శరణం శరణం శరణం దేవా

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


శరణం శరణం శరణం దేవా – కరుణ నాథుడా (2)
కరుణ నాథుడా – ఈ తరుణమే ప్రభో (2)      ||శరణం||

పాపరహిత దేవకుమారా – శాపవాహకా (2)
శాపవాహకా – నిత్య కోప రహితుడా (2)      ||శరణం||

పరిపూర్ణ దేవుడా – నరావతారుడా (2)
నరావతారుడా – మా యేసు నాథుడా (2)      ||శరణం||

దయామయుండ క్రీస్తు యేసు – దాక్షిణ్య ప్రభువా (2)
దాక్షిణ్య ప్రభువా – బాహుళ్య దేవుడా (2)      ||శరణం||

నమ్మదగిన లోకరక్షకా – సర్వోపకారుడా (2)
సర్వోపకారుడా – సర్వశక్తిమంతుడా (2)      ||శరణం||

సాత్వికుండా – సర్వజనుల కాంక్షణీయుడా (2)
కాంక్షణీయుడా – వాత్సల్య దేవుడా (2)      ||శరణం||

రిక్తుడై తగ్గించుకొనిన – వినయపూర్ణుడా (2)
వినయపూర్ణుడా – మముగాచు దేవుడా (2)      ||శరణం||

సత్యవంతుడవు – మాదు నిత్యదేవుడా (2)
నిత్యదేవుడా – మా మంచి బోధకుడా (2)      ||శరణం||

సర్వలోక సృష్టికర్త – సత్యదేవుడా (2)
సత్యదేవుడా – మా నిత్యజీవమా (2)      ||శరణం||

ఎల్లరిలో శ్రేష్ఠుడా – మా వల్లభుండవు (2)
వల్లభుండవు హల్లెలూయ పాడెదం (2)      ||శరణం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

కరుణ చూపించుమా

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics

కరుణ చూపించుమా – యేసయ్య కన్నీరు తుడవగా
మహిమ కురిపించుమా – యేసయ్య స్వస్థతలు చూపగా (2)
నీ ప్రజలము అయిన మేము – మృత్యువు కోరలో చిక్కాము
ఏ దారియు కానరాక – నశియించి పోతున్నాము (2)
కరుణగల దేవుడు నీవు
కరుణించి కాపాడుమా (2)       ||కరుణ||

ఐగుప్తులో పది తెగుల్లలో – నీ ప్రజలను కాపాడితివి
గొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి – మృత్యువాత తప్పించితివి (2)
నీ నామము మదిలో నిలిపి – ఈ ఆపదలో వేడాము
నీ మహిమను తిరిగి చూడగా – నీ సన్నిధిలో చేరాము (2)     ||కరుణగల||

ఇశ్రాయేలు వారిగ మేము – నీ ఉనికిని ప్రశ్నించాము
నీ ప్రేమను రుచి చూసిననూ – మారాను కురిపించాము (2)
చెలరేగే సర్పము కాటు – మములను కబళించే వేళ
మాకు దిక్కు నీవేనంటూ – మోకరించి నిను వేడితిమి (2)     ||కరుణగల||

మరణమునే జయించి నీవు – సజీవుడిగా నిలిచావు
నిన్ను నమ్మి వేడిన చాలు – మా తప్పులు మరిచావు (2)
నేను జీవించితి గనుక – మీరును జీవించెదరన్న
వాగ్దానము నమ్మితిమయ్యా – నెరవేర్చుము మా యేసయ్య (2)     ||కరుణగల||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అరుణ కాంతి కిరణమై

పాట రచయిత: షాలేం ఇశ్రాయేలు
Lyricist: Shalem Israyel

Telugu Lyrics

అరుణ కాంతి కిరణమై
కరుణ చూప ధరణిపై
నరుని రూపు దాల్చెను
పరమ దేవ తనయుడు
అదే అదే క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్
ఇదే ఇదే క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్     ||అరుణ||

యజ్ఞ యాగాదులు – బలి కర్మకాండలు (2)
దోషంబులు కడుగలేవు
దోషుల రక్షింప లేవు (2)
పరిశుద్ధుని రక్తమునందే
పాపులకిల ముక్తి కలుగును
అందుకే.. అందుకే         ||అరుణ||

పుణ్య కార్యములు – మరి తీర్థయాత్రలు (2)
దోషంబులు కడుగలేవు
దోషుల రక్షింప లేవు (2)
పరిశుద్ధుని రక్తమునందే
పాపులకిల ముక్తి కలుగును
అందుకే.. అందుకే      ||అరుణ||

English Lyrics

Audio

చిందింది రక్తం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

చిందింది రక్తం ఆ సిలువ పైన
కారింది రుధిరం కలువరిలోన (2)
కరుణ చూప లేదే కసాయి మనుష్యులు
కనికరించలేదే మానవ లోకం (2)     ||చిందింది||

ఏదేనులో పుట్టిన ఆ పాపము
శాపముగా మారి మరణ పాత్రుని చేసె (2)
ఆ మరణమును తొలగించుటకు
మరణ పాత్రను చేబూనావా (2)
నా మరణమును తప్పించినావా        ||కరుణ||

చేసింది లోకం ఘోరమైన పాపం
మోపింది నేరం నీ భుజము పైనా (2)
యెరుషలేములో పారిన నీ రక్తము
ఈ లోక విమోచన క్రయధనము (2)
ఈ లోక విమోచన క్రయధనము        ||కరుణ||

నువ్వు చేసిన త్యాగం మరువలేని యాగం
మరణపు ముల్లును విరిచిన దేవుడా (2)
జీవకిరీటము నిచ్చుటకై
ముళ్ళ కిరీటము ధరించితివా (2)
నాకు నిత్య జీవమిచ్చితివా       ||కరుణ||

English Lyrics

Audio

దేవా నీ తలంపులు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ
నా యెడల నీ కరుణ
సర్వ సదా నిలుచుచున్నది (2)        ||దేవా||

స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే
స్తుతి పాడేను హృదయముతో (2)
స్తుతించి వర్ణించి ఘనపరతున్ (2)
నీవే నా రక్షకుడవని         ||దేవా||

మొదట నిన్ను ఎరుగనైతిని
మొదటే నన్ను ఎరిగితివి (2)
వెదుకలేదు ప్రభువా నేను (2)
వెదకితివి ఈ పాపిని          ||దేవా||

అద్భుతమైనది సిలువ దృశ్యం
ప్రభును కొట్టి ఉమ్మి వేసిరి (2)
ప్రభును వర్ణింప నశక్యము (2)
ప్రభువే సహించె దుఃఖము           ||దేవా||

ఎట్లు మౌనముగా నుందు ప్రభు
చెల్లింపక స్తోత్ర గీతము (2)
కాలమంతా పాడుచుండెద (2)
నీ ప్రేమ అపారమైనది           ||దేవా||

English Lyrics

Audio

Chords

నమ్మకమైన నా ప్రభు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


నమ్మకమైన నా ప్రభు
నిన్ను నే స్తుతింతును – నిన్ను నే స్తుతింతును    || నమ్మకమైన ||

కరుణతోడ పిల్చియు – స్థిరపరచి కాపాడిన
స్థిరపరచి కాపాడిన
స్థిరపరచిన నా ప్రభున్
పొగడి నే స్తుతింతును (2)        || నమ్మకమైన ||

ఎన్నో సార్లు నీ కృపన్ – విడచియుంటినో ప్రభు
విడచియుంటినో ప్రభు
మన్ననతోడ నీ దరిన్
చేర్చి నన్ క్షమించితివి (2)       || నమ్మకమైన ||

కృంగియుండు వేళలో – పైకి లేవనెత్తితివి
పైకి లేవనెత్తితివి
భంగ పర్చు సైతానున్
గెల్చి విజయమిచ్చితివి (2)        || నమ్మకమైన ||

నా కాశ్రయశైలమై – కోటగా నీవుంటివి
కోటగా నీవుంటివి
ప్రాకారంపు ఇంటివై
నన్ను దాచియుంటివి (2)          || నమ్మకమైన ||

సత్య సాక్షివై యుండి – నమ్మదగినవాడవై
నమ్మదగినవాడవై
నిత్యుడౌ మా దేవుడా
ఆమేనంచు పాడెద (2)            || నమ్మకమైన ||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

దవలవర్ణుడా

పాట రచయిత: ప్రవీణ్ కుమార్
Lyricist: Praveen Kumar

Telugu Lyrics


దవలవర్ణుడా రత్నవర్ణుడా
పదివేలలో అతిప్రియుడా
అతి కాంక్షనీయుడా (2)
ఎందుకయ్యా మాపై ప్రేమ
ఎందుకయ్యా మాపై కరుణ (2)

ఘోర పాపినైన నన్ను
లోకమంతా వెలివేసినా
అనాథగా ఉన్న నన్ను
ఆప్తులంతా దూషించగా (2)
నీ ప్రేమ నన్నాదుకొని
నీ కరుణ నన్నోదార్చెను (2)

గాయములతో ఉన్న నన్ను
స్నేహితులే గాయపరచగా
రక్తములో ఉన్న నన్ను
బంధువులే వెలివేసినా (2)
నీ రక్తములో నను కడిగి
నీ స్వారూపము నాకిచ్చితివా (2)

అర్హత లేని నన్ను నీవు
అర్హునిగా చేసితివి
నీ మహిమలో నిలబెట్టుటకు
నిర్దోషిగా చేసితివి (2)
నీ సేవలో నను వాడుకొని
నీ నిత్య రాజ్యము చేర్చితివి (2)        ||దవలవర్ణుడా||

English Lyrics

Audio

కన్నీరేలమ్మా

పాట రచయిత: Samuel Karmoji
Lyricist: శామ్యూల్ కర్మోజి

Telugu Lyrics

కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కరుణ చూపి కలత మాన్పె (2)
యేసే తోడమ్మా                             ||కన్నీరేలమ్మా||

నీకేమీ లేదని ఏమీ తేలేదని
అన్నారా నిన్ను అవమాన పరిచారా
తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని
రేపటిని గూర్చి చింతించుచున్నావా
చింతించకన్న యేసు మాటలు మరిచావా
మారాను మధురంగా మార్చెను చూసావా (2)         ||కన్నీరేలమ్మా||

నీకెవరూ లేరని ఏం చేయలేవని
అన్నారా నిన్ను నిరాశపరచారా
పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని
నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా
నేనున్నానన్న యేసు మాటలు మరిచావా
కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2)             ||కన్నీరేలమ్మా||

English Lyrics

Audio

నీ ప్రేమా నీ కరుణా

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Telugu Lyrics

నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితాన
మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన
చాలయ్య చాలీ దీవెనలు చాలు
మేలయ్య మేలు నీ సన్నిధి మేలు (2)

గురిలేని నన్ను గుర్తించినావే
ఎనలేని ప్రేమను చూపించినావే
వెలలేని నాకు విలువిచ్చినావే
విలువైన పాత్రగా నను మార్చినావే         ||నీ ప్రేమా||

చేజారిన నాకై చేచాచినావే
చెదరిన నా బ్రతుకును చేరదీసినావే
చెరనుండి నన్ను విడిపించినావే
చెరగని నీ ప్రేమకు సాక్షిగ మార్చావే        ||నీ ప్రేమా||

నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే
కల్వరిలో ప్రాణమిచ్చి నను కొన్నావే
నీ ప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే
నీ కుమారునిగా నను మార్చినావే          ||నీ ప్రేమా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME