కంటిపాపలా కాచినావయ్యా

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

కంటిపాపలా కాచినావయ్యా – చంటిపాపను మోసినట్టు మోసినావయ్యా
చేతి నీడలో దాచినావయ్యా – తోడుగా మా ముందరే నడచినావయ్యా
పోషించినావయ్యా.. బలపరచినావయ్యా – భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యా
నడిపించినావయ్యా.. కాపాడినావయ్యా – ఓటమంచులో విజయమునిచ్చినావయ్యా
మా తలంపులు కావు.. నీ తలంపులే – మా జీవితాలలో జరిగించినావయ్యా
మా ఊహలే కాదు.. నీ ప్రణాళికే – మానక సమయానికి నెరవేర్చినావయ్యా           ||కంటిపాపలా||

ఎన్నో ఏళ్లుగా.. ఎదురు చూసాముగా – ఆశలే అడియాశలవ్వగా సోలిపోయాముగా
దారే కానక.. ఆగిపోయాముగా – అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా
అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించెగా
అణగారిన మా ఆశలన్ని చిగురింపజేసెగా
ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచెగా
చితికిన మా జీవితాలను వెలిగింపజేసెగా
కన్నీరు తుడిచినావు.. నాట్యముగ మార్చినావు
ఎనలేని ప్రేమ మా పైన చూపి           ||కంటిపాపలా||

ఊహించువాటికంటే ఎంతో అధికముగా – హెచ్చించినావు దేవా.. నీ ప్రేమ మధురము
ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై – దీవించినావు దేవా.. నీ ప్రేమ మరువము
హీనులం.. బలహీనులం.. నిలువలేక పడిపోయినా
లేవనెత్తి బండపైనే నిలబెట్టినావుగా
చీటికీ.. మాటి మాటికీ.. మా నమ్మకమే కోల్పోయినా
అడుగడుగున నీ నమ్మకత్వమును కనబరచినావుగా
పోగొట్టుకున్నదంతా.. రెట్టింపు చేసినావు
నీ గొప్ప ప్రేమ మా పైన చూపి           ||కంటిపాపలా||

Download Lyrics as: PPT

నా తనువు నా మనసు

పాట రచయిత: స్వప్న ఎడ్వర్డ్స్
Lyricist: Swapna Edwards

Telugu Lyrics


నా తనువు నా మనసు
నా నైపుణ్యం నీ కొరకే
నా తలంపులు నా మాటలు
నా క్రియలు నీ కొరకే
నా ప్రయాసే కాదు
నీ కరుణతో నిలిచింది ఈ జీవితం
నీ నామం కీర్తించాలని
నీ బలం చూపించాలని
అందుకేగా నన్నిలలో నియమించితివి

నీ స్వరూపముగా
నీ శ్వాసతో నను సృజియించితివి
నీ మహిమగా నేనుండుటకు
నీతోనే జీవించుటకు (2)
అందుకేగా నన్నిలలో సృజియించితివి
అందుకేగా నన్నిలలో నియమించితివి         ||నా తనువు||

గర్భ వాసమున లేనప్పుడే
నన్ను ప్రతిష్టించితివి
నీ వెలుగునే ప్రకాశించుటకు
నీ ప్రేమనే పంచుటకు (2)
అందుకేగా నన్నిలలో ప్రతిష్టించితివి
అందుకేగా నన్నిలలో నియమించితివి           ||నా తనువు||

English Lyrics

Audio

దేవా నీ తలంపులు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ
నా యెడల నీ కరుణ
సర్వ సదా నిలుచుచున్నది (2)        ||దేవా||

స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే
స్తుతి పాడేను హృదయముతో (2)
స్తుతించి వర్ణించి ఘనపరతున్ (2)
నీవే నా రక్షకుడవని         ||దేవా||

మొదట నిన్ను ఎరుగనైతిని
మొదటే నన్ను ఎరిగితివి (2)
వెదుకలేదు ప్రభువా నేను (2)
వెదకితివి ఈ పాపిని          ||దేవా||

అద్భుతమైనది సిలువ దృశ్యం
ప్రభును కొట్టి ఉమ్మి వేసిరి (2)
ప్రభును వర్ణింప నశక్యము (2)
ప్రభువే సహించె దుఃఖము           ||దేవా||

ఎట్లు మౌనముగా నుందు ప్రభు
చెల్లింపక స్తోత్ర గీతము (2)
కాలమంతా పాడుచుండెద (2)
నీ ప్రేమ అపారమైనది           ||దేవా||

English Lyrics

Audio

Chords

యేసయ్యా నా హృదయాభిలాష

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా (2)

పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై
నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు (2)
పూజనీయుడా నీతి సూర్యుడా
నిత్యము నా కనుల మెదలుచున్నవాడా        ||యేసయ్యా||

ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో
మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా (2)
విజయశీలుడా పరిశుద్ధాత్ముడా
నిత్యము నాలోనే నిలచియున్నవాడా         ||యేసయ్యా||

English Lyrics

Audio

కృప వెంబడి కృపతో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


కృప వెంబడి కృపతో
నను ప్రేమించిన నా యేసయ్యా
నను ప్రేమించిన నా యేసయ్యా (2)
నను కరుణించిన నా యేసయ్యా (2)         ||కృప||

నా యెడల నీకున్న తలంపులు
బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా (2)
అవి వర్ణించలేను నా యేసయ్యా
అవి వివరింపలేను నా యేసయ్యా (2)
నా యెడల నీకున్న వాంఛలన్నియు            ||కృప||

ఎన్నో దినములు నిన్ను నే విడచితిని
ఎన్నో దినములు నిన్ను నే మరచితిని (2)
విడువని ఎడబాయని నా యేసయ్యా
మరువక ప్రేమించిన నా యేసయ్యా (2)
ఏమిచ్చి నీ ఋణము తీర్చెదనయ్యా           ||కృప||

English Lyrics

Audio

నీవెన్నాళ్ళు రెండు తలంపులతో

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

నీవెన్నాళ్ళు రెండు తలంపులతో
కుంటి కుంటి నడిచెదవీవు
యెహోవాయే నీ దేవుడా
లేక వేరే దేవతలున్నారా (2)

మనం తీర్మానించెదమిప్పుడే
మన నోట వంచన లేకుండా (2)
మరుగైన పాపములన్నిటిన్
హృదయమునుండి తొలగించెదం (2)           ||నీవెన్నాళ్ళు||

మారు మనస్సు పొందెదమిప్పుడే
జీవిత మోసములనుండి (2)
పరిశుధ్ధులమై నిర్దోషులుగా
ప్రభు దినమందు కనబడెదం (2)               ||నీవెన్నాళ్ళు||

నేను నా ఇంటివారలము
యెహోవానే సేవించెదము (2)
నీవెవరిని సేవించెదవో
ఈ దినమే తీర్మానించుకో (2)                   ||నీవెన్నాళ్ళు||

English Lyrics

Audio

 

 

HOME