మారదయా నీ ప్రేమ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మారదయా నీ ప్రేమ
మార్పు రాదయా నీ ప్రేమలో (2)
ఎన్ని మారినా మారని ప్రేమ (2)
యేసయ్యా నాపై నీవు చూపుచుంటివా (2)      ||మారదయా||

నిరీక్షించుచుంటిని నీ రాకకై
వేగిరమే రమ్ము నను కొనిపోవుటకు (2)
అప్పటి వరకు మారదు
నాపై నీ ప్రేమ మారనే మారదు (2)      ||మారదయా||

(నాకు) ఆకాశమందు నీవు తప్ప లేరెవరు
నా శ్రమలలో నాకు నీవే జవాబు (2)
అప్పటి వరకు మారదు
నాపై నీ ప్రేమ మారనే మారదు (2)      ||మారదయా||

నీ మాటలయందే ఆశ యేసయ్యా
వాగ్ధానములు నాలో నెరవేర్చుమా (2)
అప్పటి వరకు మారదు
నాపై నీ ప్రేమ మారనే మారదు (2)      ||మారదయా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నన్ను నీవలె నిర్మించినను

పాట రచయిత: దీవెనయ్య
Lyricist: Deevenaiah

Telugu Lyrics


నన్ను నీవలె నిర్మించినను
కోల్పోతి దేవా నీ రూపమును
హేయ క్రియలతో సిలువేసినను
నాపై నీ కృపను తొలగించవెందుకు
నిను బాధించినా భరియించితివా
నా పాపం జ్ఞాపకమే రాలేదా (2) ||నన్ను నీవలె||

ఎరిగి ఎరిగి చెడిపోతిని
తెలిసి తెలివిగా తప్పిపోతిని (2)
బ్రతికున్న శవమునై నేనుంటిని
అహము ముదిరి పది లేవలేకపోతిని (2) ||నన్ను నీవలె||

భయభక్తులు లేని వెర్రివాడనై
కుంపటి ఒడిలో పెట్టుకుంటిని (2)
ఒక పూటకూటికై ఆశపడితిని
వ్యభిచారినై వెక్కివెక్కి ఏడ్చుచుంటిని (2) ||నన్ను నీవలె||

సిల్వలో నీ శ్రమ చూడకుంటిని
కల్వరి ప్రేమను కానకుంటిని (2)
నిన్ను సిలువ వేయమని కేకలేసితి
అయినా క్షమించి కౌగిలించి ముద్దుపెట్టుకుంటివా (2) ||నన్ను నీవలె||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీవు లేనిదే నేను లేను

పాట రచయిత: జి ఎస్తేర్ రాణి
Lyricist: G Esther Rani

Telugu Lyrics

నీవు లేనిదే నేను లేను ప్రభువా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైనా (2)
నీవు లేకుంటే నా బ్రతుకే శూన్యం (2)
మరువకయ్యా నన్ను ఏ క్షణము దేవా (2)
నీ ప్రేమతో నన్ను లాలించు ప్రతి క్షణము (2)          ||నీవు||

గమ్యమును ఎరుగక నేను వెతలు పాలైన వేళ
తీరాన్ని దాటలేని నావ నేనైన వేళ (2)
నా గమ్యం నీవైతి – ఆ గమ్యం సిలువాయే (2)
ఆ సిలువే నాకు శరణం
నా పాప పరిహారం (2)          ||నీవు||

అపజయమే నాదు బ్రతుకును విషాదముగా మార్చిన వేళ
జీవించుటకాశ లేక మరణాన్ని కోరిన వేళ (2)
నా ఆశ నీవైతి – ఆ ఆశ సిలువాయే (2)
ఆ సిలువే నాకు నిరతం
నా జీవిత చిరుదీపం (2)          ||నీవు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఎంత ప్రేమో నాపై

పాట రచయిత: దీవెనయ్య
Lyricist: Deevenaiah

Telugu Lyrics

ఎంత ప్రేమో నాపై యేసయ్యా
నేను ఎలాగ వివరించగలనయ్యా (2)
పెంట కుప్పలలో పడి ఉన్ననూ
నా మెడ మీద పడి ముద్దు పెట్టితివా
జిగట ఊబిలో నేను దిగి ఉన్ననూ
నా చేయి పట్టి నను పైకి లేపితివా       ||ఎంత||

దాహం తీర్చగలేని బావి అయిననూ
నేను పాపపు కుండను విడువకుంటిని (2)
నా పాపమంత క్షమించితివి (2)
జీవ జలమిచ్చి నన్ను చేర్చుకుంటివి (2)     ||ఎంత||

పందులున్న చోట నలిగి పడి ఉంటిని
నా పాపమే చుట్టు ముట్టి పట్టుకున్నది (2)
బుద్ధి వఛ్చి నేను నిన్ను ఆశ్రయించగా (2)
క్షమియించి నీ రక్షణిచ్చితివి (2)     ||ఎంత||

నరికిన కొమ్మ వలె ఎండిపోతిని
నా పాపాన్ని దాచి దాచి నశించితిని (2)
ఒప్పుకొనగా నాకు జీవమిచ్చితివి (2)
(ఎండిన) మొద్దును చిగురింపజేసితివి (2)     ||ఎంత||

English Lyrics

Audio

యేసయ్యా నిన్ను ప్రేమించువారు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్యా నిన్ను ప్రేమించువారు
బలమైన సూర్యుని వలెనె ఉదయించెదరు నిత్యము (2)
శాశ్వత కాలం నీతోనే నివసింతురు (2)       ||యేసయ్య||

నిన్ను ప్రేమించువారు
సకలమైన ఉపద్రవముల నుండి (2)
నిర్దోషులై కాపాడబడెదరు
అపవాది అగ్ని బాణముల నుండి (2)       ||యేసయ్య||

నిన్ను ప్రేమించువారు
దేవ దూతల జ్ఞానమును కలిగుందురు (2)
సమకూడి జరుగును సమస్తము
సదా మాతో ఉన్నందున (2)       ||యేసయ్య||

నిన్ను ప్రేమించువారిని
ఎవ్వరునూ ద్వేషించి జయమొందలేరు (2)
మా ప్రక్క నిలిచి సింహాల నోటి నుండి
తప్పించి బలపరచినావు (2)       ||యేసయ్య||

నిన్ను ప్రేమించువారి
చేతులకు వారి శత్రువుల నప్పగింతువు (2)
వారి కాలమంతట దేశమంతయు
నెమ్మదిగా నుండును (2)       ||యేసయ్య||

English Lyrics

Audio

మరణము నన్నేమి చేయలేదు

పాట రచయిత: దీవెనయ్య
Lyricist: Deevenaiah

Telugu Lyrics


మరణము నన్నేమి చేయలేదు
పరిస్థితి నన్నేమి చేయగలదు (2)
నీ కృప సమృద్ధిగా
నాపై నిలిపి తోడైయున్నావు (2)        ||మరణము||

నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే
నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2)
నను సీయోనులో చేర్చుకొనుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2)        ||మరణము||

నీ రూపమును పొంది జీవించుటే ఆశ
సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2)
విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2)        ||మరణము||

నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము
పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము (2)
నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2)        ||మరణము||

నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత
సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి (2)
దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2)        ||మరణము||

English Lyrics

Audio

నా కలవరములన్ని

పాట రచయిత: దీవెనయ్య
Lyricist: Deevenaiah

Telugu Lyrics


నా కలవరములన్ని కనుమరుగు చేసినావు
నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి కవిలెలో వ్రాసినావు – (2)
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||

నీ చేయి నన్ను సంరక్షించెను
నా శత్రువులు కీడు చేయలేకపోయిరి (2)
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||

యెహోవా యుద్ధములు చేయుటకు కృపనిచ్చితివి
శాశ్వతమైన సంతతిని స్వాస్థ్యముగా నాకిచ్చితివి (2)
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||

బ్రతుకు దినములన్నిటను అపాయమే రాదు
జీవిత కాలమంతా నాకు కీడే లేదు (2)
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2)       ||నా కలవరము||

నిన్ను నమ్మువారు సీయోనులో చేరి
నిత్యానందపు భాగ్యమును పొందెదరు (2)
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2)       ||నా కలవరము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME