నా దేవ ప్రభువా

పాట రచయిత: శారా ఫ్లవర్ ఆడమ్స్
అనువదించినది: బర్నార్డ్ లూకాస్
Lyricist: Sara Flower Adams
Translator: Bernard Lucas

Telugu Lyrics


నా దేవ ప్రభువా నీ చెంతను
సదా వసింపను నా కిష్టము
ఏవైనా శ్రమలు తటస్థమైనను
నీ చెంత నుందును నా ప్రభువా

ప్రయాణకుండను నడవిలో
నా త్రోవ జీకటి కమ్మినను
నిద్రించుచుండగా స్వప్నంబునందున
నీ చెంత నుందును నా ప్రభువా

యాకోబు రీతిగా ఆ మెట్లను
స్వర్గంబు జేరను జూడనిమ్ము
నీ దివ్య రూపము ప్రోత్సాహపర్చగా
నీ చెంత నుందును నా ప్రభువా

నే నిద్రలేవగా నా తండ్రి నే
నీకుం గృతజ్ఞత జెల్లింతును
నే చావునొందగా ఇదే నా కోరిక
నీ చెంత నుందును నా ప్రభువా

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మహాత్ముడైన నా ప్రభు

పాట రచయిత: ఐజక్ వాట్స్
అనువాదకుడు: హెచ్ హెన్రీ డేవిస్
Lyricist: Isaac Wats
Translator: H Henry Davis

Telugu Lyrics


మహాత్ముడైన నా ప్రభు
విచిత్ర సిల్వ జూడ నా
యాస్తిన్ నష్టంబుగా నెంచి
గర్వం బణంగ ద్రొక్కుదున్

నీ సిల్వ గాక యో దేవా
దేనిన్ బ్రేమింప నీయకు
నాన్నాహరించు సర్వమున్
నీ సిల్వకై త్యజింతును

శిరంబు పాద హస్తముల్
సూచించు దుఃఖ ప్రేమలు
మరెన్నడైన గూడెనా
విషాద ప్రేమ లీ గతిన్?

ముండ్లన్ దుర్మార్గులల్లిన
కిరీట మేసు కుండినన్
ఈ భూ కిరీటములన్ని
దానం దూగంగ జాలు నే?

లోకంబు నే నేర్పించిన
నయోగ్యమైన యీవి యౌ
వింతైన యేసు ప్రేమకై
నా యావజ్జీవ మిత్తును

రక్షింప బడ్డ లోకమా
రక్షింప జావు బొందిన
రక్షకు-డేసు నిన్ సదా
రావంబు తోడ గొల్వుమా

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సంతోషించుడి యందరు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి
యొక వింతగు కీర్తన బాడ వచ్చితిని
సంతోషించుడి నాతో సంతోషించుడి       ||సంతోషించుడి||

అంధకార మయమైన భూమి నా
ద్యంతము వెలిగింప – దాని యా-వేశము దొలఁగింప
వందితుండు క్రీస్తేసు నాథుడు – వచ్చె బ్రకాశుండై
భూమికి నిచ్చె ప్రకాశంబు       ||సంతోషించుడి||

కాన నంధకారంబు దొలఁగఁ ప్ర
కాశించెను లెండు – మీరు ప్ర-కాశింపను రెండు
మానవులను సంతోష పర్చనై – మహిని నవతరించె
భక్తుల మనము సంతసించె       ||సంతోషించుడి||

మిన్ను నుండి సంతోషోదయము
మిగుల ప్రకాశించె – హృదయములఁ – దగుల ప్రకాశించె
మున్ను జేయబడిన వాగ్ధత్థము – తిన్నగ నెరవేరే
భక్తుల కన్ను లాస దీరె       ||సంతోషించుడి||

ప్రీతియైన నీ పండుగ గూర్చి
నూతన కీర్తనను – గలసికొని – నాతో పాడుచును
నీ తరి దూరస్థుల-కీ వార్తను – నే తీరును నైనఁ
దెలుపఁగ నాతురపడవలెను       ||సంతోషించుడి||

పాపులపై దేవునికి గలిగిన
ప్రబలమైన దయను – లోకమునఁ – జూపింపఁ గవలెను
జూపక పోయిన లోపము మనపై – మోపబడును నిజము
వేగము జూపుద మా పథము       ||సంతోషించుడి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మంగళమే యేసునకు

పాట రచయిత: పురుషోత్తము చౌదరి
Lyricist: Purushothamu Chaudhary

Telugu Lyrics


మంగళమే యేసునకు – మానుజావతారునకు (3)
శృంగార ప్రభువునకు (2)
క్షేమాధిపతికి మంగళమే           ||మంగళమే||

పరమ పవిత్రునకు – వర దివ్య తేజునకు (3)
నిరుపమానందునకు (2)
నిపుణ వేద్యునకు మంగళమే           ||మంగళమే||

దురిత సంహారునకు – వర సుగుణోదారునకు (3)
కరుణా సంపన్నునకు (2)
జ్ఞాన దీప్తునకు మంగళమే           ||మంగళమే||

సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు (3)
నిత్య స్వయంజీవునకు (2)
నిర్మలాత్మునకు మంగళమే           ||మంగళమే||

యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి (3)
సత్య పరంజ్యోతి యగు (2)
సార్వభౌమునకు మంగళమే           ||మంగళమే||

నర ఘోర కలుషముల – నురుమారంగ నిల (3)
కరుదెంచిన మా పాలి (2)
వర రక్షకునకు మంగళమే           ||మంగళమే||

పరమపురి వాసునకు – నర దైవ రూపునకు (3)
పరమేశ్వర తనయునకు (2)
బ్రణుతింతుము నిన్ను మంగళమే           ||మంగళమే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

పంపుము దేవా

పాట రచయిత: పులిపాక జగన్నాథము
Lyricist: Pulipaaka Jagannaathamu

Telugu Lyrics

పంపుము దేవా దీవెనలతో – పంపుము దేవా (2)
పంపుము దయ చేత పతిత పావన నామ
పెంపుగ నీ సేవ ప్రియమొప్ప నొనరింప         ||పంపుము||

మా సేవ నుండిన మా వెల్తు-లన్నియు (2)
యేసుని కొరకు నీ వెసఁగఁ క్షమియించుచు         ||పంపుము||

వినిన సత్యంబును – విమలాత్మ మది నిల్పి (2)
దినదినము ఫలములు దివ్యముగ ఫలియింప         ||పంపుము||

ఆసక్తితో ని-న్ననిశము సేవింప (2)
భాసురంబగు నాత్మ వాసి-కెక్కగ నిచ్చి         ||పంపుము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సంతోషముతో నిచ్చెడు వారిని

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సంతోషముతో నిచ్చెడు వారిని
నెంతో దేవుడు ప్రేమించెన్
వింతగ వలసిన-దంతయు నొసంగును
వినయ మనసుగల విశ్వాసులకును              ||సంతోషముతో||

అత్యాసక్తితో నధిక ప్రేమతో
నంధకార జను-లందరకు
సత్య సువార్తను జాటించుటకై
సతతము దిరిగెడు సద్భక్తులకు              ||సంతోషముతో||

వేద వాక్యమును వేరు వేరు గ్రా
మాదుల నుండెడు బాలురకు
సాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడి
సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు              ||సంతోషముతో||

దిక్కెవ్వరు లేకుండెడి దీనుల
తక్కువ లన్నిటి దీర్చుటకై
నిక్కపు రక్షణ – నిద్ధరలో నలు
ప్రక్కలలో బ్రక-టించుట కొరకై              ||సంతోషముతో||

ఇయ్యండీ మీ కీయం బడు నని
యియ్యంగల ప్రభు యే-సనెను
ఇయ్యది మరువక మదిని నుంచుకొని
యియ్యవలెను మన యీవుల నికను              ||సంతోషముతో||

భక్తి గలిగి ప్రభు పని కిచ్చుఁట బహు
యుక్త మటంచు ను-దారతతో
శక్తి కొలది మన భుక్తి నుండి యా
శక్తితో నిరతము నియ్య వలెను              ||సంతోషముతో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME