మహిమ నీకే ఘనత నీకే

పాట రచయిత: రవీందర్ వొట్టెపు
Lyricist: Ravinder Vottepu

Telugu Lyrics


మహిమ నీకే ఘనత నీకే – నీతి సూర్యుడా (2)
న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకే ఆరాధన (2)
ధనవంతులను అణచేవాడవు
జ్ఞానులను సిగ్గుపరచువాడవు (2)
దరిద్రులను లేవనెత్తువాడవు – నీవే రాజువు (2)
యుద్ధవీరుడా శూరుడా
లోకాన్ని గెలిచిన యేసయ్యా (2)

మార్గమే తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావు
నెట్టివేయబడిన యోసేపుచే – అనేకులను కాపాడినావు            ||దరిద్రులను||

గొఱ్ఱెలకాపరియైన దావీదును – అనేకులకు రాజుగా చేసినావు
నోటి మాంద్యముగల మోషేచే – అనేకులను నడిపించినావు           ||దరిద్రులను||

English Lyrics

Audio

స్తుతి మహిమ యేసు నీకే

పాట రచయిత: అంశుమతి మేరీ
Lyricist: Amshumathi Mary

Telugu Lyrics


స్తుతి మహిమ యేసు నీకే
స్తుతి ఘనత ప్రభు నీకే (2)
ఆరాధన స్తుతి ఆరాధన (8)        ||స్తుతి||

కళ్ళల్లో కన్నీరు తుడిచావు
గుండె బరువును దింపావు (2)
వ్యధలో ఆదరించావు
హృదిలో నెమ్మదినిచ్చావు (2)
యెహోవా షాలోమ్ ఆరాధన (8)        ||స్తుతి||

నీవొక్కడవే దేవుడవు
మిక్కిలిగా ప్రేమించావు (2)
రక్తము నాకై కార్చావు
రక్షణ భాగ్యమునిచ్చావు (2)
యెహోవా రూహీ ఆరాధన (8)        ||స్తుతి||

నను బ్రతికించిన దేవుడవు
నాకు స్వస్థత నిచ్చావు (2)
నా తలను పైకెత్తావు
నీ చిత్తము నెరవేర్చావు (2)
యెహోవా రాఫా ఆరాధన (8)        ||స్తుతి||

English Lyrics

Audio

సర్వ సృష్టిలోని

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సర్వ సృష్టిలోని జీవ రాశి అంతా
నీదు మహిమనే ప్రస్తుతించగా
స్వరమెత్తి నీ మహిమ కార్యములను
ప్రతి స్థలమునందు ప్రకటించెదా
నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం
నిన్న నేడు రేపు ఒకటిగ ఉన్నవాడవు
విడువవు ఎడబాయవు నా యేసయ్యా         ||సర్వ||

ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే
ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే
నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి      ||నీవే||

నీ రూపములో నను చేసిన పరమ కుమ్మరీ
నీ రక్తమునిచ్చ్చి జాలి హృదయమా
నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి        ||నీవే||

English Lyrics

Audio

యెహోవా మహిమ నీ మీద

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యెహోవా మహిమ నీ మీద ఉదయించెను
తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును (2)
ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది
అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది (2)
లెమ్ము నీవు తేజరిల్లుము
ప్రభువు కొరకు ప్రకాశించుము (2)

చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది
జీవ వాక్యము చేబూని జ్యోతివలే లెమ్ము (2)
జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు
రాజులు నీ ఉదయకాంతికి త్వరపడి వచ్చెదరు (2)     ||లెమ్ము||

ఒంటరియైన వాడు వేయి మంది అగును
ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును (2)
ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును
నీ దుఃఖదినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను (2)          ||లెమ్ము||

English Lyrics

Audio

మహిమ నీకే ప్రభూ

పాట రచయిత: అంశుమతి దార్ల
Lyricist: Amshumathi Darla

Telugu Lyrics


మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ (2)
స్తుతి మహిమ ఘనతయు – ప్రభావము నీకే ప్రభూ (2)
ఆరాధనా… ఆరాధనా… (2)
ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే ||మహిమ||

సమీపింపరాని తేజస్సునందు – వసియించు అమరుండవే
శ్రీమంతుడవే సర్వాధిపతివే – నీ సర్వము నాకిచ్చితివే (2)       ||ఆరాధనా||

ఎంతో ప్రేమించి నాకై ఏతించి – ప్రాణము నర్పించితివే
విలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే (2)       ||ఆరాధనా||

ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి – నను పిలచి వెలిగించితివే
నీ గుణాతిశయముల్‌ ధరనే ప్రచురింప – ఏర్పర్చుకొంటివే (2)       ||ఆరాధనా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మహిమగల తండ్రి

పాట రచయిత: డేవిడ్ రాజు
Lyricist: David Raju

Telugu Lyrics


మహిమగల తండ్రి – మంచి వ్యవసాయకుడు
మహితోటలో నర మొక్కలు నాటించాడు (2)
తన పుత్రుని రక్తనీరు – తడి కట్టి పెంచాడు
తన పరిశుద్ధాత్మను – కాపుగా వుంచాడు (2)
కాయవే తోటా – కమ్మని కాయలు
పండవే చెట్టా – తియ్యని ఫలములు (2)       ||మహిమ||

నీతి పూత జాతి కర్త – ఆత్మ సుతా ఫలములు
నీ తండ్రి నిలువచేయు – నిత్య జీవ ఫలములు (2)
అనంతమైన ఆత్మ బంధ – అమర సుధా కాంతులు (2)
అనుకూల సమయమయ్యె – పూయు పరమ పూతలు (2)         ||కాయవే||

అపవాది కంటబడి – కుంటుబడి పోకు
కాపుకొచ్చి చేదు పండ్లు – గంపలుగా కాయకు (2)
అదిగో గొడ్డలి వేరు – పదును పెట్టియున్నది (2)
వెర్రిగా చుక్కలనంటి – ఎదిగి విర్రవీగకు (2)         ||కాయవే||

కలువరి కొండలో పుట్టి – పారిన కరుణా నిధి
కలుషమైన చీడ పీడ – కడిగిన ప్రేమానిధి (2)
నిజముగాను నీవు – నీ సొత్తు కావు (2)
యజమాని వస్తాడు – ఏమి ఫలములిస్తావు (2)         ||కాయవే||

ముద్దుగా పెంచాడు – మొద్దుగా నుండకు
మోదమెంతో ఉంచాడు – మోడుబారి పోకు (2)
ముండ్ల పొదలలో కృంగి – మెత్తబడి పోకు (2)
పండ్లు కోయ వచ్చువాడు – అగ్నివేసి పోతాడు (2)         ||కాయవే||

English Lyrics

Audio

యేసే గొప్ప దేవుడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు (2)
యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు (2)
స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి
ఘనతా బలము కలుగును ఆమెన్ (2)         ||యేసే||

మహా శ్రమలలో వ్యాధి బాధలలో
సహనము చూపి స్థిరముగ నిలచిన
యోబు వలె నే జీవించెదను (2)
అద్వితీయుడు ఆదిసంభూతుడు
దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2)       ||స్తోత్రము||

ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో
లోకమునకు ప్రభువును చాటిన
దానియేలు వలె జీవింతును (2)
మహోన్నతుడు మన రక్షకుడు
ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2)       ||స్తోత్రము||

జీవితమంతా ప్రభుతో నడచి
ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన
హనోకు వలె నే జీవించెదను (2)
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు
నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2)       ||స్తోత్రము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

వాడబారని విశ్వాసముతో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


వాడబారని విశ్వాసముతో
శుభప్రదమైన నిరీక్షణతో (2)
వేచియున్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా (2) యేసయ్యా
నీ రాక కోసమై – కడబూర శబ్దముకై
నీ మహిమ కోసమై – నిన్ను చేరుటకై (2)        ||వాడబారని||

మోకాళ్లపై వేచితి – కన్నీళ్ల పర్యంతమై
బీడు బారిన నేల వానకై – ఎదురు చూచినా సంఘమై (2)
సిద్ధపడియున్న వధువునై
ఆశతో వేచానయ్యా (2) యేసయ్యా         ||నీ రాక||

లేఖనములను చూచితి – గురుతులు గమనించితి
ప్రవచన నెరవేర్పులన్ని – జరుగుట గుర్తించితి (2)
రారాజువై నీవు రావాలని
ఎదురు చూచుచున్నానయ్యా (2) యేసయ్యా         ||నీ రాక||

నీటి కొరకై వేచిన – గూడ బాతును పోలిన
ఆత్మ దాహము తోడనిండి – అల్లాడుచున్నానయ్యా (2)
లోక బంధాల నుండి
నీ చెలిమి కోరానయ్యా (2) యేసయ్యా         ||నీ రాక||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

ఆనందమానందమే

పాట రచయిత: జె దేవానంద్ కుమార్
Lyricist: J Devanand Kumar

Telugu Lyrics

ఆనందమానందమే
ఈ భువిలో యేసయ్య నీ జననము (2)
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికి మహిమ ప్రభావము
భూమి మీద తనకిష్టులకు
సమాధానము కలుగును గాక
హల్లెలూయా           ||ఆనంద||

తన ప్రజలను వారి పాపమునుండి రక్షించుట
కొరకై యేసు భువికి దిగి వచ్చెను
తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించుటకు
దేవుని జ్ఞానమై వచ్చెను          ||సర్వోన్నత||

మరణ ఛాయలు చీకటిలోను కూర్చున్నవారికి
యేసు అరుణోదయమిచ్చెను
పాప శాపము నుండి ప్రజలకు విడుదలనిచ్చుటకు
క్రీస్తు నర రూపము దాల్చెను       ||సర్వోన్నత||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అమూల్య రక్తము ద్వారా

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా
సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము
ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము

మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి (2)
చెడు మాటలను పలుకుచు – శాంతి లేక యుంటిమిగా (2)        ||అమూల్య||

చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము (2)
నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి (2)        ||అమూల్య||

నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక (2)
స్వంత నీతి తోడనే – దేవుని రాజ్యము కోరితిమి (2)        ||అమూల్య||

కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను (2)
ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను (2)        ||అమూల్య||

తన రక్త ధారలలో – మన పాపములను కడిగి (2)
మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో (2)        ||అమూల్య||

పాపులమైన మన మీద – తన యాశ్చర్య ఘన ప్రేమ (2)
కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము (2)        ||అమూల్య||

మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా (2)
మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములను (2)        ||అమూల్య||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME