యేసు ఉంటే చాలు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు ఉంటే చాలు
నా జీవితం ధన్యము (2)
ఆయనే నా సర్వము
ఆయనే నా కేడెము
అయనే నా స్వాస్థ్యము (2)               ||యేసు||

ఎడారిలో నే వెళ్లిన – యేసు ఉంటే చాలు
ఆలలే నా వైపు ఎగసి – యేసు ఉంటే చాలు (2)
ఆయనే నా మార్గము
ఆయనే నా సత్యము
ఆయనే నా జీవము (2)               ||యేసు||

ఆపవాది నాపైకి వచ్చిన – యేసు ఉంటే చాలు
లోకము నను త్రోసివేసిన – యేసు ఉంటే చాలు (2)
ఆయనే నా శైలము
ఆయనే నా ధైర్యము
ఆయనే నా విజయము (2)               ||యేసు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీ స్నేహము

పాట రచయిత: జాషువా షేక్
Lyricist: Joshua Shaik

Telugu Lyrics

నీ స్నేహము ఎంతో సత్యము
ఆద్యంతము నా హృదిలో పదిలము (2)
నా సఖుడా ప్రియ యేసయ్య
నా హితుడా స్నేహితుడా (2)
నీవెంత గొప్ప వాడివయ్యా
నను ఆదరించినావయ్యా (2)

సింహాల బోనులో నా ప్రాణానికి
ప్రాణమైన నా విభుడవు
చెరసాలలోన సంకెళ్ళు విరచి
విడుదల నిచ్చిన రక్షక (2)
కన్న తల్లి కూడా నన్నెరుగక మునుపే
నన్నెరిగిన నా తండ్రివి        ||నా సఖుడా||

గొల్యాతయినా ఏ యుద్ధమైనా
విజయము నిచ్చిన వీరుడవు
పదివేలమంది నా వైపు కూలినా
నాతో నిలచిన ధీరుడవు (2)
నా దోశములను నీదు రక్తముతో
తుడిచివేసిన పరిశుద్ధుడవు        ||నా సఖుడా||

ఏ ఎన్నిక లేని నను ప్రేమించిన కృపామయుడవు
అందరు విడిచిన నన్నెన్నడు విడువని కరుణామయుడవు (2)
నిస్సారమైన నా జీవితములో
సారము పోసిన సజీవుడవు (2)        ||నా సఖుడా||

English Lyrics

Audio

రండి రండి యేసుని యొద్దకు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
ప్రయాసపడి భారము మోయువారలు
ప్రభుని చెంతకు పరుగిడి వేగమే

యేసుని పిలుపు వినియు నింక – యోచింపరేల
అవనిలో అగచాట్ల పాలైన
అబ్బదు శాంతి ఆత్మకు నిలలో         ||రండి||

కరువు రణము మరణము చూచి – కలుగదు మారుమనస్సు
ప్రవచనములు సంపూర్ణములాయెను
యూదులు తిరిగి వచ్చుచున్నారు        ||రండి||

ప్రభు యేసు నీ కొరకై తనదు – ప్రాణము నిచ్చె గదా
సిలువను రక్తము చిందించియును
బలియాయెను యా ఘనుడు మనకై       ||రండి||

యేసుని నామమునందె పరమ – నివాసము దొరకును
ముక్తిని పాప విమోచనమును
శక్తిమంతుడు యేసే యిచ్చును      ||రండి||

నేనే మార్గము నేనే సత్యము – నేనే జీవమును
నేను గాకింకెవరు లేరని
యెంచి చెప్పిన యేసుని వద్దకు     ||రండి||

English Lyrics

Audio

Chords

ఆరాధించెద

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఆరాధించెద నిను మది పొగడెద
నిరతము నిను స్తుతియించెదను (2)
మార్గము నీవే సత్యము నీవే (2)
జీవము నీవే నా ప్రభువా (2) ||ఆరాధించెద||

విస్తారంబగు వ్యాపకములలో
విడచితి నీ సహవాసమును (2)
సరిదిద్దితివి నా జీవితము (2)
నిను సేవింపగ నేర్పిన ప్రభువా (2) ||ఆరాధించెద||

నీ రక్తముతో నను కడిగితివి
పరిశుద్దునిగా జేసితివి (2)
నీ రక్షణకై స్తోత్రము చేయుచు (2)
నిత్యము నిన్ను కొనియాడెదను (2) ||ఆరాధించెద||

పెద్దలు పరిశుద్దులు ఘన దూతలు
నీ సన్నిధిలో నిలచిననూ (2)
లెక్కింపగజాలని జనమందున (2)
నను గుర్తింతువు నా ప్రియ ప్రభువా (2) ||ఆరాధించెద||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసే నా మార్గము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసే నా మార్గము
యేసే నా సత్యము
జీవమని పాడెదం (2)

పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు
ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును
నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు
రోగములన్నిటిని స్వస్థపరచువాడు         ||యేసే నా||

యేసే నా సర్వము యేసే నా సమస్తము
ఆయనే నా సంగీతము ఆనందముతో పాడుదం
నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు
రోగములన్నిటిని స్వస్థపరచువాడు        ||యేసే నా||

యు ఆర్ ది వే యు ఆర్ ది ట్రూత్
యు ఆర్ ది లైఫ్ మై లార్డ్ (2)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME