రాజు పుట్టెను

పాట రచయిత: శ్యామ్ జోసఫ్
Lyricist: Shyam Joseph

Telugu Lyrics

రాజు పుట్టెను రాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను (2)
ఊరు వాడా పండుగాయెను (2)
కాంతులతో మెరసిపోయెను (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను

దూతలు వెళ్లిరి గొల్లలకు తెల్పిరి
లోక రక్షకుడు పుట్టాడని (2)
అంధకారమైన బ్రతుకును మార్చుటకు
చీకటినుండి వెలుగులో నడుపుటకు (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను            ||రాజు పుట్టెను||

జ్ఞానులు వెళ్లిరి యేసుని చూచిరి
సంతోషముతో ఆరాధించిరి (2)
మన జీవితము మార్చుకొనుటకు
ఇదియే సమయము ఆసన్నమాయెను (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను            ||రాజు పుట్టెను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

క్రీస్తు పుట్టెను హల్లెలూయా

పాట రచయిత: జ్యోతి రాజు
Lyricist: Jyothi Raju

Telugu Lyrics

క్రీస్తు పుట్టెను హల్లెలూయా (2)
జగమంతా పండుగాయెను – సర్వలోకానికి సందడాయెను (2)
చీకు చింత వీడిపోయె – చీకటంత తొలగిపోయె (2)
నవ్యకాంతులెగసె ఇలలో – దివ్యకాంతుడేసు రాకతో…
ఉల్లాసమే ఉత్సాహమే – జగమంతా జయోత్సాహమే (2)

చెట్టెక్కిన లంచగొండి జక్కయ్య
పాప శాపముతో నిండియుండగా
యేసు అడుగు పెట్టెను
ఆ ఇంటిలో – రక్షణకాంతులే విరజిల్లెను (2)         ||చీకు చింత||

గెరాసేను జనములలో కొందరు
రోగాలు దయ్యాలతో బాధనొందగా
యేసు అడుగుపెట్టెను
ఆ ఊరిలో – విడుదలకాంతులే ప్రకాశించెను (2)         ||చీకు చింత||

మరణమాయె యాయీరు కూతురు
వేదన రోదన కన్నీటిలో
యేసు అడుగుపెట్టెను
ఆ ఇంటిలో – జీవపుకాంతులే ప్రజ్వలిల్లెను (2)         ||చీకు చింత||

వేదనతో నలిగిపోవుచున్నావా
యేసు నీ కొరకై ఉదయించెను
లెమ్ము తేజరిల్లుమ్ము
నీ ఇంటికి – వెలుగు వచ్చియున్నది (2)          ||క్రీస్తు పుట్టెను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అందాల బాలుడు

పాట రచయిత: సాయారాం గట్టు
Lyrics: Sayaram Gattu

Telugu Lyrics

అందాల బాలుడు ఉదయించినాడు
లోకాలు వెలిగించు నీతి సూరీడు (2)
రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను
ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2)          ||అందాల||

భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి
ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2)
గొల్లలము మేము కల్లలు ఎరుగము (2)
కళ్లారా జూసాము తేజోమయుని మోము (2)         ||రండయ్యో||

తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి
లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము (2)
దారి చూపే తార రారాజునే జేర (2)
మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా (2)         ||రండయ్యో||

తనలోని వెలుగంత పంచేటి పావనుడు
మనలోని పాపమంత తీసేయు రక్షకుడు (2)
చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు (2)
నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు (2)         ||రండయ్యో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

పరమ దైవమే

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Telugu Lyrics

యేసు పుట్టుకలోని పరమార్ధాన్ని గ్రహించి
తిరిగి జన్మిస్తే
ఆయన కొరకు జీవించగలం
ఆయనను మనలో చూపించగలం

పరమ దైవమే మనుష్య రూపమై
ఉదయించెను నా కోసమే
అమర జీవమే నరుల కోసమై
దిగి వచ్చెను ఈ లోకమే
క్రీస్తు పుట్టెను – హల్లెలూయ
క్రీస్తు పుట్టెను – హల్లెలూయ
క్రీస్తు పుట్టెను – హల్లెలూయా (2)     ||పరమ దైవమే||

ఆకార రహితుడు ఆత్మ స్వరూపుడు
శరీరమును ధరించెను
సర్వాధికారుడు బలాఢ్య ధీరుడు
దీనత్వమును వరించెను
వైభవమును విడిచెను – దాసునిగను మారెను – (2)
దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా…      ||పరమ దైవమే||

అనాది వాక్యమే కృపా సమేతమై
ధరపై కాలు మోపెను
ఆ నీతి తేజమే నరావతారమై
శిశువై జననమాయెను
పాపి జతను కోరెను – రిక్తుడు తానాయెను (2)
భూలోకమును చేరెను – యేసు రాజుగా…      ||పరమ దైవమే||

నిత్యుడు తండ్రియే విమోచనార్ధమై
కుమారుడై జనించెను
సత్య స్వరూపియే రక్షణ ధ్యేయమై
రాజ్యమునే భరించెను
మధ్య గోడ కూల్చను – సంధిని సమకూర్చను – (2)
సఖ్యత నిలుప వచ్చెను – శాంతి దూతగా…      ||పరమ దైవమే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

క్రీస్తేసు పుట్టెను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

క్రీస్తేసు పుట్టెను.. లోక రక్షకునిగా..
పశులపాక పావనమై.. పరవశించెనుగా…
పరవశించెనుగా…

క్రీస్తేసు పుట్టెను లోక రక్షకునిగా
పశులపాక పావనమై పరవశించెనుగా
గొర్రెల కాపరులు సంతోషముతో
గంతులు వేసెను ఆనందముతో (2)
తూర్పు దిక్కున చుక్క వెలిసెను
లోక రక్షకుడు భువికి వచ్చెను (2)        ||క్రీస్తేసు||

హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్

ఆదివాక్యము శరీరధారియై లోకమందు సంచరించెను
చీకటిని చీల్చి జనులందరికి వెలుగును ప్రసాదించెను (2)
పాపములు తీసి పరిశుద్ధపరచి రక్షణ వరమందించే
ఆ యేసు రాజును స్తుతియించి ఘనపరచ రారండి (2)          ||తూర్పు దిక్కున||

సంతోషము సమాధానము కృపా కనికరము
మన జీవితములో ప్రవేశించెను బహుదీవెనకరము (2)
సంబరాలతో సంతోషాలతో వేడుకొన రారండి
బంగారము సాంబ్రాణి బోళము సమర్పించ రారండి (2)          ||తూర్పు దిక్కున||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

విన్నారా విన్నారా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త
మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను
వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను
తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను (2)
ఊరు వాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాం
యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం (2)      ||విన్నారా||

దూతలు చెప్పారంటా రక్షకుడు పుట్టాడని
గొల్లలు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2)
పరలోక దూతల సమూహముతో – స్తోత్రగీతాలు పాడిరంటా
లోక రక్షకుడు మెస్సయ్యేనని ఆనందముతో వెళ్లిరంటా      ||ఊరు వాడా||

ఆ….తారొకటి చెప్పేనంటా రారాజు పుట్టాడని
జ్ఞానులు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2)
బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా ఇచ్చి వచ్చిరంటా
రాజులకు రాజేసయ్యేనని సంతోషముగా వెళ్లిరంటా        ||ఊరు వాడా||

English Lyrics

Audio

యేసు క్రీస్తు పుట్టెను నేడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో
మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో (2)
ఇది పండుగ – క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ – వెలుగులు నిండగా (2)       ||యేసు క్రీస్తు||

పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా (2)
కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను (2)        ||ఇది పండుగ||

సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా (2)
నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను (2)        ||ఇది పండుగ||

శరీర ధారిగా – కృపగల దేవునిగా (2)
పాపుల పాలిట పెన్నిధిగా – లోకమునకు వచ్చెను (2)        ||ఇది పండుగ||

English Lyrics

Audio

రండి రండి రండయో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రండి రండి రండయో రక్షకుడు పుట్టెను (2)
రక్షకుని చూడను రక్షణాలు పొందను (2)        ||రండి||

యూదుల యూదట రాజుల రాజట (2)
రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2)
యూదుల యూదట రాజుల రాజట (2)
రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2)        ||రండి||

బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2)
పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2)
బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2)
పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2)        ||రండి||

సాతాను సంతలో సంతోషమేదిరా (2)
సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో (2)
సాతాను సంతలో సంతోషమేదిరా (2)
సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో (2)        ||రండి||

English Lyrics

Audio

చింత లేదిక

పాట రచయిత: ఎన్ డి ఏబెల్
Lyricist: N D Abel

Telugu Lyrics

చింత లేదిక యేసు పుట్టెను
వింతగను బెత్లేహమందున
చెంత జేరను రండి సర్వ జనాంగమా
సంతసమొందుమా (2)

దూత తెల్పెను గొల్లలకు
శుభవార్త నా దివసంబు వింతగా
ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి
స్తుతులొనరించిరి           ||చింత లేదిక||

చుక్క గనుగొని జ్ఞానులేంతో
మక్కువతో నా ప్రభుని కనుగొన
చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి
కానుకలిచ్చిరి          ||చింత లేదిక||

కన్య గర్భమునందు పుట్టెను
కరుణగల రక్షకుడు క్రీస్తుడు
ధన్యులగుటకు రండి వేగమే దీనులై
సర్వ మాన్యులై          ||చింత లేదిక||

పాపమెల్లను పరిహరింపను
పరమ రక్షకుడవతరించెను
దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము
మోక్ష భాగ్యము       ||చింత లేదిక||

English Lyrics

Audio

క్రీస్తు పుట్టెను

పాట రచయిత: కే తిమోతి
Lyricist: K Thimothy

Telugu Lyrics

క్రీస్తు పుట్టెను పశుల పాకలో
పాపమంతయు రూపు మాపను
సర్వలోకమున్ విమోచింపను
రారాజు పుడమిపై జన్మించెను
సంతోషమే సమాధానమే
ఆనందమే పరమానందమే (2)
అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి
యేసుని చూచి కానుకలిచ్చి
పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే

పరలోక దూతాలి పాట పాడగా
పామరుల హృదయాలు పరవశించగా (2)
అజ్ఞానము అదృష్యమాయెను
అంధకార బంధకములు తొలగిపోయెను (2)    || అరె గొల్లలొచ్చి ||

కరుణగల రక్షకుడు ధర కేగెను
పరమును వీడి కడు దీనుడాయెను (2)
వరముల నొసగ పరమ తండ్రి తనయుని
మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ (2)      || అరె గొల్లలొచ్చి ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME