యేసే సర్వం

పాట రచయిత: సుకుమార్
Lyricist: Sukumar

Telugu Lyrics


అత్యున్నతమైన సింహాసనంపై
ఆసీనుడవైన గొప్ప దేవుడా
తేజోమయుడా రక్షణకర్తా
నీవే నా దేవుడని కీర్తింతును
తేజోమయుడా రక్షణకర్తా
నీవే నా దేవుడని ఘనపరతును
యేసే మార్గం యేసే సత్యం
యేసే జీవం యేసే సర్వం (2)

సాధ్యం కానిది ఏమున్నది
నీ యందే విశ్వాసం నాకున్నది (2)
నన్నెన్నడు ఎడబాయవు
నీ ప్రేమే నాకు నిత్య జీవము
నన్నెన్నడు ఎడబాయవు
నీ వాక్యమే నాకు ఆధారం.. యేసే..

ది హోల్ వరల్డ్ మైట్ నాట్ సి మై
స్ట్రగ్గుల్స్ అండ్ అబ్స్టాకుల్స్ బట్
గాడ్ సీస్ దెం ఆల్ అండ్ హి నెవర్
హెసిటేట్స్ టు కం టు మి
గివ్ ఎవ్రిథింగ్ వి హావ్ టు హిం
ఈవెన్ పెయిన్ అండ్ హార్ట్ బ్రేక్స్
గాడ్ ఈస్ అవర్ రీసన్ టు లివ్
గ్లోరీ టు మై గాడ్ యెహోవా       ||యేసే మార్గం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసే సత్యం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసే సత్యం యేసే నిత్యం
యేసే సర్వము జగతికి
యేసే జీవం యేసే గమ్యం
యేసే గమనము (2)
పాత పాడెదం ప్రభువునకు
స్తోత్రార్పణ చేసెదం (2)      ||యేసే||

పలు రకాల మనుష్యులు – పలు విధాలు పలికిన
మాయలెన్నో చేసినా – లీలలెన్నో చూపినా (2)
యేసులోనే నిత్య జీవం
యేసులోనే రక్షణ (2)      ||యేసే||

బలము లేని వారికి – బలము నిచ్చుఁ దేవుడు
కృంగియున్న వారిని – లేవనెత్తు దేవుడు (2)
యేసులోనే నిత్య రాజ్యం
యేసులోనే విడుదల (2)      ||యేసే||

English Lyrics

Audio

మార్గం సత్యం జీవం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మార్గం సత్యం జీవం నీవే యేసు
సర్వం సకలం నీవే క్రీస్తు (2)
మా ఆధారం నీవేనయ్యా
మా అనుబంధం నీతోనేనయ్యా (2)
వధియింపబడిన ఓ గొర్రెపిల్ల
ప్రభువైన మా యేసువా
మా స్తుతి స్తోత్రముల్ నీకే
మహిమా ప్రభావముల్ నీకే (2)        ||మార్గం||

పరమును విడిచావు మాకై
నరునిగా పుట్టావు ధరపై (2)
ఆహా నీదెంత ప్రేమ
ఎవరికైనా వర్ణింప తరమా (2)          ||వధియింప||

కలువరిలో రక్తమును కార్చి
విలువగు ప్రాణమును ఇచ్చి (2)
తెచ్చావు భువికి రక్షణ
ఇచ్చావు పాప క్షమాపణ (2)          ||వధియింప||

English Lyrics

Audio

ఎవరితో నీ జీవితం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనం
ఎదలో ప్రభు వసింపగా – ఎదురు లేదు మనుగడకు (2)

దేవుడే నీ జీవిత గమ్యం
దేవ రాజ్యం నీకే సొంతం
గురి తప్పక దరి చేరుమురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2)       ||ఎవరితో||

కష్టాలకు కృంగిపోకురా
నష్టాలకు కుమిలిపోకురా
అశాంతిని చేరనీకురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2)       ||ఎవరితో||

గెలుపోటమి సహజమురా
దివ్య శక్తితో కదులుమురా
ఘన దైవం తోడుండునురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2)       ||ఎవరితో||

English Lyrics

Audio

సర్వ సృష్టిలోని

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సర్వ సృష్టిలోని జీవ రాశి అంతా
నీదు మహిమనే ప్రస్తుతించగా
స్వరమెత్తి నీ మహిమ కార్యములను
ప్రతి స్థలమునందు ప్రకటించెదా
నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం
నిన్న నేడు రేపు ఒకటిగ ఉన్నవాడవు
విడువవు ఎడబాయవు నా యేసయ్యా         ||సర్వ||

ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే
ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే
నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి      ||నీవే||

నీ రూపములో నను చేసిన పరమ కుమ్మరీ
నీ రక్తమునిచ్చ్చి జాలి హృదయమా
నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి        ||నీవే||

English Lyrics

Audio

స్తోత్రము స్తుతి చెల్లింతుము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా
యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా (2)
నీవే మార్గం నీవే జీవం
నీవే సత్యం నీవే సర్వం (2)           ||స్తోత్రము||

మరణమైననూ ఎర్ర సంద్రమైననూ
నీ తోడు నాకుండ భయము లేదుగా
శత్రు సైన్యమే నా ఎదుట నిలచినా
బలమైన కోట నీవేగా (2)
నా దుర్గమా నా శైలమా
నా అతిశయమా ఆనందమా (2)       ||నీవే||

హింసలైననూ పలు నిందలైననూ
నీ చల్లని రెక్కలే నాకాశ్రయం
చీకటైననూ అగాధమైననూ
నీ క్షమా కిరణమే వెలుగు మార్గము (2)
నీతి సూర్యుడా నా పోషకుడా
నా వైద్యుడా మంచి కాపరి (2)       ||నీవే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నాలో ఉన్న ఆశలన్నియు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నాలో ఉన్న ఆశలన్నియు
నాలో ఉన్న ఊహలన్నియు
నాలో ఉన్న ప్రాణమంతయు – నీవే యేసయ్యా (2)
యేసయ్యా నీవే నా మార్గం
యేసయ్యా నీవే నా సత్యం
యేసయ్యా నీవే నా జీవం
నీవే నా ప్రాణం

నాకున్నవన్ని నీకే యేసయ్యా
నాలోన నిన్ను దాచానేసయ్యా (2)
నీ చేతులలో నా రూపమునే ముద్రించితివి
నా పాపముల కొరకై నీవు బలి అయిపోతివి (2)
పరిశుద్ధమైన రక్తము ద్వారా
పాపాలన్ని కడిగివేసితివి        ||యేసయ్యా||

నా కోసమే ఈ భువికి వచ్చితివి
నా కోసమే నీ ప్రాణం ఇచ్చితివి (2)
నా హృదయములో నీ వాక్యమునే నే ఉంచితిని
నీ రాకకై నేను వేచి ఉంటిని (2)
పరిశుద్ధమైన నీ చేతులలో
నీ రూపములో నన్ను చేసితివి         ||యేసయ్యా||

English Lyrics

Audio

HOME