ఆనందమే పరమానందమే

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

ఆనందమే పరమానందమే
ఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2)
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన
అక్షయుడా నీకే స్తోత్రము (2)       ||ఆనందమే||

పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే
జీవ జలములు త్రాగనిచ్చితివే (2)
నా ప్రాణమునకు సేదదీర్చితివి
నీతియు శాంతియు నాకిచ్చితివే (2)       ||ఆనందమే||

గాఢాంధకారము లోయలలో నేను
సంచరించినా దేనికి భయపడను (2)
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును
అనుదినం అనుక్షణం కాపాడునే (2)       ||ఆనందమే||

నా శత్రువుల ఎదుటే నీవు
నాకు విందును సిద్ధము చేసావు (2)
నీతో నేను నీ మందిరములో
నివాసము చేసెద చిరకాలము (2)       ||ఆనందమే||

English Lyrics

Audio

స్తోత్రబలి స్తోత్రబలి

పాట రచయిత: ఎస్ జె బెర్క్మన్స్
Lyricist: S J Berchmans

Telugu Lyrics


స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా
శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే (2)

నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2)
నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3)          ||స్తోత్రబలి||

రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2)
మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3)          ||స్తోత్రబలి||

నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2)
ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3)          ||స్తోత్రబలి||

వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు (2)
యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3)          ||స్తోత్రబలి||

English Lyrics

Audio

ప్రభు సన్నిధిలో ఆనందమే

పాట రచయిత: ఫిలిప్ & షారోన్
Lyricist: Philip & Sharon

Telugu Lyrics

ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం
ప్రభు ప్రేమలొ నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం (2)
హాల్లెలూయా హాల్లెలూయా
హాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా (2)        ||ప్రభు||

ఆకాశము కంటె ఎత్తైనది
మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2)
ఆ సన్నిధే మనకు జీవమిచ్చును
గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2)        ||ప్రభు||

దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు
ధరియింప చేయును ప్రభు సన్నిధి (2)
నూతనమైన ఆశీర్వాదముతో
అభిషేకించును ప్రేమానిధి (2)        ||ప్రభు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

రాజా నీ సన్నిధిలోనే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రాజా నీ సన్నిధి-లోనే
దొరికెనే ఆనందమానందమే
జీవా జలముతో పొంగే హృదయమే
పాడే స్తుతియు స్తోత్రమే
శ్రమల వేళా నీ ధ్యానమే
నా గానం ఆధారం ఆనందమే
నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందగన్ – భాగ్యమే
నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందితిన్ – స్తోత్రమే         ||రాజా||

మరల రాని కాలమల్లె – తరలిపోయే నాదు దోషం
నిలువదాయె పాప శాపాల భారం (2)
నీలో నిలిచి ఫలియించు తీగనై
ఆత్మ ఫలము పొందితినే         ||నిలువని||

తెలియరాని నీదు ప్రేమ – నాలో నింపే ఆత్మ ధైర్యం
జీవ జలమై తీర్చెనే ఆత్మ దాహం (2)
నీకై నిలిచి ఇలలోన జీవింప
ఆత్మ ఫలము పొందితినే         ||నిలువని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

ప్రేమించు దేవుడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు
పాలించు దేవుడు – యేసు దేవుడు
పాటలు పాడి ఆనందించెదం
ఆహా ఎంతో ఆనందమే (2)       ||ప్రేమించు||

తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు
ప్రతి అవసరమును తీర్చు దేవుడు (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు
తోడు నీడగా నన్ను కాపాడును (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు
సర్వ కాలమందు జయమిచ్చును (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు
అంతము వరకు చేయి విడువడు (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

ఆవేదన నేనొందను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఆవేదన నేనొందను
అవమానముతో నే కృంగను
ఆనందమే నా జీవితం (2)
నా యేసుని బాహూవులో
హల్లెలూయా హల్లెలూయా (2)
హల్లెలూయా ఆనందమే      ||ఆవేదన||

నాకేమి కావలెనో నేనేమి కోరెదనో (2)
నా ఊహలకు ఊపిరి పోసి
కోరిన ఈవుల నొసగిన ఉన్నతమైన అద్భుతమైన
నీ కార్యములు ఆశ్చర్యమే (2)       ||హల్లెలూయా||

కష్టాల కెరటాల సుడిగుండమందున (2)
కలవరమొంది కృంగిన నన్ను
కరుణతో పరమున చేర్చి శిఖరముపైన నిలిపిన దేవా
కృపలన్నియు కురిపించితివి (2)     ||హల్లెలూయా||

English Lyrics

Audio

 

 

ఆహా ఆనందమే

పాట రచయిత: మేరీ విజయ్ నన్నేటి
Lyricist: Mary Vijay Nanneti

Telugu Lyrics

ఆహా ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో (2)
ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో (2)       ||ఆహా||

యెషయా ప్రవచనము నేడు రుజువాయే
జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2)      ||ఆనందమే||

మీకా ప్రవచనము నేడు రుజువాయే
ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2)      ||ఆనందమే||

తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2)          ||ఆనందమే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME