యెహోవా నా కాపరి (లోయలలో)

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యెహోవా నా కాపరి – యేసయ్య నా ఊపిరి
నాకు లేమి లేదు – (2)
లోయలలో లోతులలో యెహోవా నా కాపరి
సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి      ||యెహోవా||

పచ్చికగల చోట్ల
నన్ను పరుండజేయును (2)
శాంతికరమగు జలముల కడకు
నన్ను నడిపించును (2)      ||లోయలలో||

గాఢాంధకారపు లోయలలో
సంచరించినను (2)
అపాయమేమియు కలుగదు నాకు
నీవు తోడుండగా (2)      ||లోయలలో||

తన నామమున్ బట్టి
నన్ను నీతి మార్గములో (2)
త్రోవ చూపి నడిపించును
సేదదీర్చును (2)      ||లోయలలో||

చిరకాలము నేను
యెహోవా సన్నిధిలో (2)
నివాసమొందెదను నేను
నిత్యము స్తుతియింతును (2)      ||లోయలలో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీవు లేని క్షణమైనా

పాట రచయిత: ఆర్ లాజరస్
Lyricist: R Lazarus

Telugu Lyrics

నీవు లేని క్షణమైనా ఊహించలేను
నీ కృప లేనిదే నేను బ్రతుకలేను (2)
నీవే నా కాపరి – నీవే నా ఊపిరి
నీవే నా సర్వము యేసయ్య
నీతోనే జీవితం – నేనే నీకంకితం
గైకొనుమో నన్ను ఓ దేవా…          ||నీవు లేని||

శ్రమలెన్నో వచ్చినా – శోధనలే బిగిసినా
నను ధైర్యపరిచె నీ వాక్యం
సంద్రాలే పొంగినా – అలలే ఎగసినా
నను మునగనీయక లేవనెత్తిన (2)
నీవే నా కండగా – నాతో నీవుండగా
భయమన్నదే నాకు లేదూ
సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా
వందనము నీకే ఓ దేవా…          ||నీవు లేని||

శత్రువులే లేచినా – అగ్ని ఆవరించినా
అవి నన్ను కాల్చజాలవుగా
దుష్టులే వచ్చినా – సింహాలై గర్జించినా
నాకేమాత్రం హాని చేయవుగా (2)
వెన్నుతట్టి బలపరచిన – చేయిపట్టి నడిపించిన
వేదనలే తొలగించిన యేసయ్యా
సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా
వందనము నీకే ఓ దేవా…          ||నీవు లేని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

తప్పిపోయిన గొర్రె

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

తప్పిపోయిన గొర్రె – తప్పిపోయిన మనుష్యుడా
యేసు ప్రేమ నీకు గురుతుందా
మంచి కాపరి యేసు – గొప్ప కాపరి యేసు
ప్రధాన కాపరి యేసు ఆత్మల కాపరి (2)

కపటము కలిగిన గొర్రె
ద్వేషము కలిగిన గొర్రె
ఐక్యత లేని గొర్రె
యేసు ప్రేమ గురుతుందా (2)
మందను వీడినావు – ఒంటరి అయ్యినావు (2)
యేసు రాజు నిన్ను వెతుకుచుండెను (2)        ||మంచి||

ప్రార్ధన చేయని మనుష్యుడా
వాక్యము వదలిన మనుష్యుడా
దేవుని మరచిన మనుష్యుడా
యేసు ప్రేమ గురుతుందా (2)
చాచిన చేతులతో నిన్ను ఆదరించెను యేసు (2)
మారు మనస్సు పొంది నీవు వెనకకు మారులుదువా (2)        ||మంచి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఇన్నాళ్లు తోడుగా

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Telugu Lyrics

ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు
ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2)
ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము
నిన్నే అనుసరింతుము జీవితాంతము (2)

ఘనులైన వారే గతియించగా
ధనమున్నవారే మరణించగా (2)
ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావు
మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2)      ||ఇశ్రాయేలు||

మా కంట కన్నీరు జారకుండగా
ఏ కీడు మా దరికి చేరకుండగా (2)
కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు
దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు (2)      ||ఇశ్రాయేలు||

English Lyrics

Audio

శిలనైన నన్ను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


శిలనైన నన్ను శిల్పివై మార్చావు
నాలోని ఆశలు విస్తరింపచేసావు (2)
నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)      ||శిలనైన||

మోడుబారిన నా జీవితం
నీ ప్రేమతోనే చిగురింపచేసావు (2)
నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2)
వర్ణించలేను లెక్కించలేను (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)      ||శిలనైన||

ఏ విలువలేని అభాగ్యుడను నేను
నీ ప్రేమచూపి విలువనిచ్చి కొన్నావు (2)
నాయెడల నీకున్న తలంపులు విస్తారం (2)
నీ కొరకే నేను జీవింతు ఇలలో (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)      ||శిలనైన||

ఊహించలేను నీ ప్రేమ మధురం
నా ప్రేమ మూర్తి నీకే నా వందనం (2)
నీ ప్రేమే నాకాధారం – నా జీవిత లక్ష్యం (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)      ||శిలనైన||

English Lyrics

Audio

యేసే నా ఊపిరి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసే నా ఊపిరి – యేసే నా కాపరి
నీ సేవే నాకు భాగ్యం
నీ సన్నిధే నాకు శరణం (2)
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన

పాపపు ఊబి నుండి
పైకెత్తిన నా ప్రభువా
చీకటి బ్రతుకునకు
వెలుగైన నా దేవా (2)
నీ ఆత్మయే నాకాదరణ
నిత్య జీవం నా నిరీక్షణ (2)     ||ఆరాధన||

పక్షి రాజు యవ్వనం వలె
నన్ను బలపరచిన దేవా
నూతన దర్శనము
నాకు కనపరచిన ప్రభువా (2)
విశ్వాసమే నాదు సూత్రం
ప్రార్ధనే నాకు విజయం (2)     ||ఆరాధన||

English Lyrics

Audio

దేవా నా దేవా

పాట రచయిత: జోయెల్ ఎన్ బాబ్
Lyricist: Joel N Bob

Telugu Lyrics


దేవా నా దేవా – నీవే నా కాపరి
నీ ప్రేమ నీ క్షమా – ఎంతో గొప్పది (2)
ఆరాధింతును హృదయాంతరంగములో
స్తుతించెదను నీ పాద సన్నిధిలో (2)
నీవే కదా దేవుడవు – (2)
దేవా యేసు దేవా (4)        ||దేవా||

పాపము నుండి విడిపించినావు
పరిశుద్ధుని చేసి ప్రేమించినావు (2)
నీవే కదా దేవుడవు – (2)
దేవా యేసు దేవా (4)        ||దేవా||

పరిశుద్ధాత్మను నాలో నింపావు
మట్టి దేహమును మహిమతో నింపావు (2)
నీవే కదా దేవుడవు – (2)
దేవా యేసు దేవా (4)        ||దేవా||

English Lyrics

Audio

ప్రార్ధన ప్రార్ధన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ప్రార్ధన ప్రార్ధన
ప్రభునితో సంభాషణ
ప్రార్ధనే ఊపిరి
ప్రార్ధనే కాపరి        ||ప్రార్ధన||

కన్నీటి ఉపవాస ప్రార్ధన
సాతాను శక్తులపై విజయము (2)
విరిగి నలిగిన విజ్ఞాపన – ప్రార్ధన
జయము నొసగును జీవితములు        ||ప్రార్ధన||

ఒలీవ కొండల ప్రార్ధన
స్వస్థత నొసగును వ్యాధి బాధలకు (2)
ప్రభువు నేర్పిన గెత్సేమనే ప్రార్ధన
ఆత్మల నొసగును సేవలో        ||ప్రార్ధన||

సిలువలో నేర్పిన ప్రార్ధన
ప్రేమను నేర్పును బ్రతుకున (2)
సాతాను చొరను చోటు లేనిది
పాపమును దరి రానీయనిది        ||ప్రార్ధన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీ నామం నా గానం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీ నామం నా గానం
నీ స్మరణే నా సర్వం (2)
నా కాపరి నీవే యేసయ్యా
నా ఊపిరి నీవే మెస్సయ్యా (2)        ||నీ నామం||

నీ వాక్యపు వెలుగులో నడిచెదనయ్యా
నీ రక్షణ గూర్చి నేను పాడెదనయ్యా (2)
సంగీత స్వరములతో స్తుతియి౦తును (2)
స్తుతుల౦దుకో నా యేసురాజా (2)        ||నీ నామం||

ఈ ఊపిరి నీవిచ్చిన కృపాదానమే
నన్నిలలో కాపాడే కాపరి నీవే (2)
నీ ఆత్మతో నన్ను శృతి చేయుమయా (2)
బ్రతుకంత నీ సేవ చేసెదనయ్యా (2)        ||నీ నామం||

English Lyrics

Audio

ఎంత మంచి కాపరి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఎంత మంచి కాపరి – యేసే నా ఊపిరి (2)
తప్పిపోయిన గొర్రె నేను
వెదకి కనుగొన్నావయ్యా
నీ ప్రేమ చూపినయ్య (2)           ||ఎంత||

సుఖములంటూ లోకమంటూ
నీదు భాగ్యం మరచితి
నీదు సన్నిధి విడచితి (2)
యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా
నా అతిక్రమములు క్షమియించి
జాలి చూపితివి (2)         ||ఎంత||

నా తలంపులు నా క్రియలు
నీకు తెలిసేయున్నవి
నీవే నిర్మాణకుడవు (2)
యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా
కృతజ్ఞతా స్తుతులు నీకు
సమర్పించెదను (2)         ||ఎంత||

English Lyrics

Audio

HOME