ఒక క్షణమైనా నిన్ను

పాట రచయిత: జోసఫ్ కొండా
Lyricist: Joseph Konda

Telugu Lyrics

ఒక క్షణమైనా నిన్ను వీడి
ఉండలేనయ్య నా యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2)            ||ఒక క్షణమైనా||

నశియించిపోతున్న నన్ను
బ్రతికించినావయ్యా యేసు
కృశించిపోతున్న నాలో
వేంచేసినావయ్యా యేసు (2)
నీ కార్యములెంతో ఆశ్చర్యకరములయ్యా
నీ వాగ్దానములెంతో నమ్మదగినవయ్యా             ||యేసయ్యా||

మతిలేక తిరిగిన నన్ను
నీ దరి చేర్చినావయ్యా యేసు
శ్రమ చేత నలిగిన నాకు
వరమిచ్చినావయ్యా యేసు (2)
నీ ఆలోచనలెంతో లోతైన దీవెనయ్యా
నీ తలపులు ఎంతో మధురము నా యేసయ్యా              ||యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మంచే లేని నా పైన

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: AR Stevenson

Telugu Lyrics


మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు (2)
ఆదియంత మైనవాడవు – మానవుని రూపమెత్తావు (2)
పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి (2)
ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా
యేసు నీ ఋణము తీరునా (2)         ||మంచే లేని||

లోకాలన్నీ ఏలే రారాజు వైన నీవు
సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు (2)
నీదెంత దీన మనస్సు
నా కెంత ఘనత యేసు (2)        ||ఎంతగా||

నాశనమైన నన్ను రక్షించగోరి నీవు
వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు (2)
నీలోన జాలి పొంగె
నాలోన శాంతి నిండె (2)          ||ఎంతగా||

చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు
వేకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావు (2)
నీ సాటిలేని త్యాగం
నా పాలి గొప్ప భాగ్యం (2)          ||ఎంతగా||

English Lyrics

Audio

నా నాథుడా

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు (2)
అన్నియు నీకై వీడి – నిన్నే వెంబడించితిని (2)
పెన్నుగ నాలో నాటుమా (2) ప్రేమన్        ||నా నాథుడా||

దేవాలయ విగ్రహముల్ – దేవతలు వేయిలక్షల్ (2)
యావత్తు పెంటయనుచు (2) నిదిగో         ||నా నాథుడా||

ఆదియంత రహితుడ – ఆత్మల నాయకుడా (2)
ఆశ కల్గించు నాలోన (2) నీవే             ||నా నాథుడా||

పరిశుద్ధ యవతరుడా – మరియు తేనె అమృతుడా (2)
కరుణతో నన్ను గావుమా (2) యిప్పుడు        ||నా నాథుడా||

భూతలమునకు వేంచేసి – పాతకుల ప్రేమించితివి (2)
పాతకుడ నేనైతిని (2) మహా          ||నా నాథుడా||

ఆద్యంతము లేనట్టి – బీదలకు ధన నిధీ (2)
సదయుడా నన్ను చూడుమా (2) యిపుడు        ||నా నాథుడా||

హల్లెలూయ గీతమును – ఎల్లెడల చాటించెదను (2)
ఉల్లమందానంద ధ్వని (2) యిదియే       ||నా నాథుడా||

English Lyrics

Audio

నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Telugu Lyrics

నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య
నన్ను నన్ను వీడిపోబోకయ్యా (2)
నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య
నీవుంటే నాకు చాలు యేసయ్య (2)           ||నిన్నే||

కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా
కన్నవారే కాదని నన్ను నెట్టినా (2)
కారు చీకటులే నన్ను కమ్మినా
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా (2)
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా            ||నిన్నే||

చేయని నేరములంటకట్టినా
చేతకాని వాడనని చీదరించినా (2)
చీకు చింతలు నన్ను చుట్టినా
చెలిమే చితికి నన్ను చేర్చినా (2)
చెలిమే చితికి నన్ను చేర్చినా                 ||నిన్నే||

English Lyrics

Audio

 

HOME