (2)
క్రీస్తు చూపు కలిగి మీరు
భక్తిగా జీవించండి         ||ప్రియ||

English Lyrics

Audio

యెహోవా మహిమ నీ మీద

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యెహోవా మహిమ నీ మీద ఉదయించెను
తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును (2)
ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది
అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది (2)
లెమ్ము నీవు తేజరిల్లుము
ప్రభువు కొరకు ప్రకాశించుము (2)

చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది
జీవ వాక్యము చేబూని జ్యోతివలే లెమ్ము (2)
జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు
రాజులు నీ ఉదయకాంతికి త్వరపడి వచ్చెదరు (2)     ||లెమ్ము||

ఒంటరియైన వాడు వేయి మంది అగును
ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును (2)
ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును
నీ దుఃఖదినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను (2)          ||లెమ్ము||

English Lyrics

Audio

ఓ క్రీస్తు సంఘమా

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics

ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా
ప్రభువు నామములో సాగే అనుబంధమా
ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా
ఓ కంట కన్నీరు తగదు సహవాసమా

ప్రతి కష్టము మనము పంచుకుందాము
కలిసి అందరము వేడుకుందాము (2)        ||ఓ క్రీస్తు||

మనమంతా కలిసి ఆ దేవుని దేహము
తండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము (2)
ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదన
ఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ (2)        ||ప్రతి కష్టము||

సాటి సోదరులు శ్రమల పాలైనపుడు
సాతాను శక్తులచే శోధింపబడినపుడు (2)
ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలి
ఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి (2)        ||ప్రతి కష్టము||

శ్రమలు పొందేవారు అవిధేయులు కారు
విశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు (2)
శాంతమును పాటించి, దేవునిలో వీక్షించి
పంచాలి ఓదార్పు వదిలేసి మన తీర్పు (2)        ||ప్రతి కష్టము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

పరిశుద్ధుడు పరిశుద్ధుడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


పరిశుద్ధుడు పరిశుద్ధుడు – రాజుల రాజు యేసు
బలవంతుడు బలమిచ్చును – ప్రభువుల ప్రభువు క్రీస్తు (2)

గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిననూ
అగాధ జల ప్రవాహములో నేను సాగవలసిననూ (2)
ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా
ఎన్నటికీ వెనుతిరుగను నాయందు నీవుండగా       ||పరిశుద్ధుడు||

నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదును
కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును (2)
ఎన్నటికీ వెనుతిరుగను అండ నీవుండగా
ఎన్నటికీ ఓడిపోను – జయశాలి నీవుండగా         ||పరిశుద్ధుడు||

English Lyrics

Audio

 

 

HOME