నీవే నా స్నేహము

పాట రచయిత: శారా కంటిమహంటి
Lyricist: Sarah Kantimahanti

Telugu Lyrics


నీవే నా స్నేహము – నీవే నా సర్వస్వము
నీవే ఆధారము – నీవే నా ఆనందము
నీ ప్రేమ నాలో పదిలము
నీలోనే సాక్ష్యమే సంతోషము (2)
సర్వోన్నతుడా నీకే మహిమ
పరమ తండ్రి నీకే ఘనత (2)      ||నీవే||

నా జీవితాంతం నిన్నే పొగడెదను
నా ప్రతి ఆశ నిన్ను మహిమ పరచుటయే (2)
నా దేవుని మందిరములో నివసించెదను
నా స్తుతి నైవేద్యం నీకే అర్పించెదను – (2)        ||సర్వోన్నతుడా||

నా బలహీన స్థితిలో గతివి నీవైతివే
నా కన్నీరు నాట్యముగా మార్చినది నీవే (2)
కృంగిన నా హృదయమును లేవనెత్తితివి
అసాధ్యమైనది నీకు ఏదియు లేదయా – (2)        ||సర్వోన్నతుడా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆకాశం నీ సింహాసనం

పాట రచయిత: జోయెల్ జశ్వంత్ గుమ్మడి
Lyricist: Joel Jaswanth Gummadi

Telugu Lyrics


ఆకాశం నీ సింహాసనం
భూమి నీ పాదపీఠం (2)
సర్వోన్నతుడా సర్వాధికారి
అందుకో ఇల నా హృదయ వందనం
అల్ఫయు నీవే ఒమేగయు నీవే – (2)
మార్గము నీవే – జీవము నీవే       ||ఆకాశం||

పరలోక తెరపైట తొలగించగా
స్తుతి గీత పాటలు వినిపించగా (2)
పరిశుద్ద ఆత్ముడు నను తాకగా
రగిలింది నా మనస్సు ఒక జ్వాలగా       ||ఆకాశం||

నీ స్వరము ఉరుమై వినిపించగా
అదిరింది నా గుండె ఒకసారిగా (2)
నీ కిరణాలు మెరుపై నను తాకగా
వెలిగింది నా మనస్సు ఒక జ్యోతిగా       ||ఆకాశం||

భువిలోని సృష్ఠంత నీ మాటగా
దివిలోని ఊపిరి నీ శ్వాసగా (2)
పరలోక రాజ్యానికి నువ్వు దారిగా
వెలిసావు ధరపైన నా యేసుగా       ||ఆకాశం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సర్వోన్నతుడా

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


సర్వోన్నతుడా
నీవే నాకు ఆశ్రయదుర్గము (2)
ఎవ్వరు లేరు – నాకు ఇలలో (2)
ఆదరణ నీవేగా -ఆనందం నీవేగా (2)

నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట
నిలువలేరని యెహోషువాతో (2)
వాగ్దానము చేసినావు
వాగ్దాన భూమిలో చేర్చినావు (2)      ॥సర్వోన్నతుడా॥

నిందలపాలై నిత్య నిబంధన
నీతో చేసిన దానియేలుకు (2)
సింహాసనమిచ్చినావు
సింహాల నోళ్లను మూసినావు (2)      ॥సర్వోన్నతుడా॥

నీతి కిరీటం దర్శనముగా
దర్శించిన పరిశుద్ధ పౌలుకు (2)
విశ్వాసము కాచినావు
జయజీవితము ఇచ్చినావు (2)      ॥సర్వోన్నతుడా॥

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దేహం పాతది

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దేహం పాతది – మనసు మలినమైనది
జీవం పాపిది – మార్గం తెలియనిది (2)
సర్వోన్నతుడా నిత్య నూతనుడా
నిత్య జీవనం కలిగించుమయ్యా
మరియా కన్న తనయా         ||దేహం||

దాహంతో నువ్వు నీళ్ళను అడిగితే ఇవ్వకపోయానే
ఆకలిగొని నువ్వు రొట్టెను అడిగితే పెట్టకపోయానే
తల దాచుకునే ఆశ్రయమడిగితే పో అని అన్నానే
మానము కాచగ వస్త్రమునడిగితే లేదని అన్నానే       ||సర్వోన్నతుడా||

తెలిసీ తెలియక చేసిన తప్పులు ఉన్నవి మన్నించు
తండ్రివి నీవే నా చేయిని నువ్వు పట్టి నడిపించు
వీడగ లేని సంసారమనే బంధం విడిపించు
నీపై మనసు నిలిచే విధమును నువ్వే నేర్పించు        ||సర్వోన్నతుడా||

English Lyrics

Audio

HOME