యేసయ్యా నన్నెందుకు

పాట రచయిత: జ్యోతి స్వరాజ్
Lyricist: Jyothi Swaraj

Telugu Lyrics


యేసయ్యా.. నన్నెందుకు ఎన్నుకున్నావయ్యా
తెలుపుము నీ చిత్తము నా యెడల – (2)     ||యేసయ్యా||

ఏ దరి కానక తిరిగిన నన్ను
నీ కౌగిటిలో చేర్చుకున్నావయ్యా (2)
ఏమి నీ ప్రేమా – ఏమి నీ కృప నా యెడల (2)
ఏమి నీ కృప నా యెడల       ||యేసయ్యా||

చనిపోయిన స్థితిలో పడిపోయిన నన్ను
నీ జీవము నొసగి బ్రతికించావయ్యా (2)
ఏమి నీ దాక్షిణ్యం – ఏమి నీ దయ నా యెడల (2)
ఏమి నీ దయ నా యెడల       ||యేసయ్యా||

శోధనా బాధలో కృంగిన నన్ను
నిరీక్షణ నొసగి బలపరచావయ్యా (2)
ఏమి నీ ఆదరణ – ఏమి నీ ఆశ నా యెడల (2)
ఏమి నీ ఆశ నా యెడల       ||యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నేను కూడా ఉన్నానయ్యా

పాట రచయిత: ఆడమ్ బెన్ని
Lyricist: Adam Benny

Telugu Lyrics

నేను కూడా ఉన్నానయ్యా
నన్ను వాడుకో యేసయ్యా (2)
పనికిరాని పాత్రనని
నను పారవేయకు యేసయ్యా (2)

జ్ఞానమేమి లేదుగాని
నీ సేవ చేయ ఆశ ఉన్నది (2)
నీవే నా జ్ఞానమని (2)
నీ సేవ చేయ వచ్చినానయ్య (2)        ||నేను||

ఘనతలొద్దు మెప్పులొద్దు
ధనము నాకు వద్దే వద్దు (2)
నీవే నాకు ఉంటే చాలు (2)
నా బ్రతుకులోన ఎంతో మేలు (2)        ||నేను||

రాళ్లతో నన్ను కొట్టిన గాని
రక్తము కారిన మరువలేనయ్యా (2)
ఊపిరి నాలో ఉన్నంత వరకు (2)
నీ సేవలో నేను సాగిపోదునయా (2)        ||నేను||

మోషే యెహోషువాను పిలిచావు
ఏలీయా ఎలీషాను నిలిపావు (2)
పేతురు యోహాను యాకోబులను (2)
అభిషేకించి వాడుకున్నావు (2)        ||నేను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఏమి ఉన్నా లేకున్నా

పాట రచయిత: సుమన్
Lyricist:
Suman

Telugu Lyrics

ఏమి ఉన్నా లేకున్నా
ఎవరు నాకు లేకున్నా (2)
యేసు నందే ఆనందింతును
యేసయ్యనే ఆరాధింతును (2)
ఆనందింతును ఆరాధింతును (2)
యేసు నందే ఆనందింతును
యేసయ్యనే ఆరాధింతును (2)

మందలో గొర్రెలు లేకున్ననూ
శాలలో పశువులు లేకున్ననూ (2)
ఏమి నాకు లేకున్నా
కష్ట కాలమందైనా (2)        ||యేసునందే||

ద్రాక్షా చెట్లు ఫలించుకున్ననూ
అంజూరపు చెట్లు పూయకున్ననూ (2)
ఏమి నాకు లేకున్నా
నష్ట సమయమందైనా (2)        ||యేసునందే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

వాగ్ధానము

పాట రచయితలు: జాన్ ఎర్రి, అలెన్ గంట, జోయెల్ జోసెఫ్, ఆశీర్వాద్
Lyricists: John Erry, Allen Ganta, Joel Joseph, Ashirvad

Telugu Lyrics


రాజుల రాజా ప్రభువుల ప్రభువా
నాతో ఉన్నవాడా
ఇచ్చిన మాట తప్పనివాడా
స్థిరపరచువాడా
భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము

నీ కార్యములు సంపూర్ణము – పరిపూర్ణము
నీ వాక్యములు జీవమునిచ్చును – నెమ్మదినిచ్చును
భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
నిరంతరము…

ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ ఓ…
ఓ ఓ ఓ…

నీ చిత్తమే జరుగును
నీ సన్నిధే జయమిచ్చును (2)
నీ చిత్తమే జరుగును.. ఆమేన్.. ఆమేన్..
నీ సన్నిధే జయమిచ్చును.. ఆమేన్.. ఆమేన్.. (2)
అనుదినము నీ వాగ్ధానములో.. నే నడిచెదను (2)
భయపడను… నిలిచెదను…
నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
నిరంతరము…

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సాగిపోదును ఆగిపోను నేను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సాగిపోదును – ఆగిపోను నేను
విశ్వాసములో నేను – ప్రార్ధనలో నేడు (2)
హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2)

ఎండిన ఎడారి లోయలలో – నేను నడిచినను
కొండ గుహలలో – బీడులలో నేను తిరిగినను (2)
నా సహాయకుడు – నా కాపరి యేసే (2)
హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2)

పగలెండ దెబ్బకైనను – రాత్రి వేళ భయముకైనా
పగవాని బానములకైనా – నేను భయపడను (2)
నాకు ఆశ్రయము – నా ప్రాణము యేసే (2)
హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2)

పదివేల మంది పైబడినా – పదిలముగానే నుండెదను
ప్రభు యేసు సన్నిధానమే – నాకు ఆధారం (2)
నాకు కేడెము – నా కోటయు యేసే (2)
హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆత్మ వర్షమును

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా
ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా (2)
నీ ఆత్మ చేత అభిషేకించి (2)
నీ కృప చేత బలపరచయ్యా (2)
నే ఉన్నది నీ కోసమే యేసయ్యా
నీ సింహాసనం చేరితినయ్యా            ||ఆత్మ||

బలహీనతతో నన్ను బలపరచుము
ఒంటరైన వేళలో ధైర్యపరచుము (2)
కృంగిన వేళ నీ దరి చేర్చి (2)
నీ ఆత్మ శక్తితో బలపరచయ్యా (2)           ||నే ఉన్నది||

ఆత్మీయుడవై నన్ను ఆదరించుము
అలసిన వేళ దర్శించుము (2)
అవమానములో నీ దరి చేర్చి (2)
నీ ఆత్మ శక్తితో స్థిరపరచయ్యా (2)           ||నే ఉన్నది||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసూ నీకు కావాలని

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసూ… నీకు కావాలని
నన్ను కోరుకున్నావా (2)
నే ఘోర పాపిని ప్రభువా
ఆ.. ఆ.. ఎందుకయ్యా నాపై నీ ప్రేమ (2)

కలుషాల్ని కడిగిన కరుణామయుడా
కన్నీటి గాథను మలిచావా ప్రభువా (2)
ఈ పేద బ్రతుకును అరచేతులలో
చెక్కావు నిలిపావు నా యేసు ప్రభువా (2)
నేను నేనే కానయ్యా
నాలో నీవే యేసయ్యా (2)
నీ ప్రేమకుప్పొంగిపోనా
ఆ.. ఆ.. నీ ప్రేమలో మునిగిపోనా (2)            ||యేసూ||

దాహముతో ఉన్న నా యేసు ప్రభువా
నీ దాహం తీర్చే భాగ్యమునిమ్మయా (2)
నశియించు ఆత్మల దాహముతో
నను చెక్కావు నిలిపావు నా యేసు ప్రభువా (2)
నేను నేనే కానయ్యా
నాలో నీవే యేసయ్యా (2)
నీ ప్రేమకుప్పొంగిపోనా
ఆ.. ఆ.. నీ ప్రేమలో మునిగిపోనా (2)            ||యేసూ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ప్రేమిస్తా నిన్నే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా
పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా (2)
చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా
యేసయ్యా నీ సన్నిధి చాలయా (2)        ||ప్రేమిస్తా||

నను ప్రేమించి భువికొచ్చినది నీ ప్రేమ
సిలువలో మరణించి బలియైన ఆ ప్రేమ (2)
ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
నా జీవమర్పింతు నీ సేవకు (2)          ||చాలయ్యా||

కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమ
కరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమ (2)
ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
నా జీవమర్పింతు నీ సేవకు (2)          ||చాలయ్యా||

నా స్థితి మార్చి నను రక్షించెను నీ ప్రేమ
నను దీవించి హెచ్చించినది నీ ప్రేమ (2)
ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
నా జీవమర్పింతు నీ సేవకు (2)          ||చాలయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దేవా ఈ జీవితం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దేవా ఈ జీవితం నీకంకితం (2)
ఎన్ని కష్టాలైనా… ఎన్ని నష్టాలైనా…
నీతోనే నా జీవితం
వ్యాధి బాధలైనా… శోక సంద్రమైనా…
నీతోనే నా జీవితం (2)            ||దేవా||

నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి
నీ మార్గమునే నాకు చూపినావు (2)
నీతోనే నడచి – నీలోనే జీవించి
నీతోనే సాగెదను (2)            ||ఎన్ని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నడవాలని యేసు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నడవాలని యేసు నడవాలని
నడవాలని నీతో నడవాలని
నాకున్న ఆశ నీపైనే ధ్యాస (2)
నిరంతరం నీతోనే నడవాలని (2)

హానోకు నీతో నడిచాడు దేవ
పరలోకపు నడకతో చేరాడు నిన్ను      ||నడవా||

నోవాహు నీతో నడిచాడు దేవ
రక్షణనే ఓడలో రక్షింప బడెను      ||నడవా||

అబ్రాహాము నీతో నడిచాడు దేవ
విశ్వాసపు యాత్రలో సాగాడు నీతో      ||నడవా||

నా జీవితమంతా నీతో నడవాలని
నా చేయి పట్టుకొని నడిపించు ప్రభువా      ||నడవా||

English Lyrics

Audio

HOME