పేతురు వలె నేను

పాట రచయిత: జాస్పర్ కునపో
Lyricist: Jasper Kunapo

Telugu Lyrics

ఆరాధ్యుడవు నీవే ప్రభు
ఆనందముతో ఆరాధింతును (2)
అత్యున్నత ప్రేమను కనుపరచినావు
నిత్యము నిను కొనియాడి కీర్తింతును (2)        ||ఆరాధ్యుడవు||

పేతురు వలె నేను ప్రభునకు దూరముగా
పనులతో జనులతో జతబడి పరుగెత్తగా (2)
ప్రయాసమే ప్రతిక్షణం ప్రతి నిమిషం పరాజయం
గలిలయ తీరమున నన్ను గమనించితివా (2)        ||ఆరాధ్యుడవు||

ప్రభురాకడ నెరిగి జలజీవరాసులు
తీరము చేరిరి కర్తను తేరి చూడగా (2)
పరుగెత్తెను పలు చేపలు ప్రభు పనికై సమకూడి
సంతోషముతో ఒడ్డున గంతులేసెను (2)        ||ఆరాధ్యుడవు||

నిన్నెరుగను అని పలికి అన్యునిగా జీవించితి
మీనముతో భోజనము సమకూర్చితివా (2)
ఆచేపల సమర్పణ నేర్చితి నిను వెంబడింతు
అద్వితీయ దేవుడవు నీవే ప్రభు (2)        ||ఆరాధ్యుడవు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అంటరాని వాడవంటు

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics

అంటరాని వాడవంటు నన్ను
ఊరు బైటకు త్రోసి వేసిరి
దేహమంతా కుళ్లిపోయి – దుర్వాసనతో నిండిపోయే
అయిన వారు కానరాక – భుజము తట్టే వారు లేక
కంటి నిండా నిదుర పొక – ఒంటరిగ జీవించలేక
మరణమును బ్రతిమాలుకున్నా…
మరణమును బ్రతిమాలుకున్నా – అదియు నన్ను ముట్టలేదు
చావలేక బ్రతుకలేక విసికిపోయాను – నేను అలసిపోయాను
నీ దరికి చేరాను – నిన్నే నమ్ముకున్నాను
యేసు.. యేసు.. యేసు నా తట్టు తిరగవా
యేసు.. యేసు.. యేసు నా గోడు వినవా      ||అంటరాని||

నిలిచిపోయావు నా కేక వినగానే
కదలిపోయావు నా స్థితిని చూడగనే
నీ కడుపులోని దుఖమును నీ ముఖముపై చూసి
నేను కరిగిపోయాను
నీ కనికరము చూసి – కన్నీటితో తడిసిపోయాను
యేసు.. యేసు.. యేసు నీకెంత జాలి
చాలు.. చాలు.. చాలు నీ దయయే చాలు      ||అంటరాని||

నన్ను తాకావు నీ చేతులను చాపి
కుష్టు రోగము నా దేహము పైన ఉండగనే
నా గుండె లోపల మండుచున్న కోరికను చూసి
నన్ను ముట్టుకున్నావు
ఆ స్పర్శకొరకే కదా నే తపియించి పోయాను
యేసు.. యేసు.. యేసు నీలా ఉందురెవరు
చాలు.. చాలు.. చాలు నీ స్పర్శ చాలు      ||అంటరాని||

స్వస్థపరిచావు శుద్దునిగా చేసావు
మురికి కూపము నుండి నన్ను లేవనెత్తావు
నా తలను పైకెత్తుకొని బ్రతికే తరుణమిచ్చావు
నాకు బ్రతుకు నిచ్చావు
నిను ఆశ్రయించి నిరాశచెందు నరులు ఎవ్వరు
యేసు.. యేసు.. యేసు దండములు నీకు
చాలు.. చాలు.. నాకింక నీవే చాలు      ||అంటరాని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నూతన హృదయము

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics

నూతన హృదయము నూతన స్వభావము
నూతన ప్రారంభం నాకు దయచేయుము
చెదరిన బ్రతుకును పగిలిన గుండెను
నలిగిన మనస్సును నూతన పరచుము
యేసు నీవే నన్ను సృజియించిన వాడవు
నా బలహీనతలన్ని యెరిగియున్నావు
రాతి గుండెను నాలో తీసివేయుము
అతి మెత్తని హృదయము దయచేయుము         ||నూతన హృదయము||

జీవమును వదులుకుని వెలుపలకు నే పారిపోతిని
పాపములో భోగమును ఆశించి నే మోసపోతిని
నా దేహం నా హృదయం వ్యసనముతోనే నిండిపోయెను
హీనముగా దిగజారి ఘోరముగా నే కృంగిపోతిని
నిన్ను విడచి నే క్షణమైనా బ్రతుకలేక
వెనుతిరిగి నీ చెంతకు వచ్చుచున్నాను
శుద్ధజలమును నాపై వెదజల్లుము
హిమము కంటెను తెల్లగా కడిగివేయుము         ||నూతన హృదయము||

నా పాపం అపరాధం నానుండి దూరము చేయుదువు అని
నా భయము అవమానం బిడియమును తొలగించి వేతువని
నా గతము జ్ఞాపకము నీ మదిలో ఇక దాచుకోవు అని
నిన్నెరిగి ధైర్యముగా నీ ముందు నే నిలబడియున్నాను
నీ శరణు కోరువారిని త్రోసివేయవు
కృపగల మహాదేవ నన్ను మన్నించుము
సదా కృతజ్ఞత స్తుతులు నీకే అర్పింతును
సర్వ మహిమ ప్రభావము నీకే చెల్లును         ||నూతన హృదయము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఏముంది నాలోనా

పాట రచయిత: ప్రతాప్ చిలమకూరు
Lyricist: Prathap Chilamakuru

Telugu Lyrics

ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు
ఏ అర్హతా లేని నన్ను ఎందుకు ప్రత్యేకించావు (2)
ఏముంది నాలోనా – ఏమైనా ఇవ్వగలనా (2)         ||ఏ యోగ్యత||

మలినమైన దేహం
మార్పులేని మనస్సు
మనిషిగానే చేయరాని
కార్యములే చేసినానే (2)        ||ఏముంది||

పుట్టుకలోనే పాపం
పాపులతో సహవాసం
పలుమారులు నీ హృదయమును
గాయపరచితినయ్యా (2)        ||ఏముంది||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

క్షమాపణ దొరికేనా

పాట రచయిత: ప్రతాప్ చిలమకూరు
Lyricist: Prathap Chilamakuru

Telugu Lyrics

క్షమాపణ దొరికేనా (2)
చిట్ట చివరి.. అవకాశం నాకు దొరికేనా (2)
యేసయ్యా… యేసయ్యా…

కక్కిన కూటికై – తిరిగిన కుక్కలా
ఎన్నో మారులు తిరిగితినయ్యా (2)
అయినా కూడా నీ కృప చూపి
ఆదరించిన అద్వితీయుడా (2)
ఆదరించిన అద్వితీయుడా     ||యేసయ్యా||

అడిగే అర్హత లేకపోయినా
నీ ప్రేమను బట్టి అడుగుతు ఉన్నా (2)
తల్లి మరచినా మరువని దేవుడా
నన్ను విడువని యేసునాథుడా (2)
నన్ను విడువని యేసునాథుడా     ||యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నన్ను నీవలె నిర్మించినను

పాట రచయిత: దీవెనయ్య
Lyricist: Deevenaiah

Telugu Lyrics


నన్ను నీవలె నిర్మించినను
కోల్పోతి దేవా నీ రూపమును
హేయ క్రియలతో సిలువేసినను
నాపై నీ కృపను తొలగించవెందుకు
నిను బాధించినా భరియించితివా
నా పాపం జ్ఞాపకమే రాలేదా (2) ||నన్ను నీవలె||

ఎరిగి ఎరిగి చెడిపోతిని
తెలిసి తెలివిగా తప్పిపోతిని (2)
బ్రతికున్న శవమునై నేనుంటిని
అహము ముదిరి పది లేవలేకపోతిని (2) ||నన్ను నీవలె||

భయభక్తులు లేని వెర్రివాడనై
కుంపటి ఒడిలో పెట్టుకుంటిని (2)
ఒక పూటకూటికై ఆశపడితిని
వ్యభిచారినై వెక్కివెక్కి ఏడ్చుచుంటిని (2) ||నన్ను నీవలె||

సిల్వలో నీ శ్రమ చూడకుంటిని
కల్వరి ప్రేమను కానకుంటిని (2)
నిన్ను సిలువ వేయమని కేకలేసితి
అయినా క్షమించి కౌగిలించి ముద్దుపెట్టుకుంటివా (2) ||నన్ను నీవలె||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీవు లేనిదే నేను లేను

పాట రచయిత: జి ఎస్తేర్ రాణి
Lyricist: G Esther Rani

Telugu Lyrics

నీవు లేనిదే నేను లేను ప్రభువా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైనా (2)
నీవు లేకుంటే నా బ్రతుకే శూన్యం (2)
మరువకయ్యా నన్ను ఏ క్షణము దేవా (2)
నీ ప్రేమతో నన్ను లాలించు ప్రతి క్షణము (2)          ||నీవు||

గమ్యమును ఎరుగక నేను వెతలు పాలైన వేళ
తీరాన్ని దాటలేని నావ నేనైన వేళ (2)
నా గమ్యం నీవైతి – ఆ గమ్యం సిలువాయే (2)
ఆ సిలువే నాకు శరణం
నా పాప పరిహారం (2)          ||నీవు||

అపజయమే నాదు బ్రతుకును విషాదముగా మార్చిన వేళ
జీవించుటకాశ లేక మరణాన్ని కోరిన వేళ (2)
నా ఆశ నీవైతి – ఆ ఆశ సిలువాయే (2)
ఆ సిలువే నాకు నిరతం
నా జీవిత చిరుదీపం (2)          ||నీవు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీ సన్నిధిలో ఈ ఆరాధనను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీ సన్నిధిలో ఈ ఆరాధనను
స్వీకరించుము నా ప్రభువా (2)
నా హృదయములో నీ ఆత్మ బలమును
నింపుము నాపై యేసయ్యా        ||నీ సన్నిధిలో||

ఆవిరివంటి వాడను నేను
మేఘ స్తంభమై నిలిచావు (2)
చల్లని నీ ప్రేమ గాలిని సోకించి (2)
వర్షముగా నను మార్చావు – మార్చావు          ||నీ సన్నిధిలో||

మోడులా మిగిలిన నాకై
సిలువ మ్రానిపై వ్రేళాడి (2)
నీ రక్తముతో నను ప్రోక్షించి (2)
నా మరణ శాపం తొలగించావు – తొలగించావు       ||నీ సన్నిధిలో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దేవా నీ ఆత్మను

పాట రచయిత: డినో
Lyricist: Dino

Telugu Lyrics


దేవా నీ ఆత్మను నా నుండి
నువ్వు తీసివేయకుమా
నీ సన్నిధిలో నుండి నన్ను
నువ్వు త్రోసివేయకుమా (2)
నీ దృష్టి యెదుటనే
చెడుతనము చేసియున్నాను
పాపిని అని ఒప్పుకొని
క్షమాపణ కోరుచున్నాను
నీవే నీవే కరుణామయుడవు నీవే
నీవే నీవే ప్రేమామయుడవు నీవే     ||దేవా||

నీ వెలుగుతో నను నింపిననూ
చీకటినే కోరుకున్నాను (2)
నా కళ్ళు నీవు తెరిచిననూ
గ్రుడ్డివాడిలా నడుచుకున్నాను      ||నీ దృష్టి||

నీ ఆత్మతో నను నింపిననూ
శరీరమునే తృప్తిపరిచాను (2)
ఆత్మచేత నడిపించబడక
శరీరాశలలో మునిగాను       ||నీ దృష్టి||

English Lyrics

Audio

ఎంత కృపామయుడవు

పాట రచయిత: గొట్టిపాటి యేసుదాసు
Lyricist: Gottipati Yesudasu

Telugu Lyrics

ఎంత కృపామయుడవు యేసయ్యా
(నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా (2)
నలిగితివి వేసారితివి (2)
నాకై ప్రాణము నిచ్చితివి (2)     ||ఎంత||

బండలాంటిది నాదు మొండి హృదయం
ఎండిపోయిన నాదు పాత జీవితం (2)
మార్చినావు నీ స్వాస్థ్యముగా (2)
ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము (2)     ||ఎంత||

కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ
ఈ లోకము నన్ను విడచిననూ (2)
మరువలేదు నన్ను విడువలేదు (2)
ప్రేమతో పిలచిన నాథుడవు (2)     ||ఎంత||

కరువులు కలతలు కలిగిననూ
లోకమంతా ఎదురై నిలచిననూ (2)
వీడను ఎన్నడు నీ సన్నిధి (2)
నీ త్యాగమునే ధ్యానించెదన్ (2)     ||ఎంత||

English Lyrics

Audio

HOME