కనలేను ప్రభుకేల

పాట రచయిత: కే సుందర్ రావు
Lyricist: K Sundar Rao

Telugu Lyrics

కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై
మనలేను ప్రభు జూచి కఠినాత్మునై
కఠినాత్మునై…        ||కనలేను||

పాపులనేలేటి ప్రభునేలనో
బల్లెంపు పోటుల బంధించిరి (2)
కనుపించు పాపాలు రక్తాలలో
ప్రభు బాధలో        ||కనలేను||

ముండ్ల కిరీటము ప్రభుకేలనో
మూఢులు మోపిరి ప్రభు నెత్తిని (2)
ప్రభు రక్త గాయాలు నా పాపమా
ప్రభు శాపమా        ||కనలేను||

తన జంపు శత్రువుల క్షమియించెను
క్షమియింపుమని తండ్రిని వేడెను (2)
క్షమా బుద్ధి నేర్పించి చితి నోర్చెను
భరియించెను        ||కనలేను||

మోయజాలని సిలువ మోయించిరి
దివినేలు బాహువులు బంధించిరి (2)
నా పాపమంతయు ప్రభు మోసెను
భరియించెను        ||కనలేను||

జీవజలముల నిచ్చుఁ ప్రభుకేలనో
చేదు చిరక త్రాగను అందించిరి (2)
ఆత్మ దాహము తీర్చ బలి అయ్యెను
సిలువొందెను        ||కనలేను||

తన ఆత్మ తండ్రికి సమర్పించెను
తనదంతా తండ్రితో చాచుంచెను (2)
తలవంచి తండ్రిలో తుది చేరెను
కను మూసెను        ||కనలేను||

లోకాలనేలేటి ప్రభువేలనో
ఈ ఘోర మరణంబు గురి అయ్యెనో (2)
నా పాప బ్రతుకేల ప్రభువేడ్చెనో
సిలువేసెనో        ||కనలేను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ధ్యానించుచుంటిమి

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Telugu Lyrics


ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన – విలువైన నీ మాటలు
ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు (2)
మోక్షమునకు చేర్చు బాటలు
పరిశుద్ధతలో పరిపూర్ణుడా – ఉన్నత గుణ సంపన్నుడా (2)
శ్రేష్టుడా…                                  ||ధ్యానించుచుంటిమి||

తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు
వీరిని దయతో క్షమించుము (2)
అని ప్రార్ధన చేసావా బాధించే వారికి (2)
శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2)           ||పరిశుద్ధతలో||

నేడే నాతోను పరదైసులో నీవుందువు
నిశ్చయముగ ప్రవేశింతువు (2)
అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి (2)
అధికారముతో పాపిని రక్షించి (2)           ||పరిశుద్ధతలో||

ఇదిగో నీ తల్లి ఇతడే నీ కుమారుడు
కష్టము రానీయకు ఎప్పుడు (2)
అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను (2)
తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను (2)           ||పరిశుద్ధతలో||

దేవా నా దేవా నను విడనాడితివెందుకు
చెవినీయవె నా ప్రార్థనకు (2)
అని కేక వేసావా శిక్షననుభవిస్తూ (2)
పరలోక మార్గం సిద్ధము చేస్తూ (2)           ||పరిశుద్ధతలో||

సర్వ సృష్టికర్తను నే దప్పిగొనుచుంటిని
వాక్యము నెరవేర్చుచుంటిని (2)
అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు (2)
జీవ జలమును అనుగ్రహించుటకు (2)           ||పరిశుద్ధతలో||

సమాప్తిమయ్యింది లోక విమోచన కార్యం
నెరవేరెను ఘన సంకల్పం (2)
అని ప్రకటన చేసావా కల్వరి గిరి నుంచి (2)
పని ముగించి నీ తండ్రిని ఘనపరచి (2)           ||పరిశుద్ధతలో||

నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని
నీ యొద్దకు వచ్చుచుంటిని (2)
అని విన్నవించావా విధేయత తోటి (2)
తల వంచి తృప్తిగ విజయము చాటి (2)           ||పరిశుద్ధతలో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

చూచితి నీ మోముపై

పాట రచయిత: ఎం జ్యోతి రాజు
Lyricist: M Jyothi Raju

Telugu Lyrics

చూచితి నీ మోముపై – చిందిన రక్తము
తలచితి నీ ప్రేమను – మదికి అందనిదాయె
రాజ మకుటము మారిపోయే – ముళ్ల మకుటముగా
సింహాసనమే సిలువగ మారి – శిక్షకు గురియాయేగా
పరిమితి లేని కలువరి ప్రేమను – పరిహాసము చేసిరే
ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే – చాలని నీ చెంత చేరితిని
యేసు..                           ||చూచితి||

నేలపై ఒలికిన నీ రక్తధారలే – ప్రతి పాపిని కడిగెను
ఆ రక్తధారలే పాపికి మార్గమై – పరముకు ప్రవహించెను (2)
మట్టి దేహమును – మహిమగ మార్చుటకు (2)
మాపై నీకున్న సంకల్ప ప్రేమను – పరిహాసము చేసిరే (2)
యేసు..                           ||చూచితి||

సిలువలో చిందిన రక్తపు జల్లులు – ప్రతి రోగిని తాకెను
చితికిన దేహమున ఒలికిన రుధిరము – పరమౌషధమాయెను (2)
మా రోగములను – భరియించుటకు (2)
మాపై నీకున్న ఎనలేని ప్రేమను – అవహేళన చేసిరే (2)
యేసు..                           ||చూచితి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ముళ్ళ కిరీటము

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics


ముళ్ళ కిరీటము రక్త ధారలు
పొందిన గాయములు జాలి చూపులు
చల్లని చేతులు పరిశుద్ధ పాదములు
దిగిన మేకులు వేదన కేకలు
ఎంత గొప్పది యేసు నీ హృదయము
మా కోసమే ఇన్ని బాధలా
ఇంత ప్రేమ ఏలనో

సన్నుతింతుము సత్యవంతుడా
నిండు భక్తితో ఉప్పొంగు కృతజ్ఞతతో
యేసు నీ త్యాగము మరువలేనిది
మా జీవితాలకు విలువ నిచ్చినది

ముళ్ళ కిరీటము రక్త ధారలు
పొందిన గాయములు జాలి చూపులు

లోక పాపము సిలువ భారము
జనుల పక్షము ఘోర మరణము
తండ్రి కార్యము పునరుద్దానము
ఉచిత దానము నిత్య జీవము
యేసు నీ కృప మాకు చాలును
నీ నీతియే మాకు సంపద
నిన్ను కీర్తించుట దీవెన

మా విమోచకా మా రక్షణాధారమా
అందుకోవయా మా స్తుతి అర్పణములు
వందనం ప్రభు వందనం నీకు
నీ ప్రాణదానముకై సదా వందనం

లోక పాపము సిలువ భారము
జనుల పక్షము ఘోర మరణము
తండ్రి కార్యము పునరుద్దానము
ఉచిత దానము నిత్య జీవము

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

మహాత్ముడైన నా ప్రభు

పాట రచయిత: ఐజక్ వాట్స్
అనువాదకుడు: హెచ్ హెన్రీ డేవిస్
Lyricist: Isaac Wats
Translator: H Henry Davis

Telugu Lyrics


మహాత్ముడైన నా ప్రభు
విచిత్ర సిల్వ జూడ నా
యాస్తిన్ నష్టంబుగా నెంచి
గర్వం బణంగ ద్రొక్కుదున్

నీ సిల్వ గాక యో దేవా
దేనిన్ బ్రేమింప నీయకు
నాన్నాహరించు సర్వమున్
నీ సిల్వకై త్యజింతును

శిరంబు పాద హస్తముల్
సూచించు దుఃఖ ప్రేమలు
మరెన్నడైన గూడెనా
విషాద ప్రేమ లీ గతిన్?

ముండ్లన్ దుర్మార్గులల్లిన
కిరీట మేసు కుండినన్
ఈ భూ కిరీటములన్ని
దానం దూగంగ జాలు నే?

లోకంబు నే నేర్పించిన
నయోగ్యమైన యీవి యౌ
వింతైన యేసు ప్రేమకై
నా యావజ్జీవ మిత్తును

రక్షింప బడ్డ లోకమా
రక్షింప జావు బొందిన
రక్షకు-డేసు నిన్ సదా
రావంబు తోడ గొల్వుమా

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మోయలేని భారమంత

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics


మోయలేని భారమంత సిలువలో మోసావు
నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు (2)
అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు
మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు
నాదు గతిని మార్చావు – (2)

కడలి పై నడిచిన పాదాలు
సిలువ బరువుకు తడబడి పోయే
స్వస్థతలు చూపిన హస్తములు
సిలువలో శీలలతో వ్రేళాడే (2)
ఇంత ఘోరము మోపిన నేరము
నేను చేసిన పాప భారము (2)        || మోయలేని ||

జయము నీకని పలికిన జనము
మహిమ ఏదని నిను నిలదీసిరి
పాపములు క్షమియించిన నిన్ను
పాపివని పలుమారులు తెలిపిరి (2)
తాకినంతనే మహిమ నొసగిన
నీదు వస్త్రము చీట్ల పరము (2)        || మోయలేని ||

దైవ సుతుడవు అయినా గాని
దొంగలతో దోషిగా నిను చేర్చిరి
మధుర వాక్యము నేర్పిన నోటికి
చేదు చిరకతో దాహము తీర్చిరి (2)
ఇంత జరిగిన ఎంత కరుణ
వదలవేమయ నీ క్షమాపణ (2)        || మోయలేని ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసయ్య పాదాలు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్య పాదాలు బంగారు పాదాలు (2)
ఎండల్లో కందాయయ్యా
అయ్యయ్యయ్యో రాళ్ళల్లో చిట్లాయయ్యా (2)       ||యేసయ్య||

మండేటి ఎండల్లో కాడి మోసాడయ్యా (2)
నడలేక తూలాడయ్యా
అయ్యయ్యయ్యో నేల కూలాడయ్యా (2)       ||యేసయ్య||

కొయ్యపై కాళ్ళు పెట్టి
సీలను కొట్టిరయ్యా (2)
పాదాలు అదిరాయయ్యా
అయ్యయ్యయ్యో పాదాలు చితికాయయ్యా (2)       ||యేసయ్య||

ఈ ప్రేమమూర్తి
పాదాలు నమ్ముకుంటే (2)
పాపాలు పోతాయయ్యా
అయ్యయ్యా నీ శాపాలు తీరుతాయయ్యా
పాపాలు పోతాయయ్యా
అయ్యయ్యా నీ రోగాలు పోతాయయ్యా       ||యేసయ్య||

రాతి గుండెలను మాంసపు గుండెలుగా
మార్చేందుకు వచ్చాడయ్యా
ప్రాణము పెట్టాడయ్యా

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అప్పగింపబడిన రాత్రి

పాట రచయిత: పడిదెం అనంత రావు
Lyricist: Padidem Anantha Rao

Telugu Lyrics

అప్పగింపబడిన రాత్రి
చెప్ప సాగే శిష్యులతో (2)
చెప్పరాని దుఃఖముతో
తప్పదు నాకీ మరణమనెను (2)       ||అప్పగింప||

రొట్టె విరచి ప్రార్ధించి
నిట్టూర్పు విడచి ఇది నా దేహం (2)
పట్టుదలతో నేనొచ్చుఁ వరకు
ఇట్టులనే భుజించుడనెను (2)       ||అప్పగింప||

ద్రాక్షా రస గిన్నెను చాపి
వీక్షించుడిదియే నా రక్తం (2)
రక్షణార్థం దీని త్రాగి
మోక్ష రాజ్యం చేరుడనెను (2)       ||అప్పగింప||

రాతివేత దూరాన
చేతులెత్తి ప్రభు మోకరించి (2)
నా తండ్రి నీ చిత్తమైతే
ఈ పాత్రన్ తీసి వేయుమనెను (2)       ||అప్పగింప||

ఇదిగో వచ్చె తుది ఘడియ
హృదయ బాధ హెచ్చెను (2)
పదిలపరచు-నట్లు తండ్రిన్
మదిలో వదలక ప్రార్ధించుడనెను (2)       ||అప్పగింప||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఎనలేని ప్రేమ

పాట రచయిత: సృజిత్ మనూక
Lyricist: Srujith Manuka

Telugu Lyrics

ఎనలేని ప్రేమ నాపైన చూపి
నరునిగా వచ్చిన నా దేవా
నా పాపము కొరకు రక్తమును కార్చి
ప్రాణమునర్పించిన నా దేవా (2)
ఊహించగలనా వర్ణింప తగునా
ఆ గొప్ప సిల్వ త్యాగము (2)
ఆ గొప్ప సిల్వ త్యాగము         ||ఎనలేని||

కొరడాలతో హింసించినా
మోముపై ఉమ్మి వేసినా (2)
చెమట రక్తముగా మారినా (2)          ||ఊహించగలనా||

ముళ్ల కిరీటముతో మొత్తినా
బల్లెముతో ప్రక్క పొడచినా (2)
పరలోక తండ్రియే చేయి విడచినా (2)          ||ఊహించగలనా||

English Lyrics

Audio

దోషివా ప్రభూ

పాట రచయిత: జాషువా షేక్
Lyricist: Joshua Shaik

Telugu Lyrics


సర్వమానవ పాపపరిహారార్థమై
సిలువలో వ్రేలాడిన శ్రీ యేసునాధా – (2)

దోషివా…. ప్రభూ…. నువు దోషివా
నీ విధేయతకు నా అవిధేయతకు
మధ్యలో నలిగి, వ్రేలాడిన నిర్దోషివా (2)
దోషివా…. ప్రభూ…. నువు దోషివా

ఘోరంబుగా నే చేసిన నేరాలకు
నువు పొందిన మరణ శిక్ష
నే నడచిన వక్ర మార్గాలకు
నువు పొందిన సిలువ యాతన (2)
కలువరి గిరిలో ఆ ఘోర యాత్ర (2)
నే పొందిన రక్షణా పాత్ర (2)      ||దోషివా||

నే వేసిన తప్పటడుగులకు
నీవు కార్చిన రక్త పు మడుగులూ
నే చేసిన కపటంబులకు
నీవు పొందిన కొరడా దెబ్బలు (2)
సంపూర్ణ సిద్ది నొసగితివే నాకు (2)
ప్రేమించితివే నన్ను (2)      ||దోషివా||

తులువలలో ఓ తులువగా నున్న
నా పై నీ దయగల చూపు
పరలోకములో నీతో నుండ
భాగ్యంబును నాకు నిచ్చినదే (2)
తుది వరకు నీ దివ్య ప్రేమను పంచ (2)
నీ తుది శ్వాస వీడనంటివే (2)      ||దోషివా||

English Lyrics

Audio

HOME