మన దేశం

పాట రచయిత: కృపాల్ మోహన్
Lyricist: Kripal Mohan

Telugu Lyrics


మన దేశం భారత దేశం
మన రాజ్యం దేవుని రాజ్యం (2)
స్తుతి ఆరాధన నా ఊపిరి
ప్రేమానురాగము నా జీవితం (2)

మన దేశం కానాను దేశం
మన రాజ్యం దేవుని రాజ్యం (2)
స్తుతి ఆరాధన నా ఊపిరి
ప్రేమానురాగము నా జీవితం (6)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నాలాంటి చిన్నలంటే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం
మాలాంటి వారిదే పరలోక రాజ్యం (2)

మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనే
పరలోక రాజ్యమని యేసు చెప్పెను (2)       ||నాలాంటి||

నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొని
ముద్దాడి ముచ్చటించి దీవించెను (2)       ||నాలాంటి||

English Lyrics

Audio

రారాజు వస్తున్నాడో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రారాజు వస్తున్నాడో
జనులారా.. రాజ్యం తెస్తున్నాడో
త్వరపడి వేగమే రండి
ప్రియులారా.. ప్రభుని చేరగ రండి
వస్తానన్న యేసు రాజు రాక మానునా
తెస్తానన్న బహుమానం తేక మానునా (2)       ||రారాజు||

పాపానికి జీతం రెండవ మరణం
అది అగ్ని గుండము అందులో వేదన (2)
మహిమకు యేసే మార్గము జీవము (2)
అందుకే నమ్ముకో యేసయ్యను
పొందుకో నీ పాప పరిహారము (2)       ||వస్తానన్న||

పాపం చెయ్యొద్దు మహా శాపమయ్యేను
ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు (2)
యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం
యేసయ్య గాయాలు రక్షణకు మార్గం
అందుకే నమ్ముకో యేసయ్యను
పొందుకో నీ పాప పరిహారము (2)       ||వస్తానన్న||

కనురెప్ప పాటున కడబూర మ్రోగగా
పరమున ఉందురు నమ్మిన వారందరు (2)
నమ్మని వారందరు శ్రమల పాలవుతారు (2)
అందుకే నమ్ముకో యేసయ్యను
చేరుకో పరలోక రాజ్యంబును (2)       ||వస్తానన్న||

English Lyrics

Audio

మన మధ్యనే ఉన్నది

పాట రచయిత: పి ఐసాక్
Lyricist: P Isaac

Telugu Lyrics


మన మధ్యనే ఉన్నది పరలోక రాజ్యం
మన మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం (2)
పాపము లేదు పరలోకంలో
వ్యాధులు బాధలు లేనే లేదు
పాపము లేదు పరలోకంలో
వ్యాధులు బాధలు అసలే లేవు
నీ రాజ్యం మాకొచ్చును గాక
నీ చిత్తం భువిపై జరుగును గాక
పరలోక రాజ్యాన్ని ఈ భువిపై మేము
ఇప్పుడే అనుభవిస్తాము – (2)
ఇక్కడే అనుభవిస్తాము

సిలువలో మన శాపం తొలగిపోయెను
ఆశీర్వాదముకు మనము వారసులం
దారిద్య్రముతో లేదు మాకు సంబంధం
ఆత్మలో ఫలియించి వర్థిల్లెదం
అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము
కృప క్షేమములే మాకిక సొంతము
అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము
కృప క్షేమములే మా సొంతము           ||నీ రాజ్యం||

ఆలు మగలు ఒకరికి ఒకరు త్యాగ మూర్తులై
కలసి జీవించుటయే పరలోక రాజ్యం
కలతలు లేవు మాకు కన్నీరు తెలియదు
సంతోషముతో మేము సాగిపోతాము
ఈ తరానికి మాదిరిగా మేముంటాము
పరలోక ప్రేమతో కలిసి జీవిస్తాం (2)         ||నీ రాజ్యం||

English Lyrics

Audio

నా యేసు రాజ్యము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా యేసు రాజ్యము అందమైన రాజ్యము
అందులో నేను నివసింతును (2)
సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం
ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2)          ||నా యేసు||

అవినీతియే ఉండని రాజ్యము
ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2)
ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం
ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2)        ||నా యేసు||

హల్లెలూయా స్తుతులున్న రాజ్యం
యేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం (2)
ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం
నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం (2)        ||నా యేసు||

English Lyrics

Audio

HOME