అందమైన క్షణము

పాట రచయిత: జాషువా అరసవెల్లి
Lyricist: Joshua Arasavelli

Telugu Lyrics

అందమైన క్షణము ఆనందమయము
యేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరము
యేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరము (2)
బంగారు సొగసు కన్నా బహు అందగాడు (2)
బోళము సాంబ్రాణి కన్నా బహు సుగంధుడు

సంబరమే సంబరము శ్రీ యేసు జననము
సర్వ జగతికి మహా సంతోషము
సర్వ సృష్టికి ముందే దేవుడేర్పరిచిన
శాశ్వత జీవం ఈ ప్రభు యేసే
శాశ్వత జీవం ఈ ప్రభు యేసే

బలమైన యోధుడు దేవాది దేవుడు
దీన నరుడై మనకై పుట్టాడు
మన గాయములకు కట్టు కట్టి
మన బ్రతుకులను వెలుగుతో నింపిన
దైవతనయుని కొలువ రావా
సందేహించకు ఓ సోదరా
రక్షణ మార్గము కోరి రావా
సంశయమెందుకు ఓ సోదరా… ఓ సోదరీ…      ||సంబరమే||

పాప విమోచన నిత్య జీవం
సిలువలోనే మనకు సాధ్యం
సిలువ భారం తాను మోసి
మన దోషములను తుడిచేసాడు
సిలువ చెంతకు చేర రావా
జాగు ఎందుకు ఓ సోదరా
యేసు నామము నమ్మ రావా
జాగు ఎందుకు ఓ సోదరా… ఓ సోదరీ…      ||సంబరమే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఇద్దరొక్కటిగ మారేటి

పాట రచయిత: సాయరాం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics

ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము
దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము (2)
వివాహమన్నది అన్నింట ఘనమైనది
ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి (2)

ఒంటరైన ఆదామును చూసి
జంట కావాలని మది తలచి (2)
హవ్వను చేసి జతపరచి – ఫలించమని దీవించెను
సృష్టిపైన అధికారముతో – పాలించుమని నియమించెను (2)           ||వివాహమన్నది||

ఏక మనసుతో ముందుకు సాగి
జీవ వృక్షముకు మార్గము ఎరిగి (2)
సొంత తెలివిని మానుకొని – దైవ వాక్కుపై ఆనుకొని
సాగిపోవాలి ఆ పయనం – దేవుని కొరకై ప్రతి క్షణం (2)           ||వివాహమన్నది||

భార్య భర్తలు సమానమంటూ
ఒకరి కోసము ఒకరనుకుంటూ (2)
క్రీస్తు ప్రేమను పంచాలి – సాక్ష్యములను చాటించాలి
సంతానమును పొందుకొని – తండ్రి రాజ్యముకు చేర్చాలి (2)           ||వివాహమన్నది||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నేనంటే నీకు ఎంతిష్టమో

పాట రచయిత: కే వై రత్నం
Lyricist: K Y Ratnam

Telugu Lyrics

నేనంటే నీకు ఎంతిష్టమో
నా మంచి యేసయ్యా (2)
నా మీద నీకు ఎనలేని ప్రేమ (2)
ప్రతి క్షణము నీకే నా ఆరాధనా (2)
ఆరాధనా… ఆరాధనా – ఆరాధనా… ఆరాధనా
ఆరాధనా… ఆరాధనా – ఆరాధనా… ఆరాధనా (2)

నన్ను ప్రేమించినంతగా ఈ సృష్టిలో
మరి దేనిని ప్రేమించలేదు
నాకిచ్చిన స్థానం పరమందున
దూతలకు ఇవ్వలేదు (2)
ఈ మట్టి దేహము కొరకే మహిమను విడచి
మదిలో నిలచిన మంచి దేవుడా (2)       ||ఆరాధనా||

నన్ను రక్షించుకొనుటకు నీ రక్తమే
క్రయ ధనముగా ఇచ్చి
బంధింపబడిన నా బంధకాలు
సిలువ యాగముతో తెంచి (2)
మరణించవలసిన నాకై నిత్య జీవం
ప్రసాదించిన మంచి దేవుడా (2)       ||ఆరాధనా||

English Lyrics

Audio

నిను స్తుతియించే కారణం

పాట రచయిత: షాలేం ఇశ్రాయేల్ అరసవెల్లి
Lyricist: Shalem Ishrayel Arasavelli

Telugu Lyrics

నిను స్తుతియించే కారణం
ఏమని చెప్పాలి ప్రభువా (2)
ప్రతి క్షణము ప్రతి దినము
స్తుతియించుటే నా భాగ్యము
ప్రతి క్షణము ప్రతి దినము
స్తుతియించుటే నా జీవము      ||నిను||

ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము
అగాధ జలములలోన నీకు స్తోత్రము (2)
పరమందు నీకు స్తోత్రం
ధరయందు నీకు స్తోత్రం (2)
ప్రతి చోట నీకు స్తోత్రం
ప్రతి నోట నీకు స్తోత్రం (2)    ||నిను||

చీకటి లోయలలోన నీకు స్తోత్రము
మహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము (2)
గృహమందు నీకు స్తోత్రం
గుడిలోన నీకు స్తోత్రం (2)
ప్రతి చోట నీకు స్తోత్రం
ప్రతి నోట నీకు స్తోత్రం (2)    ||నిను||

నిన్నటి మేలుల కొరకై నీకు స్తోత్రము
ఈ దిన దీవెన కొరకై నీకు స్తోత్రము (2)
శ్రమలైనా నీకు స్తోత్రం
కరువైనా నీకు స్తోత్రం (2)
ప్రతి చోట నీకు స్తోత్రం
ప్రతి నోట నీకు స్తోత్రం (2)    ||నిను||

English Lyrics

Audio

దేవుడు దేహమును

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics


దేవుడు దేహమును పొందిన దినము
మనిషిగా మారి ఇల చేరిన క్షణము (2)
తార వెలిగెను – దూత పాడెను
పరలోకనికి మార్గము వెలిసెను (2)
స్తుతుల గానములు పాడి పరవశించెదము
యేసు నామమునే చాటి మహిమ పరిచెదము (2)

దూత పలికెను భయము వలదని
తెలిపే వార్తను యేసే క్రీస్తని (2)
చీకటి తొలగెను రారాజుకు భయపడి
లోకము వెలిగెను మరణము చెరవిడి (2)
క్రీస్తు పుట్టెనని తెలిపి సంతోషించెదము
నిత్య జీవమునే చాటి ఘనత పొందెదము (2)       ||దేవుడు||

సృష్టి కారుడు అల్పుడాయెను
అది శాపము తీయ వచ్చెను (2)
పాపము ఎరుగని మనిషిగా బ్రతికెను
మానవ జాతికి మార్గమై నిలిచెను (2)
నమ్మి ఒప్పినను చాలు తొలగు పాపములు
పరము చేరుటకు మనకు కలుగు దీవెనలు (2)       ||దేవుడు||

English Lyrics

Audio

నీతో గడిపే ప్రతి క్షణము

పాట రచయిత: జ్యోతి రాజు
Lyricist: Jyothi Raju

Telugu Lyrics

నీతో గడిపే ప్రతి క్షణము
ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)
కృప తలంచగా మేళ్లు యోచించగా (2)
నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించక
యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4)        ||నీతో||

మారా వంటి నా జీవితాన్ని
మధురముగా మార్చి ఘనపరచినావు (2)
నా ప్రేమ చేత కాదు
నీవే నను ప్రేమించి (2)
రక్తాన్ని చిందించి
నన్ను రక్షించావు (2)         ||యేసయ్యా||

గమ్యమే లేని ఓ బాటసారిని
నీతో ఉన్నాను భయము లేదన్నావు (2)
నా శక్తి చేత కాదు
నీ ఆత్మ ద్వారానే (2)
వాగ్ధానము నెరవేర్చి
వారసుని చేసావు (2)         ||యేసయ్యా||

English Lyrics

Audio

కరుణించవా నా యేసువా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


కరుణించవా నా యేసువా
ఓదార్చవా నజరేతువా (2)
నీ కృపలో అనుదినము రక్షించవా
నీ ప్రేమలో ప్రతి క్షణము లాలించవా (2)       ||కరుణించవా||

నిరాశ నిస్పృహలతో కృంగిన వేళ
బలమైన శోధన నను తరిమిన వేళ (2)
మిత్రులే శత్రువులై దూషించిన వేళ (2)
లోకమే విరోధమై బాధించిన వేళ (2)       ||కరుణించవా||

ఆత్మీయ యాత్రలో నీరసించు వేళ
నీ సిలువ పయనంలో అలసిపోవు వేళ (2)
సాతాను పోరాటమే అధికమైన వేళ (2)
విశ్వాస జీవితమే సన్నగిల్లు వేళ (2)       ||కరుణించవా||

English Lyrics

Audio

నీ కృప లేని క్షణము

పాట రచయిత: పాకలపాటి జాన్ వెస్లీ
Lyricist: Pakalapati John Wesley

Telugu Lyrics

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా

నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా (2)
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2)     ||నీ కృప||

మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప (2)     ||యేసయ్యా||

ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు (2)
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప (2)     ||యేసయ్యా||

English Lyrics

Audio

నీతో నుండని బ్రతుకు

పాట రచయిత: రాజ్ ప్రకాష్ పాల్
Lyricist: Raj Prakash Paul

Telugu Lyrics


నీతో నుండని బ్రతుకు – నిను చూడని క్షణము
ఊహించలేను నా యేసయ్యా
నిను చూడని క్షణము – నీతో నుండని బ్రతుకు
ఊహించలేను నా యేసయ్యా (2)

నీదు స్వరము వినకనే నేను
నిను విడచి తిరిగితి నేను
నాదు బ్రతుకులో సమస్తము కోలిపొయితి (2)          ||నిను||

నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసి
అంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని (2)
అయినా అదే ప్రేమ – నను చేర్చుకున్నప్రేమ
నను వీడని కరుణ – మరువలేనయ్యా యేసయ్యా        ||నీతో||

నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ
నీ వెలుగులోనే నిత్యం – నే నడిచెదన్ (2)
నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువు
నీతోనే నా బ్రతుకు – సాగింతును యేసయ్యా          ||నిను||

English Lyrics

Audio

HOME